కార్పెట్ల దుకాణంలోక్లింటన్
న్యూఢిల్లీ ః కుమార్తె ఛెల్సా, అత్తగార్లతో కలిసిమౌర్య షెరాటన్ హోటల్‌లో ఉన్న నేషనల్ కాటేజ్‌ఎంపోరియంలో దాదాపు 40 నిమిషాల సేపు క్లింటన్ షాపింగ్‌చేశారు. భారతదేశం చేరడానికి 15 గంటల పాటుప్రయాణం చేసిన బిల్ క్లింటన్, యు.ఎస్‌రాయబారి ఇచ్చిన విందును స్వీకరించిన అనంతరం, రాత్రి 10.30 గంటలకు తన బస ఏర్పాటు చేసినహోటల్ ఆవరణలో ఉన్న ఎంపోరియంకు వెళ్ళారు. 1995లోహిల్లరీ క్లింటన్ భారతదేశం వచ్చినప్పుడు కూడా ఇదేదుకాణంలో కొనుగోళ్ళు జరపడం గమనార్హం. కాటేజ్‌ఎంపోరియంకు వెళ్ళమని హిల్లరీనే స్వయంగా చెప్పారనిక్లింటన్ దుకాణదారుడికి చెప్పారట కూడా !
దుకాణంలోని కార్పెట్లు, షాల్స్ చూస్తున్నసమయంలో కాశ్మీర్‌కు చెందిన ఖవఅనే ప్రత్యేక టీనితాగారు. టీ చాలా బాగుందని అని మెచ్చుకోవడమే కాకుండా,దుకాణం యజమాని మన్జూర్ వాంగూ అడగగానేమరో కప్పు టీ తాగటానికి కూడా క్లింటన్‌ఒప్పుకున్నారంటే కాశ్మీరీటీరుచి ఆయనకి ఎంతగానచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.
క్లింటన్ కొన్న కార్పెట్ ఆయన కోసం ప్రత్యేకంగాతయారుచేసినదేనట. తయారీకి ఆర్నెల్ల కాలం పట్టిన ఈ తివాచీలో 20 రంగులుఉన్నాయి. కార్పెట్లపై కూర్చుని,కార్పెట్ ప్రతి చదరపుఅంగుళానికి ఉన్న 7000 ముడులను స్వయంగాపరీక్షించారంటే ఎంత తీరిగ్గా ఆయన ఈ షాపింగ్‌నిచేశారో అంచనా వేసుకోవచ్చు.
క్లింటన్‌తో పాటు సహాయ మంత్రిమాడలిన్ ఆల్‌బ్రైట్ కూడా ఈ దుకాణాన్ని సందర్శించి,కొనుగోళ్లు జరిపారు.
ఆ తరువాత గణేష్‌జీ లాల్ అండ్ సన్స్ అనేనగల దుకాణానికి వెళ్ళి కొన్ని ఆభరణాలనుక్లింటన్ కొన్నారు. అయితే ఆయన ఏమి కొన్నారో చెప్పడానికి దుకాణదారుడుఇష్టపడలేదు.












Click it and Unblock the Notifications
