వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌:విద్యుత్‌ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ శాసనసభడిప్యూటీ స్పీకర్‌, మెదక్‌ జిల్లా సిద్ధిపేటతెలుగుదేశం శాసనసభ్యుడు కె. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడుకు గురువారం ఒక లేఖరాశారు.విద్యుత్‌ ఛార్జీలను భారీగా పెంచడం తెలంగాణ,రాయలసీమ, కోస్తా మెట్ట ప్రాంతం ప్రజలపై చావుదెబ్బ అని చంద్రశేఖరరావు తన లేఖలోవ్యాఖ్యానించారు. పదహారేళ్లుగా తెలంగాణ ప్రాంతానికిప్రాతినిధ్యం వహిస్తున్న నేను పెరిగిన కరెంట్‌ ఛార్జీలను ఈ ప్రాంతంరైతాంగం భరించలేదని భావిస్తున్నాను. ఏకబిగిన ఇంత భారం మోపడంవాంఛనీయం కాదు అని ఆయన తనఅభిప్రాయాన్ని కచ్చితంగానే వెల్లడించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పీపుల్స్‌వార్‌పై కేంద్రప్రభుత్వంత్వరలో నిషేధం విధిస్తుందని కేంద్ర హోంమంత్రిఎల్‌.కె. అద్వానీ గురువారం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరుకున్నదీ, అడిగిందీ అదే. అయితే,తాను నక్సలైట్లతో చర్చలకు సిద్ధమేనని ఇటీవల ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనకు అర్థమేమిటి? ఈనేపథ్యంలో కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూడాలనేదిప్రశ్న. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న నిషేధం దేశానికంతటికీఅమలు చేయడం వల్ల నక్సలైట్‌ కార్యకలాపాలు తగ్గుముఖంపడతాయా?

ఒక వైపు చర్చల గురించి మాట్లడుతూనేమరో వైపు మరింత కఠినంగా ప్రభుత్వంనక్సలైట్లను అణచివేయడానికి చర్యలు చేపట్టడం గురించిప్రస్తావించినపుడు- చర్చలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం షరతులు పెడుతూనేవున్నదని, ఆయుధాలు విసర్జిస్తే తాము తీవ్రవాదసంస్థలతో చర్చలకు సిద్ధమేనని రాష్ట్ర ప్రభుత్వంఅన్నట్లుగానే కేంద్ర హోంమంత్రి అద్వానీ అన్నారని,ఇందులో పెద్ద తేడా ఏమీ లేదని మానవహక్కుల వేదిక నాయకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయంరాజకీయ శాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ ఎం. కోదండ రామిరెడ్డి ఇండియాఇన్ఫోతో అన్నారు. తమపై నిషేధం వున్నా లేకున్నా ఒక్కటేననిపీపుల్స్‌వార్‌ గతంలో ఏనాడో ప్రకటించింది. పైగాపీపుల్స్‌వార్‌ చర్యలు పెరుగుతూ వస్తున్నాయి. 1980 ప్రాంతంలో ఏర్పడినపీపుల్స్‌వార్‌ కార్యకలాపాలు కొండపల్లి సీతారామయ్య,కె.జి. సత్యమూర్తిలాంటి అగ్రనాయకులువిభేదించి బయటకు వచ్చినా, ముక్కు సుబ్బారెడ్డి,మల్లిక్‌, శివాజీ లాంటి ముఖ్యనాయకులులొంగిపోయినా, పులి అంజయ్య, పున్నంచంద్‌, రమాకాంత్‌ లాంటినాయకులను గతంలో ఇటీవల నల్లా ఆదిరెడ్డి,మహేష్‌ అలియాస్‌ సంతోష్‌ రెడ్డి, నరేష్‌లాంటిఅగ్రనేతలు మరణించినా తగ్గుముఖం పట్టకపోగా పెరుగుతూవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రారంభమైనపీపుల్స్‌వార్‌ ఇటీవలి కాలంలో బీహార్‌,మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో కూడా తన కార్యకలాపాలనుపెంచింది. ఈ దృష్ట్యా ఆయా రాష్ట్రాలు విడివిడిగా కాకుండానేరుగా కేంద్రప్రభుత్వమే పీపుల్స్‌వార్‌పై నిషేధంవిధించింది. అయితే, ఈ నిషేధం పీపుల్స్‌వార్‌పైఅదనంగా పడే ప్రభావమేమీ ఉండదని, సాధారణప్రజలపై ఆ ప్రభావం పడుతుందని పౌరహక్కుల ప్రజా సంఘం(పియుసిఎల్‌) జాతీయాధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాదికె.జి. కన్నాభిరాన్‌ ఇండియా ఇన్ఫో అన్నారు.

నక్సలైట్‌ సమస్య కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమేకాదని మాటవరుసకు మాత్రమే ప్రభుత్వంఅంటోంది. ఈ సమస్యను శాంతిభద్రతలసమస్యగానే పరిగణించి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వధోరణిస్పష్టంగానే అర్థమవుతుంది. రాజకీయాలను నిషేధంవిధిస్తే నియంత్రణ సాధ్యం కాదని కోదండరామిరెడ్డిఅన్నారు. ఆ రాజకీయాలకు సామాజిక పునాది వున్నంతవరకు నక్సల్స్‌ వుద్యమం లాంటివి కొనసాగుతూనేవుంటాయని, కేంద్రప్రభుత్వ నిషేధం వల్లప్రభుత్వానికి అదనంగా చేకూరే ప్రయోజనం కూడా ఏమీలేదని, ఈ నిషేధం సాధారణ ప్రజానీకాన్ని వేధించడానికి పనికివస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి నక్సల్స్‌ సమస్యనుపరిష్కరించాలనే వుద్దేశం లేదని,ప్రపంచీకరణలో భాగంగా సరళీకృత ఆర్థిక విధానాలఅమలుకు నక్సల్స్‌ సమస్యను ప్రభుత్వం కావాలని శాంతిభద్రతల సమస్యగా తీసుకుంటోందని,పీపుల్స్‌వార్‌పై కేంద్రప్రభుత్వం నిషేధంవిధించాలని నిర్ణయించడం నిజంగా బాధాకరమని కన్నాభిరాన్‌అన్నారు.

పీపుల్స్‌వార్‌ 1987లో గర్తేడులో ఐఎఎస్‌అధికారులను కిడ్నాప్‌ చేయడంతో తన సంచలన కార్యక్రమాలకుశ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఎన్‌టి రామారావు ప్రభుత్వహయాంలో మండలాధ్యక్షుడు మల్హర్‌రావును హత్యచేసింది. దీంతో ప్రభుత్వం పీపుల్స్‌వార్‌ అణచివేతకు కఠినచర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. దీంతోపీపుల్స్‌వార్‌ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడానికిబదులు పెరుగుతూ వచ్చాయి. మాజీ మంత్రిహయగ్రీవాచారి లాంటి నాయకులనే కాకుండా పోలీసుఉన్నతాధికారులు వ్యాస్‌, పరదేశినాయుడు,ఉమేష్‌ చంద్ర లాంటివారిని కూడా చంపే స్థితికిచేరుకుంది. ఇటీవలి కాలంలో శాసనసభ్యుడుపురుషోత్తమరావును, ఆ తర్వాత ఐపిఎస్‌ అధికారిఉమేష్‌ చంద్రను చంపిన పీపుల్స్‌వార్‌ చర్యలుపంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని చంపడంతో శిఖరస్థాయికిచేరుకున్నాయి. ఈ క్రమంలోనే పీపుల్స్‌వార్‌ పలువురుముఖ్యనాయకులను ఎన్‌కౌంటర్లలోకోల్పోయింది. ఈ పరస్పర హరణోద్యోగానికికేంద్రప్రభుత్వ నిషేధం బ్రేక్‌ వేయగలదా?లేదనే అంటున్నారు కన్నాభిరాన్‌. పీపుల్స్‌వార్‌నక్సలైట్లు ఉమేష్‌చంద్రను చంపారు,కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ముగ్గురు పీపుల్స్‌వార్‌నక్సలైట్లను చంపారు.

నక్సలైట్లు మాధవరెడ్డిని చంపారు.ఇది ఇట్లా కొనసాగుతూనే వుంటుంది. కేంద్రప్రభుత్వం నిషేధంవిధిస్తే హింస మరింత పెరుగుతుంది అనిఆయన అన్నారు.

ఇరువైపులా హింస సాగుతున్నక్రమంలోనే శాంతి సాధనకు ఎన్‌టి రామారావుహయాం నుంచి ప్రయత్నాలు సాగుతూనే వున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ప్రశాంతవాతావరణం కోసం శాంతి సంఘాన్ని ఏర్పాటు చేయాలనిహైకోర్టు ఒకానొక సందర్భంలో ప్రభుత్వానికి చేసిన సూచననేపథ్యంలో కూడా చర్చలకు ప్రయత్నాలుసాగాయి. ఇటీవల మాజీ ఐఎఎస్‌ అధికారి శంకరన్‌, కన్నాభిరాన్‌ తదితరులతోపౌరస్పందన వేదిక ఏర్పాటయి శాంతి సాధనకుప్రయత్నాలు కూడా చేసింది. ఈ ప్రయత్నాలేవీఫలితాలివ్వలేదు. కేంద్రప్రభుత్వ నిర్ణయానికిముందు ప్రజాగాయకుడు, ఎఐఎల్‌ఆర్‌సి కార్యదర్శిగద్దర్‌, విప్లవ కవి వరవరరావు చర్చలకు ప్రతిపాదన కూడాచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూలంగాప్రతిస్పందించినట్లే కనిపించారు. ఈక్రమంలోనే నక్సలైట్ల అణచివేతకుకేంద్రం నిషేధ నిర్ణయాన్ని తీసుకుంది.

తాను ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం(ఎపిసిఎల్‌సి) అధ్యక్షుడిగా వున్నపుడు అప్పటి ముఖ్యమంత్రిఎన్‌టి రామారావుతో చర్చలు జరిపామని, తమ ప్రతిపాదనమేరకు మూడు నెలలు ప్రభుత్వం వైపునుంచి ఎన్‌కౌంటర్లు జరగకుండా ఎన్‌టి రామారవుచర్యలు తీసుకున్నారని కన్నాభిరాన్‌ చెప్పారు. ఆ తర్వాత డాక్టర్‌ చెన్నారెడ్డితో కూడా మాట్లాడామనిఆయన చెప్పారు. ఈ మధ్యకాలంలో పౌరస్పందనవేదిక తరఫున కూడా ప్రయత్నాలుచేశామని, హోంమంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌తో కూడా మాట్లాడామనిఆయన చెప్పారు. ఇప్పుడు కూడా తమకు నమ్మకంవుందని ఆయన చెప్పారు. అయితే, ఇరువైపులా పెడుతున్న షరతులుచర్చలకు తావున్నట్లు అనిపించడం లేదు.

ప్రభుత్వం నిషేధం విధించి మరింత కఠినంగావ్యవహరిస్తే నక్సల్స్‌ సమస్య పరిష్కారం అవుతుందాఅనేది ప్రశ్న. కన్నాభిరాన్‌యే కాకుండా కోదండరామిరెడ్డి కూడా ఆవిధంగా పరిష్కారం కాదని కచ్చితంగానే చెబుతున్నారు.పైగా సమస్యను పరిష్కారం చేయాలనే వుద్దేశంప్రభుత్వానికి లేదని అంటున్నారు. ప్రభుత్వానికిదీర్ఘకాలిక ఆలోచనతో చర్యలు తీసుకుంటే తప్ప సమస్య పరిష్కారంకాదని, కేవలం నిషేధం వల్ల సమస్య పరిష్కారంకాదని తెలిసి కూడా ప్రభుత్వం నిషేధంవిధిస్తోందని కోదండరామిరెడ్డి అన్నారు. ఆర్థిక, సామాజిక కోణంనుంచి సమస్యను పరిష్కారం చేయాలనే ఆలోచనచేయకుండా నిషేధం విధించి పరిష్కరించాలనిచూస్తే వుద్యమం మరింత పెరుగుతుందని కన్నాభిరాన్‌అన్నారు.

పీపుల్స్‌వార్‌ మౌత్‌పీస్‌గా పేరుపడినఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం (ఎపిసిఎల్‌సి)రాజ్యహింసనే కాకుండా ప్రయివేట్‌ హింసను(నక్సలైట్ల హింస కూడా దీని కిందికే వస్తుంది) కూడాఖండించాలనే వాదన ముందుకు రావడంతోనిలువునా చీలిపోయింది. ప్రయివేట్‌ హింసను కూడా వ్యతిరేకించాలనివాదించినవారు మానవ హక్కుల వేదికను ఏర్పాటుచేసుకున్నారు. నక్సలైట్ల హింస పెరుగుతున్నకొద్దీ పీపుల్స్‌వార్‌కు బయటి నుంచి మేధావులమద్దతు తగ్గుతూ వస్తోంది.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X