వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమ విఫలమై.....

By Staff
|
Google Oneindia TeluguNews
అరుదైన ఘట్టం 2000సంవత్సరం మే నెలలో గగనసీమలో సాక్షాత్కరించనున్నది. ఈవిశేష విన్యాసం ప్రత్యేక సాధనాలతో చూస్తే తప్పమామూలుగా కంటికి కనిపించదు. అయితే గ్రహకూటమి ప్రభావం భూతలంపైన, దానిపై నివశించే ప్రాణికోటి పైనా వుంటుందనిఖగోళ, జ్యోతిష పండితులు చెబుతున్నారు. 1941లో ఇదేవిధంగా వృషభ రాశిలో గురువు, శని సంయోగంచెందిన ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధ...కరవు, కాటకాలు...ఆర్థిక సంక్షోభ పరిస్థితులుతలెత్తాయని సాయన జ్యోతిష పండితులు చెబుతున్నారు. 60 ఏళ్ళ తరువాతవస్తున్న అదే విధమైన గ్రహకూటమి ప్రభావం ఎలావుంటుంది? అనే ప్రశ్న తలెత్తడంసహజం.

గ్రహకూటమి......ప్రభావం?
గ్రహస్థితినినిర్ధారించడంలో నిరయన పద్ధతి, సాయనపద్ధతి అని రెండు రకాలు వున్నాయి. నిరయనపద్ధతిని భారతీయ పద్ధతి అని, పాశ్చాత్యదేశాలలో అనుసరించే పద్ధతిని సాయనపద్ధతి అని స్ధూలంగా విభజించవచ్చు. నిరయనపద్ధతిలో గ్రహాలు సాయన పద్ధతిలోగ్రహాల కంటే సుమారు 24 డిగ్రీలు వెనుకవున్నట్లులెక్కిస్తారు. ఈ తేడా కారణంగా నిరయన పద్ధతి ప్రకారంమేష రాశిలో గ్రహకూటమి జరుగుతున్నది.సాయన పద్ధతిలో వృషభ రాశిలో జరుగుతున్నది.

నిరయన పద్ధతి ప్రకారంచూస్తే ఏప్రిల్‌ 28, 2000 నుంచి మేష రాశిలో ఐదు గ్రహాలసంయోగం జరుగుతున్నది. ఆ తరువాత అమావాస్యఅంటే మే 4న తేదీ నాటికి చంద్రుడు కూడాఅక్కడకు రావడంతో ఆరు గ్రహాలు ఒక్క చోట చేరుతున్నాయి. ఇలాఅధిక సంఖ్యలో గ్రహాలు ఒక చోట చేరడంవిశేషమైన అంశమని జ్యోతిష పండితులు చెబుతున్నారు.మే 11 వరకు ఐదు గ్రహాలు మేషం లోనేవుంటాయి. దీని ప్రభావం ఎలా వుంటుంది?

శ్లోకంః
యదార శౌరి సురరాజమంత్రియద్యేక రాశౌ అవంతి
లంకాపుర మధ్యదేశే క్షుధాభయం,శస్త్రభయం నృణాం

తాత్పర్యం ః
కుజుడు, శని, గురువు ఒకేరాశిలో వుంటే అవంతి నుంచి లంకాపుర వరకువున్న ప్రాంతంలో కరవుకాటకాలు, యుద్ధభయంతో ప్రజలు కష్టనష్టాలకుగురవుతారు.

మేషంలో బుధ,గురు, శుక్ర, శని, చంద్ర, సూర్య గ్రహాలుకలుస్తున్నాయి. మిగిలిన గ్రహాల ప్రభావం ఎలావున్నా గురు, శనుల కలయిక మాత్రం తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని పండితులువ్యాఖ్యానిస్తున్నారు. ఈ గ్రహస్థితి పై నిరయన జ్యోతిష పండితులఅంచనాలుః

  • మధ్య, ఉత్తర భారత దేశంలో కరవు కాటకాలు మరింత తీవ్రం అవుతాయి.
  • దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతుంది.
  • ప్రపంచ ఆర్థిక రంగంలో కూడా ఊహించని దుష్పరిణామాలు.
  • ప్రముఖులకు ప్రమాదాలు.
  • సమ్మెలు, నిరసనలు, ఆందోళనలు.
  • పాలకులకు కష్టనష్టాలు
  • స్టాక్‌ మార్కెట్లకు కష్టకాలం
  • 31 జులై వరకు ఇదే పరిస్థితి
  • ఆగస్టు నుంచి 2001 మార్చి లోగా పరిపాలనా రంగంలో పెను మార్పులు.

ఇక సాయన సిద్ధాతాలకుఅనుగుణంగా వృషభ రాశిలో రవి, గురువు, శనివుండగా వేరు వేరు తేదీలలో కొన్ని గ్రహాలతో సంయోగం(0డిగ్రీలు), కొన్ని గ్రహాలతో కేంద్ర దృష్టి (90డిగ్రీలు) ఏర్పడుతున్నది. సాయన జ్యోతిష పండితులు వృషభరాశిలో గురువు, శని గ్రహం కలవడానిఅత్యధిక ప్రధాన్యత నిస్తున్నారు. అదేసమయంలో ఈ రెండు గ్రహాలకు కుంభరాశిలోవున్న యురేనస్‌ (ఇంద్ర) గ్రహంతో కేంద్రదృష్టి ఏర్పుడుతున్నందున దుష్ప్రభావం తీవ్రంగావుంటుందని భావిస్తున్నారు.

మేనెలలో ఏర్పడుతున్న గ్రహస్థితి ఆధారంగాసాయన జ్యోతిష పండితులఅంచనాలు

  • ఆర్థిక సంక్షోభం...యుధ్ధ భయం
  • మధ్య, ఉత్తర భారత దేశంలో క్షామం మరింత తీవ్రం
  • ప్రముఖుల కు ప్రమాదాలు, ఆకస్మిక మరణాలు.
  • రాజకీయ అస్థిరత, విచిత్రమైన కూటములు.
  • అసాధారణ వాతావరణ పరిస్థితులు.
  • విమాన ప్రమాదాలు, ప్రేలుళ్ళు
  • ఉత్తరాది రాష్ట్రాలలో హింస, తీవ్రవాద కార్యకలాపాలు ముమ్మరం.
  • కంప్యూటర్‌, విద్యుత్‌ రంగాలలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు

1921,1941లో ఇదే విధమైనగ్రహస్థితి వున్నదని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పలుఅనర్ధాలు జరిగాయని సాయన జ్యోతిష పండితులువివరించారు. అప్పటి పరిస్థితులు పునరావృతంఅవుతాయా అనే సందేహాలను వారు వ్యక్తంచేస్తున్నారు.

సాయన లేదా నిరయన జ్యోతిష పండితులఅంచనాలను చూస్తే మొత్తం మీద కొంత అందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నట్లు స్పష్టం అవుతున్నది.రాజస్థాన్‌, గుజరాత్‌ లో కరవు నానాటికీ తీవ్రం కావడం,నాస్‌ డాక్‌ నుంచి బిఎస్‌ఇ వరకు ఒడిదుడుకులకు లోనవడంవారి అంచనాలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈనేపధ్యంలో గ్రహకూటమి....దాని ప్రభావం పైఇండియాఇన్ఫో నలుగురు జ్యోతిష పండితులఅభిప్రయాలను సేకరించి మీ ముందుంచుతున్నది.

-టి.కుమార్‌

ఉత్తరాదికి అనర్థం...ప్రముఖులకు అపాయం
శ్రీ. వి.వి. రావు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
డాక్టర్‌ డి.ఎల్‌.ఎన్‌. మూర్తి నవంబర్‌ లో యుద్ధ భయం
డాక్టర్‌. సిహెచ్‌. సుబ్రహ్మణ్యం

ఆర్థిక సంక్షోభం...యుద్ధ భయం
శ్రీ. వి.ఆర్‌.కె. మూర్తి.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X