వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరివారంలో ఏకాకి

By Staff
|
Google Oneindia TeluguNews

తొలిచినుకుల స్పర్శకి పులకించిన భూమి గమ్మత్తైన సువాసనలని ఎలావెదజల్లుతుందో, హైటెక్‌ సిటీ లాంటిఆత్యాధునిక కట్టడాల పక్కన శిల్పారామం అదే శోభతో ప్రజల్నిఆకట్టుకుంటోంది.

ఇంకా చెప్పాలంటే జంటనగరాల ప్రజలని పల్లెపట్టుల అప్యాయతతో,కళకలంతో అలరించి,ఆహ్లాదపరుస్తున్న శిల్పారామం ప్రస్తుతం ఓ ప్రత్యేక అతిధి కోసం ఆతృతగాఎదురుచూస్తోంది. ప్రభుత్వం, అలాగే అధికార్లు అత్యంత ఉత్కంఠతోఎదురు చూస్తున్న ఆ అతిధి క్లింటన్‌ అనే విషయంవేరే చెప్పనక్కర లేదు.

అయితే అసలు ఆయనహైదరాబాద్‌ వస్తారా? లేదా? అనే విషయంలో ఇంతవరకు కచ్చితమైన సమాచారం ఏమీ లేదని కొంతమంది (ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడిగారి ప్రకారంచెప్పాలంటే గిట్టని వాళ్ళు) అంటున్నారు. ఏది ఏమయినప్పటికి ప్రభుత్వంచెబుతోంది కాబట్టి మనం కూడా ఆయన వస్తున్నారనేనమ్ముదాం.ఈ బలమైన విశ్వాసంతోనె, అత్యాధునికటెక్నాలజీ, పాశ్చాత్య సంస్కృతికి ప్రాతినిధ్యంవహించే ఆయనకి ముగ్ధత్వం మూర్తీభవించిన శిల్పారామాన్నిచూపిస్తే ఆనందంతో తబ్బిఉబ్బిఅయిపోక మానరని ప్రభుత్వం,అధికార్లు భావిస్తున్నారు.

క్లింటన్‌ భారతదేశానికివచ్చేది 20 తరువాత అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ప్రతిసంవత్సరం 15 రోజుల పాటు నిర్వహించేఉత్సవాలను ఈ సారి పొడిగించేందుకు ప్రభుత్వం తగినచర్యలు తీసుకుంటోంది. 24వ తేదీనాటికిక్లింటన్‌ హైదరాబాద్‌ వచ్చే అవకాశాలుఉన్నాయని భావిస్తుండటంతో అప్పటి వరకు ఏదో ఒకకార్యక్రమాన్ని, సందడిని శిల్పారామంలోకొనసాగించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్నహస్తకళా ప్రదర్శన మార్చి 15న ముగియగానే,మార్చి 16 నుంచి 20 వరకు అంటే 5 రోజుల పాటుఒరిస్సా ఉత్సవం ఏర్పాటు చేస్తున్నారు.

సంగీత నాటక అకాడమీసహకారంతో జరిగే ఈ ఉత్సవంలో ఒరిస్సా రాష్ట్రానికిచెందిన దాదాపు 300 కళాకారులు ఈ పాల్గొంటారని టూరిజం శాఖఉన్నతాధికారి కిషన్‌రావ్‌ తెలిపారు. వరదల కారణంగా భారీగానష్టపోయిన ఒరిస్సా రాష్ట్ర హస్త కళాకారుల సహాయార్ధం ఈఒరిస్సా ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నామని కిషన్‌రావ్‌వివరించారు.కానీ క్లింటన్‌ పర్యటనే తెర వెనుక ఉన్న ప్రధాన కారణం అని టూరిజం శాఖలోని ఉద్యోగులుఅంటున్నారు.

20 తేదీ తరువాత కూడా....అంటే, క్లింటన్‌ వచ్చే వరకు ఏదో ఒక కార్యక్రమాన్నిశిల్పారామంలో కొనసాగించడం జరుగుతుంది. అయితే ఆ కార్యక్రమాలు ఏమిటి?అనేవి ఇంత వరకు ఖరారు కాలేదు అని కిషన్‌రావు చెప్పడం గమనార్హం.శిల్పారామంలో ఏర్పాటు చేస్తున్న ప్రదర్శనల్లో జరుగుతున్నఅమ్మకాలను గురించి వ్యాఖ్యానిస్తూ, సూరజ్‌కుండ్‌మేళా కంటే ఎక్కువ అమ్మకాలు ఇక్కడ జరుగుతున్నాయి అనిఆయన అన్నారు.

మొత్తానికిశిల్పారామంలో ఓ నెల రోజుల పాటు ఏదో ఒక పండగవాతావరణం ఉండబోతోంది. కానీ ఈ అనుకోని అతిధి,అసలేరాని అతిధి అయితేనే అధికార్లకి వృధాప్రయాస. పండగలంటే ప్రజలకెప్పుడూ ఉత్సాహమే కదా !

హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X