వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా కోల్డ్‌ కాదు ..షై పర్సన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అరచేతిలో వైకుంఠం అనేవాళ్ళు, కానీఇప్పుడీయన కంప్యూటర్లో చంద్రబింబం చూపిస్తున్నాడు.వాస్తవానికి అది కూడా దిక్కులేదనుకోండి...కంప్యూటర్లిస్తున్నాం, ఇంటెర్నెట్‌ సౌకర్యం కల్పిస్తున్నాం అని కోతలు కోస్తున్నారు కానీజిల్లాల్లో రోజుకి పది పన్నెండు గంటలు కరెంటుఉండటం లేదు....ఇక కంప్యూటర్‌తో ఏం ఉపయోగం.ఎప్పటికైనా ఈ పాపం పండకమానదు... అంటూ వరసపెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలనుఏకెయ్యగల సత్తా ఉన్న మహిళ మన రాష్ట్రానికిసంబంధించి ఎవరై ఉంటారు ? ఇంకెవరు ?రేణుకాచౌదరి. ఖమ్మం జిల్లాకు చెందినకాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు సభ్యురాలురేణుకాచౌదరితో ఇండియా ఇన్ఫోడాట్‌ కామ్‌ప్రత్యేక ఇంటర్వ్యూ....

దాదాపు పదిహేనేళ్ళపాటుతెలుగుదేశంలో ఉండి, వీలుచిక్కినప్పుడల్లాకాంగ్రెస్‌ను దుయ్యబట్టి...ఇంకా చెప్పాలంటే ప్రస్తుత పిసిసి అధ్యక్షుడువై.ఎస్‌. రాజశేఖరరెడ్డి నియోజకవర్గమైనకడపలో కూడా ప్రచారం చేసిన మిమ్మల్ని వారెలారిసీవ్‌ చేసుకున్నారు ?

ఇవన్నీ కూడా వాస్తవమే. అయితే, ఎక్కడ ఉన్నా అంకిత భావంతో పని చేసేకార్యకర్తని, నాయకురాల్ని నేను. కనుక టిడిపిలో ఉన్నప్పుడుమా పార్టీ అవసరాలు, ప్రాధాన్యతల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేశాను తప్పఎవరిమీద వ్యక్తిగత కక్షలు పెట్టుకుని చేసినఆరోపణలు, పనులు కావవి. కాంగ్రెస్‌లో చేరే ముందు ఈవిషయాన్ని నాయకుల ముందు స్పష్టం చేయడంజరిగింది. వారు కూడా మాకు వ్యతిరేకంగా మీరు పని చేసినరోజుల్లో కూడా ఇలాంటి నాయకురాలు మా పార్టీలోఉంటే బాగుండునని అనుకునేవాళ్ళం అనిచెప్పారు. వై. ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి గారయితే మీరు నాసోదరిలాంటి వారంటూ ప్రోత్సహించారు. టిడిపితో సంబంధం తెగిపోయిననేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరడం జరిగింది.

ఇటీవలకాంగ్రెస్‌ చేరిన మీకు ఖమ్మం టిక్కెట్టు ఇవ్వడం,అలాగే దాసరి నారాయణరావుకి రాజ్యసభ సభ్యత్వంవంటి సంఘటనలు ఎన్నో సంవత్సరాలుగా ఆపార్టీలో ఉన్న వారిని నిరాశకు, అసంతృప్తికి గురిచేస్తాయి కదా ?

ఖమ్మం టిక్కెట్‌ ఇచ్చినపుడు నాన్‌ లోకల్‌గామొదట్లో వ్యతిరేకత ఎదురైన మాట వాస్తవమే. కానీ అసంతృప్తి కూడాసహజమే. అయితే, ఈ నిర్ణయాల వెనుక అనేక ప్రాధాన్యతలు,ముందుచూపుతో కూడిన ప్రాముఖ్యతలుఉంటాయి. ఇటువంటివి ఎవరో ఒక్కరు తీసుకునే నిర్ణయాలుకావు.. పార్టీ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకునేనిర్ణయాలు కూడా కొన్ని ఉంటాయి కదా !

తెలుగుదేశం పార్టీక్యాడర్‌ పట్ల నాకు ఇప్పటికీ ఆపేక్ష ఉంది అంటూ ఇటీవల ఒక ప్రకటనచేశారు. ఈ ప్రకటనకి అర్ధం ఏమిటి ? ఇటువంటి ప్రకటనలుకాంగ్రెస్‌ వారిలో మీ పట్ల అనుమానాన్ని రేకెత్తించవా ?

పదిహేను సంవత్సరాలు ఒకపార్టీలో పనిచేసిన కార్యకర్తల మీద ఆపేక్ష లేకుండా ఎట్లాఉంటుంది. నా దృష్టిలో క్యాడర్‌ అంటేకార్యకర్తలు. కాంగ్రెస్‌లో కూడా నన్నాదరించేదికార్యకర్తలే కాబట్టి వారి పట్ల నా అభిమానం ఎప్పటికీ తరగదు.దానిని క్లయిమ్‌ చేసుకోవడంలో వెనుకాడను. ఇక ఈ ప్రకటన పట్లకాంగ్రెస్‌ వారు ఎలా స్పందిస్తారు ?అన్న విషయానికివస్తే, తెలుగుదేశానికి, కాంగ్రెస్‌కి చాలా తేడాఉంది. ఇక్కడి కార్యకర్తలు, నాయకులు కూడారాజకీయాల్లో చాలా అనుభవజ్ఞులు, పరిణతిచెందిన వారు కనుక ఆ భయం నాకు లేదు.పైగా తెలుగుదేశం పార్టీలో లేని స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్ర్యంకాంగ్రెస్‌లో ఉన్నాయి. కాంగ్రెస్‌లో ఉన్న బ్యూటీయేఇది.

కాంగ్రెస్‌,టిడిపి పార్టీల మధ్య ఉన్న తేడా ఏమిటి ?

టిడిపి రీజనల్‌ ప్లే గ్రౌండ్‌ అయితేకాంగ్రెస్‌ది నేషనల్‌ లెవెల్‌. నా వరకుచెప్పాలంటే రాజకీయాల తొలి అంశంలో టిడిపిమంచి ట్రయినింగ్‌ సెంటర్‌గా ఉపయోగపడింది.

టిడిపి పార్టీమహిళా విభాగం అధ్యక్షురాలు జయప్రదపైమీరు వ్యాఖ్య చేసిన సంఘటనలో మీడియానుంచి తనకు మద్దతు లభించడంతోపాటు, రాజకీయంగా కూడా మీకంటే మెరుగైనస్థానంలో ఉన్నానని జయప్రద ఇండియా ఇన్ఫోకు ఇచ్చినఇంటర్వ్యూలో చెప్పారు. మరి మీరేమంటారు ?

నేనేమీ కామెంట్‌ చెయ్యదలుచుకోలేదు....ఎందుకంటే నాది స్వయంకృషి. 15 సంవత్సరాలుటిడిపిలో ఉన్నపుడు కూడా ఎటువంటి పదవిఇవ్వకపోయినా కష్టపడి పనిచేశాను. అందులోనునేరుగా మునిసిపల్‌ ఎన్నికల్లో నెగ్గి నా రాజకీయఅరంగేట్రం చేశాను. అంతే తప్ప నాయకుడితోస్నేహం చేసో, ఆయన ముందు వినయం నటించోపదవిని సంపాదించలేదు. ఒకవేళ జయప్రద నాతోపోల్చుకుని, నన్ను చూసి స్ఫూర్తిని పొంది ఎదిగితేశభాష్‌ ! అని అభినందిస్తాను. ఎన్నో సంవత్సరాలుగామహిళల అభివృద్ధి కోసం నేను చేస్తున్న కృషికి ఒక ఫలితం లభించిందనిసంతోషిస్తాను. అయినా ఆమె ఎచ్ఛీవ్‌మెంట్సేమిటో ఒక్క సారి చెప్పమనండి.

ప్రస్తుతంరాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితిపై మీ ప్రతిస్పందన ఏమిటి ?

కంప్యూటర్‌ చూపించి అందరినీఆకట్టుకుంటున్నప్పటికీ, గ్రౌండ్‌ రియాలిటీస్‌ చూసినపుడుచాలా ఆందోళన కలుగుతోంది. మన రాష్ట్రంఎటువైపు పయనిస్తోందనేది ఆర్ధం కావడంలేదు. బిల్‌ క్లింటన్‌ వస్తున్నాడని అడుక్కునేవాళ్లని దాచేస్తే సరిపోతుందా ? జిల్లాల్లో కరెంటులేదు. కుటుంబాల ఆదాయం పెరగటం లేదు కానీధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పైగా గ్యాస్‌, పెట్రోల్‌లాంటిధరలు పెంచుతున్న కేంద్రానికి టిడిపి మద్దతుఉండటం గమనార్హం. మరో వైపు ఉద్యోగాలను తగ్గించేస్తున్నారు. కార్మికసంఘాల్నిరద్దు చేస్తామని బెదిరిస్తున్నారు.

ఆఖరికి ఇళ్ళలో ఉండే గృహిణులు కూడావేసవి కాలంలో నీళ్ళ బిందెలు మోసి అలిసిపోతున్నారు.హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఎన్‌కౌంటర్లు, హత్యలు జరగడం, ఆఖరికి మంత్రులు కూడాచనిపోతుండటం చూస్తే లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉందోఅర్ధం చేసుకోవచ్చు. నాకు తెలిసి చంద్రబాబుని సమర్ధిస్తున్నవారు వ్యాపారులు, బాగా చదువుకున్న వాళ్ళునూ. కానీ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నమన రాష్ట్రంలో మిగతా వారి పరిస్థితి ఎలా ఉందోఅవగాహనకు తెచ్చుకుని తదనుగుణంగావ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కంప్యూటర్‌ బటన్‌ నొక్కగానేడ్రైవింగ్‌ లైసెన్స్‌ వస్తుందని చెప్పడంకాదు, అది ఎంత మంది సాధారణ ప్రజలకి ఉపయోగపడుతుంది ?అనేది పాయింట్‌ .ఇటువంటి గొప్పల విషయంలోఉన్నపారదర్శకత ఎంత ?అనే వాటిని అర్ధంచేసుకోవాలి.

రాష్ట్రంలోని పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు, కాంగ్రెస్‌ ఎందుకు ఉద్యమించడం లేదు ? ఈ పరిస్థితిని రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి....

ఆరోపణలున్నమాట వాస్తవమే. అయితే ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకు ప్రజల నుంచే ముందు స్పందన రావాలని మేం ఎదురుచూస్తున్నాం. ఆ విధంగా జరిగిన తరువాత ఒక కార్యాచరణను సిద్ధం చేసి ముందుకు సాగాలనేది మా ఉద్దేశం.

ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్‌, ప్రస్తుతం ఆ స్థాయిలో లేకపోవడానికి కారణం నాయకత్వమా ?క్యాడరా ?

క్యాడర్‌ మాత్రం కాదు. కచ్చితంగా నాయకత్వలోపమే. అయితే ఈ లోపం సోనియాగాంధీకే పూర్తిగా వర్తిస్తుంది అనుకోవడం పొరపాటు. పార్టీలోని నాయకుల మధ్య, శాఖల మధ్య సమన్వయం లోపించడం ఈ పరిస్థితికి దారి తీసింది.

మహిళా నాయకురాలితో పనిచేయడం ఎలా ఉంది ?

సోనియా గాంధీ పైకి అందరూ అనుకునేట్లు కోల్డ్‌ కాదు. కొంచెం షై పర్సన్‌. ఆమెకు ఎటువంటి భేషజాలు లేవు. ఆమెతో మంచి ఇంటిమసీనే ఉంది.

ఎన్నారైలకు మీ సందేశం ఏమిటి ?

నాకు ఇద్దరు కుమార్తెలు. మా పెద్దమ్మాయి అమెరికాలో చదువుకుంటోంది. తనని చూడటానికి అమెరికా వెళ్లినపుడు హ్యూస్టన్‌కు చెందిన తెలుగు అసోసియేషన్‌ వారు నాతో ఒక ముఖాముఖీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఆనేక ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా వెయ్యడం జరిగింది. ప్రస్తుతం వారికి నేను చెప్పదగ్గ విషయం ఏమంటే, ఖమ్మం ఎం.పిగా ఈ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తున్నాను. అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని కూడా హామీ ఇస్తున్నాను.

  • వెండితెరపై మళ్లీ శ్రీదేవి?

  • బ్రహ్మానంద మాయ

    హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X