త్వరలో పాక్‌ తోయుద్ధంః భారత్‌ దే విజయం

హైదరాబాద్‌ః వచ్చే రెండునెలల్లో పాకిస్తాన్‌ తో యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని ప్రఖ్యాత జ్యోతిష్యులు నిమ్మగడ్డపాండురంగ విఠల్‌ శర్మ చెప్పారు. మొదటపాకిస్తానే క్షిపణిని ప్రయోగిస్తుందని, ఇండియాదానికి ప్రతిగా వంద రెట్లు బలంగా ప్రతిస్పందిస్తుందనిఆయన ఉగాది ముందు ఇండియా ఇన్ఫో కి ఇచ్చిన ప్రత్యేకసందేశంలో వివరించారు. పది పదిహేను రోజులు మాత్రమేజరిగే ఈ యుద్ధంలో పాక్‌ ఆక్రమిత కాశ్మీరును భారత్‌స్వాధీనం చేసుకోవడమే గాక మరికొంత ముందుకెళ్ళిపాకిస్తాన్‌ ను కాళ్ళ బేరానికిరప్పించుకుంటుందని ఆయన చెప్పారు. ఈ యుద్ధంలో భారత్‌ కుఅమెరికా అండగా నిలవడమేగాక అత్యాధునిక ఆయధాలను సరఫరాచేస్తుందన్నారు. యుద్ధం చివరి దశలో చైనాపాకిస్ధాన్‌ కు అండగా నిలుస్తుందని, ఆయినా విజయంమనదే అవుతుందని తెలిపారు.

ఒరిస్సాలో భీకర తుఫానువస్తుందని, పార్లమెంటు ఎన్నికల్లో బి.జె.పి మిత్రపక్షాలువిజయం సాధిస్తాయని, రాష్ట్రంలో తెలుగు దేశం పూర్తిమెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన గతంలో ఒకవార పత్రికకు ఇచ్చిన భవిష్య వాణి నిజమైంది. సూపర్‌ పవర్‌ గాఅమెరికా ఆధిపత్యం కొనసాగుతుందని, భారత్‌లో అమెరికన్‌ కంపెనీలు చమురు, ఖనిజ రంగాలఅభివృద్ధికి దోహదపడతాయని విఠల్‌ శర్మచెప్పారు.

అమెరికాలోనిప్రవాసాంధ్రులు వివిధ రంగాల్లో విశేష ప్రతిభనుకనబరచడమే గాక అక్కడ రాజకీయంగా కూడా బలపడతారని ఆయన జోస్యం చెప్పారు. వచ్చేకొన్నేళ్లలో కొందరు తెలుగు వాళ్ళు మేయర్లుగా,సెనేటర్లుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతారనిఆయన అన్నారు. సాంఘిక సేవ, అభివృద్ధి ధృక్పథం-వంటి విషయాల్లో తెలుగు ప్రజా ప్రతినిధులు ప్రతిభావంతులుగాపేరు తెచ్చు కుంటారని శర్మ వివరించారు. అమెరికాలోదక్షిణాది భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఇండియాలో కంటే ఎక్కువగా సాంస్కృతిక వైభవాన్నిసాధించుకుంటారని ఆయన తెలిపారు.

అమెరికాలో ప్రకృతివైపరీత్యాలు అధికమవుతాయని, వరదలు, తుఫాన్లు,చలిగాలులు జన జీవనాన్ని ఇబ్బంది పెట్టినా ప్రాణనష్టం ఉండదన్నారు. బిల్‌ క్లింటన్‌ భార్యహిల్లరీ క్లింటన్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తారనిచెప్పారు. బిల్‌ క్లింటన్‌ అనంతరం వచ్చే ప్రభుత్వం కూడా ప్రవాసభారతీయుల పట్ల అవే ఆదరాభిమానాలనుకొనసాగిస్తుందని విశదీకరించారు.

వచ్చే నవంబరులో పెను తుఫానునెల్లూరు తీరాన్ని తాకి తీవ్ర నష్టంకలిగిస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అతిత్వరలో చీలిపోతుందని, అతి చిన్న గ్రూపు మాత్రమేసోనియా గాంధీతో మిగులుతుందని విఠల్‌ శర్మచెప్పారు. సంగ్మా ప్రభృతులు బిజెపి వైపువెళ్ళి పోతారని, శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌ లోకి వస్తారని జోస్యంచెప్పారు.

బీహార్‌ లో ఆర్‌.జె.డి నుంచి 30 నుంచి 40మందిని బిజెపి కూటమి తన వైపుతిప్పుకోగలుగుతుందని, రబ్రీ దేవి ప్రభుత్వం పడిపోతుందనిఆయన అన్నారు. రాష్ట్రంలోచంద్రబాబు నాయుడికి పార్టీ ఎమ్మెల్యేలతో కొన్ని చిక్కులుఎదురైనా ఆయన ఆధిపత్యానికి తిరుగు ఉండదని,కాంగ్రెస్‌ నాయకత్వం రాజశేఖర రెడ్ది నుంచి జారి పోయిమరొకరికి దక్కవచ్చని విఠల్‌ శర్మ అన్నారు. చంద్రబాబునాయుడికి తీవ్రవాదుల నుంచి ప్రాణ భయంలేదని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపి లు మాత్రమే చివరికిమిగులుతాయన్నారు.

ప్రధాని వాజ్‌ పేయిపై పరివార్‌ పెత్తనం అధికమవుతుందని,ఆర్‌.ఎస్‌.ఎస్‌, భజరంగ్‌ దళ్‌ లు మరింతశక్తిమంతమై అఖండహిందుస్ధాన్‌ స్ధాపనకు కృషి చేస్తాయనిఆయన అన్నారు. 2001 వ సంవత్సరం చివరిలో మళ్ళీ లోక్‌ సభ ఎన్నికలు రావచ్చనిఆయన జోస్యం చెప్పారు.

మూడేళ్ళలో క్యాన్సర్‌, డయాబిటీస్‌వంటి వ్యాధులకు కొత్త మందులు కనుగొంటారనిఆయన అన్నారు. ఇండో-పాక్‌యుద్ధం సమయంలో హైదరాబాద్‌ కు ఎటువంటి హాని జరగక పోయినాముంబాయిలోని నివాస ప్రాంతాలు దెబ్బతిని కొంత ప్రాణనష్టం జరుగుతుందన్నారు. గుజరాత్‌ లోనికచ్‌, రాజస్ధాన్‌ లోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగాదెబ్బతింటాయని ఆయన చెప్పారు. యుద్ధం తర్వాతపాకిస్ధాన్‌ లో ప్రజా ఉద్యమాలు బయలు దేరిప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.

చైనా, తైవాన్‌ ల మధ్యత్వరలో యుద్ధం జరుగుతుందని, మూడు నాలుగేళ్ళలో టిబెట్‌విముక్తి పొంది స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవిస్తుందన్నారు.

(హైదరాబాద్‌ కృస్ణా ఎర్రమంజిల్‌ కాలనీ పక్కననవీన్‌ నగర్‌ లోని మారుతీ నిలయంలోఆంజనేయ ఉపాసన చేసుకుంటూ ఉండే శ్రీ నిమ్మగడ్డపాండురంగ విఠల్‌ శర్మ గతంలో అనేక సంచలన జోస్యాలుచెప్పారు. ఎటువంటి ప్రశ్నవేసినా కళ్ళు మూసుకుని చిటికె వేసి సమాధానం చెప్పేఆయన మూడు దశాబ్దాలుగా లాభాపేక్ష లేకుండా ప్రజాసేవ చేస్తున్నారు. ఆయన ఫోన్‌ నెంబరు, ఇతరవివరాలకు ఇండియా ఇన్ఫో కు ఇ-మెయిల్‌ చేయండి.)

ఉగాదిహోమ్‌పేజి హోమ్‌పేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+