ఫిక్సింగ్‌లో అజర్‌తో పాటు బిజలానీ
తెలుగు సినిమా ప్రపంచంలో బ్రహ్మానందమాయ జరిగిపోయింది.అదీ, తెలుగు సినిమాల ద్వారానవ్వుల పంటలు పండించిన రేలంగి పేరు మీద ఆమాయ జరిగడం విచిత్రమనుకోవాలా, విచారపడాలా? రేలంగివిగ్రహాన్ని నెలకొల్పడానికి దాదాపు రెండేళ్ల క్రితం తెలుగు సినిమాహాస్యనటులందరూ కలిసి ఒక ట్రస్టును ఏర్పాటు చేసిడబ్బులు పోగు చేశారు.
ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో గానీముందు శివాజీరాజా అనే నటుడు- నటుడిగాబ్రహ్మానందం అంటే తనకిష్టమని, వ్యక్తిగాఆయనను తాను ఇష్టపడనని అన్నాడు. శివాజీరాజా శివమెత్తిన తర్వాతదాదాపు 15మంది హాస్యనటులు ఏకమై బ్రహ్మానందంమీద అవినీతి ఆరోపణలు చేశారు. ట్రస్టు డబ్బులుబ్రహ్మానందం వాడేసుకున్నాడని వారుఆరోపించారు.
ఈ వివాదం ప్రముఖ దర్శకుడు దాసరినారాయణరావు సమక్షంలో పరిష్కారమైంది. తానువిగ్రహస్థాపనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామనిబ్రహ్మానందం దాసరి సమక్షంలో చెప్పారు. అయితే, ఆ తర్వాత ఏంజరిగిందో గానీ ఈ హాస్యనటులెవరికీ రేలంగివిగ్రహం జ్ఞప్తికే వచ్చినట్లు లేదు. రేలంగివిగ్రహం కన్నా మరేం ముఖ్యమైపోయాయోతెలియదు, ఎవరూ నోరు మెదపడం లేదు.అంతా బ్రహ్మానంద మాయ అనుకోవాల్సిందేనా?












Click it and Unblock the Notifications
