ఈ సంవత్సరం ఏప్రిల్‌ 28 నుంచి మే 11వ తేదీవరకు నిరయన మేష రాశిలో 5 నుంచి 6 గ్రహాలుసంచరిస్తున్నాయి. ఈ విధమైన గ్రహస్థితి పలుఅనర్థాలకు కారణం అవుతుందని ప్రముఖ జ్యోతిష,వాస్తు పండితుడు ప్రొఫెసర్‌ డి.ఎల్‌.ఎన్‌. మూర్తిచెప్పారు. కరవు కాటకాలు, ఉపద్రవాలు అధికంఅవుతాయని, ముఖ్యంగా ప్రజలలో భయాందోళనలుపెరుగు తాయని, ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్ధితి ఏర్పడుతుందనిఆయన వివరించారు. గురువు,శని మేష రాశిలోసంయోగం చెందడం వల్ల ప్రముఖులకు ప్రమాదాలుఏర్పడతాయని ఆయన స్పష్టం చేశారు. గ్రహ కూటమి కారణంగా ప్రస్తుతం కరవు కోరల్లో చిక్కినరాజస్థాన్‌, గుజరాత్‌ తో పాటు మరికొన్ని రాష్ట్రాలలో పరిస్థితి మరింత విషమిస్తుందని, ఫలితంగా ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు.

యుద్ధభయం లేదు..

కుజ శనుల సంయోగం ఇప్పటికేజరిగిపోయినందున యుద్ధ భయం మాత్రంలేదన్నారు. కుజుడు, శని కలిసినప్పుడు మాత్రమే యుద్ధం వస్తుందన్నారు. ప్రస్తుతవిక్రమ నామ సంవత్సరంలో నవనాయక ఫలితాలను చూస్తే రాజు బుధుడైనందునవ్యాపార దృక్పథం పెరుగుతుందని, కుజుడు సేనాధిపతి అయినందున పోరాటాలలో విజయంసాధిస్తామని చెప్పారు. ఆగస్టు నుంచిప్రభుత్వంలో అస్థిర ధోరణి పోయి నిర్దిష్టమైన,ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.

నాస్‌ డాక్‌ మరింత పతనం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైనఒడిదుడుకులకు లోనవుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ సూచికనాస్‌ డాక్‌ మరింత పతనం అవుతుందని, ఆ ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్ల పై తీవ్రంగా వుంటుందని కార్పొరేట్‌ జ్యోతిష, వాస్తు పండితులైన డాక్టర్‌మూర్తి చెప్పారు. స్టాక్‌ బ్రోకర్లు భారీగా నష్టపోతారనిఅయన చెప్పారు. జులైలో రియల్‌ ఎస్టేట్‌రంగంలో ఒడిదుడుకులకు లోనవుతుందన్నారు. పరిపాలనారంగంలో, ప్రభుత్వంలో పలు మార్పులుజరుగుతాయన్నారు.

జులై 31 వరకు దుష్ప్రభావం

జులై 31న ఈ గ్రహాలన్నీ కర్కాటకం లోకివస్తాయని, అప్పటివరకు కర్కాటకంలో వున్నరాహువు మిథునం లోకి వస్తాడని అప్పటివరకు ఈ గ్రహసంయోగం తీవ్రత వుంటుందనిఆయన చెప్పారు. ఆగస్టు నుంచి 2001 మార్చి వరకు పరిపాలనారంగంలో ఊహించని మార్పులు వస్తాయని డి.ఎల్‌.ఎన్‌వివరించారు.

ప్రొఫెసర్‌డి.ఎల్‌.ఎన్‌.మూర్తి
కార్పోరేట్‌ జ్యోతిష,వాస్తు పండితులు
సికింద్రాబాద్‌.

నవంబర్‌ లో యుద్ధ భయం
డాక్టర్‌. సి.హెచ్‌. సుబ్రహ్మణ్యం

ఆర్థిక సంక్షోభం...యుద్ధ భయం
శ్రీ. వి.ఆర్‌.కె. మూర్తి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+