వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోస్తా గుండెల్లో పెనుతుపాను!     Home Talk of Today FullStory

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః స్థానిక ఎన్నికల ఎన్నికలను వచ్చే ఏడాది ఫిబ్రవరి ఆఖరు నాటికి కల్లా నిర్వహించాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలిసింది. విద్యుత్‌ ఛార్జీల పెంపు, ప్రస్తుతం రైతాంగాన్ని కష్టాల కడలిలోకి నెట్టిన విద్యుత్‌ కోత తదితర సమస్యలు అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా పరిణమించకుండా చూడడంతో పాటు విజయభేరి మోగించేందుకు వీలైన పకడ్బందీ వ్యూహాన్ని చంద్రబాబు నాయుడు రూపొందిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.

ప్రస్తుతం ఐదంచెలుగా వున్న పంచాయతీ వ్యవస్థను మూడంచెలుగా కుదించే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం కొంత కాలంగా మండల, జిల్లా ప్రజాపరిషత్‌ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న విషయం విదితమే. అయితే 2001 మార్చి లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో తెలుగుదేశం ప్రభుత్వం అనివార్యంగా స్థానిక సమరానికి సిద్ధం కావాల్సి వచ్చింది.

సుప్రీంకోర్టు మార్చి నెలాఖరు వరకు గడువు ఇచ్చినప్పటికీ ఫిబ్రవరి నెలాఖరులోగానే స్థానిక ఎన్నికలు జరిపించాలని చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తే కరెంటు కోత, విద్యార్థులకు పరీక్షలు, ఎండలు ముదరడం వంటి సమస్యలు తలెత్తుతాయని, అనూకూల వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఫిబ్రవరి నెలాఖరులోనే మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించనట్లు తెలిసింది.

ఈలోగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు పార్టీ వర్గాలను ఆదేశించినట్లు చెబుతున్నారు. సమయం తక్కువగా వున్నందున బూత్‌ స్థాయి, గ్రామ కమిటీలు, మండల స్థాయి కమిటీల ఏర్పాటు సత్వరం పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారని అంటున్నారు. జిల్లా కమిటీల ఎన్నికలు అవసరమైతే మేలో జరిగే రాష్ట్ర స్థాయి ఎన్నికలతో పాటుగా జరుపుకోవచ్చునని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

బూత్‌ కమిటీలే ప్రాణం

రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా 60 వేల బూత్‌ కమిటీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని, స్థానిక ఎన్నికల్లో ఈ బూత్‌ కమిటీలో పార్టీ విజయానికి టానిక్‌ లా పనిచేస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రతి వెయ్యి ఓటర్లకు ఒక బూత్‌ కమిటీ వుంటుంది కాబట్టి వంద మందితో బూత్‌ కమిటీలు ఏర్పాటు చేస్తే, ఆ పరిథిలో వుండే ఓటర్లను తెలుగుదేశం బూత్‌ కమిటీ నేతలను ప్రభావితం చేసే వీలుంటుందని కూడా చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ విధంగా అట్టడుగు స్థాయి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలని చంద్రబాబు వ్యూహం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం
శిరోభారంగా మారిన విద్యుత్‌ సమస్య కారణంగా రైతాంగంలో ఎదురయ్యే వ్యతిరేక ధోరణిని కూడా ఈ బూత్‌ కమిటీల ద్వారా తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తున్నది.

పటిష్టమైన వ్యూహంతో చంద్రబాబు సంస్థాగత సమరానికి సన్నాహాలు చేస్తుండగా, తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఎం. సత్యనారాయణ రావు తెలుగుదేశం మైనస్‌ పాయింట్లను సొమ్ము చేసుకొని, సంస్థాగత ఎన్నికల్లో సత్తా చూపేందుకు ఏ విధమైన వ్యూహం రూపొందిస్తారో వేచి చూడాలి.

గత సంచికలో

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X