దేశం, బిజెపి తాజా తగాదా
హైదరాబాద్: ఒకప్పుడు పచ్చ జెండాలతో, తెలుగుదేశం నినాదాలతో, ఎన్టీఆర్ జైజై ధ్వానాలతో దద్ధరిల్లిన హైదరాబాద్ సమీపంలోని గండిపేట తెలుగు విజయం ఇటీవలి దాకా దిక్కుమొక్కు లేని దివాణంలా వుండిపోయింది. తెలుగు విజయం ఆవరణను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అఖిల భారత అభిమానుల సంఘాల సమాఖ్య డిమాండ్‌తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఐదెకరాల స్థలంలో విస్తరించిన ఈ తెలుగు విజయం నుంచే పని చేసేది. దాని పక్కనే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి. రామారావు నిర్మించిన శాంతి కుటీరం వుంది. ఈ ఆవరణ యావత్తూ సంఘ విద్రోహుల చేతుల్లోకి పోతోందని సమాఖ్య అధ్యక్షుడు పి. సాయిబాబ బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
సాయిబాబ తన దాడిని ఆ ఆస్తిపై తనకు హక్కుందంటున్న ఎన్.టి. రామారావు రెండవ భార్య, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతిపై ఎక్కుపెట్టారనేది స్పష్టంగా అర్థమవుతూనే వుంది. ప్రస్తుతం ఆ కేసు రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో వుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఎన్టీఆర్ టిడిపి తుడిచి పెట్టుకుపోవడంతో లక్ష్మీపార్వతి తెలుగువిజయం ఆవరణను ఒక ఆధ్యాత్మిక సంస్థకు లీజుకిచ్చారని సాయిబాబ చెప్పారు. కొన్ని విలువయిన కళాఖండాలను, ఎన్‌టిఆర్‌కు వచ్చిన బహుమతులను లక్ష్మీపార్వతి అనుచరగణం కాంప్లెక్స్ నుంచి తీసికెళ్లి అమ్ముకుంటున్నారు అని ఆయన ఆరోపించారు. ఎన్‌టిఆర్ వారసురాలిగా చెప్పుకునే అర్హత లక్ష్మీపార్వతికి లేదని, ఆ మహానాయకుడి ప్రతిష్టకు ఆమె, ఆమె అనుచరులు విఘాతం కలిగించారని సాయిబాబ విమర్శించారు.
ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకుని తెలుగు విజయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దాన్ని విద్యాసంస్థగా లేదా ఇతర ప్రజోపయోగ సంస్థగా మార్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అట్లాగే, మూడెకరాల శాంతి కటీరాన్ని ఎన్టీఆర్ స్మారకంగా తీర్చిదిద్దాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేసు కోర్టులో వుండగానే ఆ ఆవరణను లక్ష్మీపార్వతి మహర్షి మహేష్‌యోగి ధ్యాన కేంద్రానికి ప్రదానం చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. అక్రమ ఆక్రమణదారులను ఎన్టీఆర్ జయంతి రోజయిన మే 28వ తేదీ లోపల తొలగించాలని ఎన్టీఆర్ అభిమానుల సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిష్కరించకపోతే తెలుగువిజయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
-
పవన్ మలి ప్రేమ
-
ప్రేమ విఫలమై.....
-
దేశంలో లేనిది కాంగ్రెస్ లో ఉంది
-
వెండితెరపై మళ్లీ శ్రీదేవి?
-
బ్రహ్మానంద మాయ












Click it and Unblock the Notifications
