వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవ్వాల్టి తాజా ఖబర్‌.....ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ఆచార్యులుకవిశాసన బిరుదాంకితులయ్యారు.

By Staff
|
Google Oneindia TeluguNews

సాహిత్యరంగం అంటేనే ఇవ్వాళ రేపు సగంసందడి. అధికార కవులు, నక్సలైటుకవులు, ఆడ కవులు, మగకవులు, స్త్రీవాదకవులు,మైనారిటీ కవులు....పైగా వీళ్ళందరిలో ఉండేఈగోలు, ప్రేమలు, కుట్రలు, ఆరోపణలు, సహకారవ్యాసాంగాలు, మార్కెటింగ్‌ టెక్నిక్‌లతో ప్రజలకి బోలెడంత కాలక్షేపంఅవుతోంది.

ఇటువంటి నేపథ్యంలో రఘుమన్న అనే ఈ ఆచార్యుడువేదకవి అవతారంలో ప్రత్యక్షమయ్యారు (కారణాంతరాలవల్ల 11 సంవత్సరాలు అజ్ఞాత(న ?)ంలోఉన్నారట. మూడు నాలుగేళ్ళ నుంచే ప్రజలమధ్యకి రావడంతో ఇప్పుడిప్పుడే పేరు వస్తోందట). అలనాడువివేకానందుడు ధరించిన వస్త్రధారణతో ,పాముకోళ్ళతో (కాలేజీకి కూడా రోజూ ఇవే వేసుకొస్తారు )కవిశాసన బిరుదును అందుకునేందుకుయూనివర్సిటీలోని తెలుగు విభాగం నుంచివేద మంత్రాలతో ఆడిటోరియంకు ఆయన విచ్చేశారు.తాను చెసే ప్రసంగాల్ని వింటే తప్ప విద్యార్ధులుబాగుపడరని గాఢంగా నమ్మే ఆయన విద్యార్ధినీవిద్యార్ధులను తన ఈ కార్యక్రమానికి స్వయంగాఆహ్వానించుకున్నారు.

ఇంతకీ ఈ బిరుదు వెనుక ఉన్న కథాకమామీషుఏమిటనే విషయాన్ని ఓ చిన్న కథలా చెప్పుకుతీరాల్సిందే.

అనగా అనగా ఒక హెడ్‌.. ఆయనే మన రఘుమన్న(ఆయన మాత్రం తెలుగు విభాగం అధ్యక్షుడిని అనిముద్దుగా చెప్పుకుంటారు). మన రఘుమన్న గారికి ఓ సారి బోలెడంతదిగులేసింది. ఇన్నేళ్ళుగా యూనివర్సిటీలో పని చేస్తున్నాను కానీనన్నెవరూ పొరపాటున గుర్తించి, ఓ బిరుదిచ్చినవాళ్ళు లేకపోయారు. గొప్పవాడినైన నాకుబిరుదు లేకపోవడం ఎంత అవమానకరం?అనిఆయన బాధపడ్డారు. సహజంగానే కొద్దో గొప్పో రాజుల కాలంనాటి బూజు ఆలోచనలున్నరఘుమన్నగారు....సామాజిక నేపథ్యాలపైస్పందించి కవిత్వం రాయలేరు...స్త్రీలకి, దళితులకిఅన్యాయం జరిగింది....వారు అణచివేయబడ్డారు అనిఅంగీకరించలేరు....పైగా మనుస్మృతి మీద తీవ్రనమ్మకం.....వర్ణవ్యవస్థను పెంచిపోషించాలనుకునే తత్వం.....కనుక వీటన్నిటికీఅతీతమైన శక్తిని ఒకదాన్ని మాధ్యమంగాఎంచుకుంటే తప్ప సాహిత్యరంగంలో పేరువచ్చేట్టు లేదని గుర్తించారు. ఈ రకంగా ...ఆయన వెతగ్గా,వెతగ్గా.....వేదం చిక్కింది. ఇస్లాం, క్రైస్తవంఅస్థిత్వాలను గుర్తించను....చరిత్ర చెప్పిన లెక్కలుఅబద్దాలు....చిన్న తాడుతో పెద్ద చెరువునుకొలవగలరా? అని ప్రశ్నించే రఘుమన్న ప్రపంచానికివేదం ఒక్కటే మూలం అని తానొక్కడే కొలిచి చెప్పగలను అని తీర్మానించుకున్నారు.

ఇంకేముంది ఆ ప్రయోగం ఏదో ముందుగా పాఠశాలనుంచీ పెట్టారు. పాఠశాల అంటే గుర్తుకొచ్చింది.నగర శివార్లలో 30 ఎకరాల స్థలంలో ఆయనొక ఆశ్రమాన్ని(లేదా పాఠశాలని) నడుపుతున్నారు. ఇక కళాశాలలోనిక్లాస్‌రూమ్‌కు వస్తే, ఆఖరికి శకుంతలా దుష్యంతులప్రణయగాధ గురించి విద్యార్ధులకి పాఠం చెపుతున్నాకూడా......ఇలాగే ప్రేమించాలని వేదంలో ఎప్పుడో చెప్పారు ....అని ఓమెలిక పెట్టి చెప్పేవారు. వేదం అన్నిటికీ ప్రామాణికం అని రోజూనూరిపోస్తున్నాను సరే... వేదాల్ని ఒక పాఠ్యాంశంగా చేరిస్తే ఎలాఉంటుంది? అని కూడా ప్రయత్నించి చూశారు. కానీ అధ్యాపకులు,విద్యార్ధుల నుంచి ఇందుకు వ్యతిరేకత వ్యక్తం కావడంతోకల్లు తాగడం అలవాటైన వారికి పాలు తాగటం ఎలానేర్పగలను అంటూ విసుక్కున్నారు. వేదాన్ని పాఠ్యాంశంగాప్రవేశపెడితే దానికి ఆద్యుడిగా (అంటేటెక్ట్స్‌ బుక్స్‌ అవీ రాసి ) వెలగొచ్చుకదా ...అనే ఆయన ఆలోచనబెడిసి కొట్టడంతో కొంత కాలం ఊసూరుమన్నరఘుమన్న....ఐడెంటిటీ క్రైసెస్‌ నుంచిఎలాగైనా సరే బయటపడాలనుకున్నారు.

అయితే పేరు తెచ్చుకోవడం అంతసులభమైన విషయం కాదు కదా ! ఏదో ఒక సంస్థవారికి డబ్బు ముట్టజెప్పి చేయించుకుందామనుకున్నావారితో బోలెడన్ని ఇబ్బందులు. డబ్బు మనదైనప్పటికీవాళ్ళ ఇష్ట్రప్రకారం చేయించుకోవాలి. పైగా వాళ్ళిష్టమొచ్చినవాళ్ళని పిలిచి పొగిడిస్తారు. ఐదు, పది నిమిషాలు తప్పితేమన ప్రతిభను బయటపెట్టుకునే అవకాశం ఉండదు. కనుకఆయనొక ఆలోచన చేశారు. రాజసూయ యాగం చేస్తేవెరైటీగా ఉంటుంది (రాచరికపు అంశ తనలో ఎక్కువగా ఉన్నట్టుఆయన ఫీలవుతుంటారు లెండి !) అనుకున్నారు.ఇందుకోసం ఏదో ఒక వేదిక అంశం కావాలి కనుక తనకునచ్చిన 20 అంశాలు ఇచ్చి , వాటిని గురించి తనతోవాదన చేసి గెలిచిన వారికి 25,000 (ముందు 50,000కు బేరంపెట్టి మళ్ళీ తగ్గారు) రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటిస్తేబాగుంటుంది అనుకున్నారు.

కానీ మేధావులు...కవులు వాదించడానికివస్తే ఎలా ? అనే ప్రశ్న ఎదురయ్యింది. వీళ్ళందరూఅకవులు, అజ్ఞానులు, వాళ్ళ మేధావిత్వాన్ని నేను గుర్తించడంలేదు....అనేస్తే పోలే....అనుకున్నారు. వచ్చినఒకరిద్దరు హేతువాద సంఘాలను మీరు అర్హులు కారుఅంటూ రఘుమన్న పంపించివేశారు. మొత్తానికి ఇలాబరిలో ప్రత్యర్ధి అంటూ రాకుండా లేకుండా నానారకాలుగాప్రయత్నించి నెగ్గారు. మరిక బిరుదును అలంకరించుకోవడమే తక్కువ కనుకవేదం జీవనాదం అని నమ్మే

వారిని ఒక చోట పోగేసి , ఇలాంటి అంశాల కుమద్దతు నిచ్చే ఒక విద్యార్ధి సంస్థఅండదండలతో రంగ రంగ వైభోగంగా,రాజువెడలే నన్నట్లు రధారోహణం కూడా చేసి చిరకాలంగా తనలోఉండిపోయిన కోరికలు, ముచ్చట్లను సోమవారం నాడువాస్తవం చేసుకున్నారు.

ఆయన బోధనల్ని అంగీకరించని వారందరూఅజ్ఞానులు. కనుక వారితో వాదించడానికి ఆయనసిద్ధంగా లేరు. అలాగే విశ్వవిద్యాలంయంలో పనిచేసే ఏ ఇతర అధ్యాపకునికీ కూడా బొత్తిగాజ్ఞానం లేదు. కనుక వారు పనికిమాలిన పాఠాలువిద్యార్ధులకు చెపుతున్నారు, పోనీ తాను సరైన పాఠాలుచెబుదామంటే అంగీకరించడం లేదు. ఇంగ్లీషువాళ్ళు ప్రవేశపెట్టిన వెధవ ఉద్యోగాన్నేపరమావధిగా భావిస్తున్నారు అని సభాముఖంగాతెలియజేశారు. ఏదో మాట వరసకి ఇలా ఇంగ్లీషు ఉద్యోగం అని తిట్టారుకానీ, తన ప్రతిష్టను మనసులో పెట్టుకుని చేసిన ఈరాజసూయయాగానికి తాను ఉద్యోగం చేసే తెలుగు విభాగాన్నేకార్యాలయంగా వాడుకున్నారు. ఎంత హెడ్‌ అయితే మాత్రం తెలుగు విభాగంమీ సొంత ఆస్తా ?అని ప్రశ్నించిన వారు మేధావిని గౌరవించలేని ,మర్యాదలేని వారు కనుక ఆయన సమాధానంఇవ్వరు.

ఇంకా చెప్పాలంటే సంవత్సరం ముందే ఈబిరుదును స్వయంగా తనకు తాను ప్రధానం చేసుకున్నారనిఆయన రాసిన పుస్తకాల ప్రతులు చెపుతున్నాయి.

ఇదిలా ఉండగా , తమ అధ్యాపకుడురాజసూయయాగం చేయడం, రధారోహణచేయడం పట్ల విద్యార్ధులు ఏ విధంగాప్రతిస్పందిస్తున్నారు అన్న విషయానికి వస్తే, విద్యాలయంఆవరణలో తన సొంత ఫంక్షన్‌ చేసుకోవడాన్ని,ఆయన చేస్తున్న ఆర్భాటాన్ని కొందరు విద్యార్ధినీ ,విద్యార్ధులు తప్పు పడుతున్నారు. కానీ వేదంపైనమ్మకం, హిందూ భావజాలంపై ప్రేమ కలవిద్యార్ధినీ విద్యార్ధులు రఘుమన్న మేధావి అనిగుర్తిస్తున్నారు. అయితే తెలుగు విభాగంలోనిఆయన కొలీగ్స్‌ రఘుమన్న పోకడల పట్ల అసంతృప్తినివ్యక్తం చేస్తున్నారు. నియమాలను అతిక్రమించినప్పటికీ,రాజకీయ అండ కలిగిన వారికి విశ్వవిద్యాలయాల్లోఆదరణకి కొదవేం ఉండదని మరో సారి రుజువుఅయింది.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X