క్లింటన్ పర్యటనమళ్ళీ పజిల్??
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువదలని విక్రమార్కునిలా క్లింటన్ నగర పర్యటనను తాత్కాలికంగా ఖరారు చేయించుకున్నప్పటికీ చివరికి లా అండ్ ఆర్డరే కీలకాంశమవుతుందనిఢిల్లీలోని అమెరికన్ దౌత్యఅధికారులు గుర్తు చేసినట్టు తెలిసింది. బిల్‌క్లింటన్ హైదరాబాద్ పర్యటన కార్యక్రమాన్ని ఖరారు చేసేందుకు ఆదివారంఇక్కడికి వచ్చిన వైట్ హౌస్ డైరెక్టర్ డొనాల్డ్ రసెంటల్‌బృందం ప్రతిపాదిత సందర్శన ప్రదేశాలైనతార్నాక లోని సి.సి.ఎం.బి, మహావీర్‌హాస్పిటల్,ఐఐఐటి, హైటెక్ సిటీ, శిల్పారామాలనుపరిశీలించారు.
ఈ సందర్భంగా వారు స్ధానిక స్ధితిగతులను, ఇటీవల బాంబుపేలుళ్ళకు కారణాలను గురించి ఉన్నతాధికారులనుఅడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24 వ తేదీన ఏడు గంటలసేపు మాత్రమే ఉండే క్లింటన్ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వంయుద్ధప్రాతిపదికన భారీ ఏర్పాట్లు చేస్తున్నది.
ఇలా ఉండగా క్లింటన్ పర్యటనకు వ్యతిరేకంగాఉద్యమిస్తున్న వివిధ విప్లవ, ప్రజాసంఘాల ఆందోళన కార్యక్రమవివరాలను కూడా అమెరికన్ ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడువాషింగ్టన్ కు పంపుతున్నారు. అయితే ఇవన్నీరొటీన్ వ్యవహారాలేనని,క్లింటన్ పర్యటనకు శాంతిభద్రతల సమస్యఅడ్డుకాబోదని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
మంత్రి మాధవరెడ్డి హత్య కారణంగాక్లింటన్ పర్యటన రద్దు కాబోదని నగరపోలీస్ కమిషనర్ సుకుమారచెప్పారు. నక్సలైట్లు వర్గ శత్రువులను హతమారుస్తారు గానీ క్లింటన్ వంటివిదేశీ అతిధుల జోలికి పోరని ఆయన భరోసావ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
