వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశి వికాసానికేకోట్ల ఎత్తులు?     Home Talk of Today FullStory

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ ః క్లింటన్‌ భారత్‌ పర్యటన సమాచారాన్ని యావత్‌ ప్రపంచానికితెలిపేందుకు వంద మందికి పైగా సభ్యులతో కూడినఅమెరికా పాత్రికేయుల బృందం శనివారం కొత్తఢిల్లీ చేరుకున్నది. అమెరికాకు చెందిన ప్రముఖ దినపత్రికలు,మాగజైన్లు, టెలివిజన్‌, ఇంటర్నెట్‌ వార్తా సంస్థలకుచెందిన పేరుమోసిన సీనియర్‌ జర్నలిస్టులుక్లింటన్‌ పర్యటన సమాచారాన్ని సేకరించేందుకు తరలివచ్చారు.వైట్‌ హౌస్‌ ప్రతినిధి జో లాకర్ట్‌ క్లింటన్‌ తో పాటు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ లో రావలసి వున్నప్పటికీ ముందుగానేబయలుదేరి జర్నలిస్టులతో కలిసి ఢిల్లీచేరుకోవడం విశేషం. అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ రాక సందర్భంగా కొత్త ఢిల్లీలో అనూహ్యరీతిలో భద్రతాచర్యలు చేపట్టారు. క్లింటన్‌ బస చేసేమౌర్య షెరటాన్‌ హోటల్‌ లో భద్రతాసిబ్బంది అంగుళం అంగుళం గాలించి వదిలేశారు. ఎవరినీ పొరపాటున కూడా ఆఛాయలకు రానీయడం లేదు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ అడ్వాన్స్‌ ఏజెంట్‌జోసఫ్‌ గుటియార్‌ నే షెరటాన్‌ హోటల్‌ గేటుబయట నిలిపివేసి భద్రతా సిబ్బంది యక్షప్రశ్నలువేస్తున్న దృశ్యమిది. పైలట్‌ కార్లు, హంగామాతోవచ్చిన ఆయనకే చేదు అనుభవం ఎదురైందంటేక్లింటన్‌ భద్రతకు ఎంతటి కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారో ఊహించవచ్చు.

క్లింటన్‌ పర్యటనసమీపిస్తున్నందున వారి విశ్రాంతి కూడా తీసుకోకుండా రంగంలోకిదిగిపోయారు. క్లింటన్‌ పర్యటించే ప్రాంతాల చరిత్ర,మ్యాప్‌ ల సేకరణలో మునిగి పోయారు. ఇటీవలక్లింటన్‌ తన పర్యటన గురించి చేసిన వ్యాఖ్యలు, భారతదేశం గురించి గతంలో అల్‌ బ్రైట్‌ తదితరులు చేసినవ్యాఖ్యలను సేకరించి అధ్యయనం చేయడం ప్రారంభించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ 1978 జనవరి 2న భారతపార్లమెంటులో చేసిన ప్రసంగం కాపీలను కూడాఅమెరికా సమాచార శాఖ అధికారులు జర్నలిస్టులకుఅందించారు. ఆ తరువాత అమెరికా అధ్యక్షుడుభారతదేశం సందర్శించడం ఇదేప్రధమం. 22 ఏళ్ళ అనంతరం అమెరికా అధ్యక్షుడుసుదీర్ఘంగా జరుపుతున్న ఈ పర్యటన ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పొందింది.

ఈ పర్యటనకు జర్నలిస్టులు 20 వేల డాలర్లు చెల్లించిమరీ వచ్చారట. వీరిలో చాలా మంది జర్నలిస్టులు భారతదేశం పర్యటించడం ఇదే ప్రధమం.క్లింటన్‌ వెంట వస్తున్న వారిలో అమెరికాలోవుంటున్న భారతీయుడు ఇస్లాం సిద్దికి వున్నారు.ఈయన అమెరికా వ్యవసాయ శాఖలో సీనియర్‌ ట్రేడ్‌అడ్వయిజర్‌ గా వున్నారు.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X