2000 సంవత్సరం మే 4 నుంచి 28 వరకుఅరుదైన గ్రహస్థితి ఏర్పడుతున్నదని, ఫలితంగాయుద్ధ వాతావరణం, ఆర్థిక సంక్షోభ సంకేతాలుకనిపిస్తున్నాయని ప్రముఖ ఆస్ట్రో కన్సల్టెంట్‌వి.ఆర్‌.కె.మూర్తి చెప్పారు. ప్రస్తుతం గుజరాత్‌,రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలలో కనిపిస్తున్న తీవ్రదుర్భిక్ష పరిస్థితి, అంతర్జాతీయంగా ఆర్థికరంగంలో ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్లలో కనిపిస్తున్న అనిశ్చితికి ఈఅరుదైన గ్రహస్థితే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులు కొనసాగడంతో పాటు మరింత తీవ్రంగామారే ప్రమాదం లేకపోలేదన్నారు.

2000 సంవత్సరం మే నెలలో విచిత్రమైన గ్రహస్థితి ఏర్పడుతున్నదని ప్రముఖ జ్యోతిష, వాస్తు పండితులు, లియో ఆస్ట్రో అకాడమీ అధ్యక్షుడు వి.వి.రావు తెలిపారు. మే 4న అమావాస్య నుంచి మొదలు కొని వరుసగా సంభవిస్తున్న గ్రహస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన పరిణామాలు సంభవిస్తాయని ఆయన చెప్పారు. 1921, 1941 సంవత్సరాలలో దాదాపు ఇదే విధమైన గ్రహస్థితి ఏర్పడిందని, ఫలితంగా యుద్ధాలు, ఆర్ధిక సంక్షోభాలు ప్రపంచ దేశాలను కుదిపి వేశాయని ఆయన అన్నారు. ప్రస్తుత గ్రహస్థితి దృష్ట్యా అంతటి విపత్కర పరిస్థితులు ఎదురు కాకపోయినా పరిణామాలు మాత్రం తీవ్రంగానే వుంటాయని ఆయన హెచ్చరించారు.

1941లో ఏర్పడిన గ్రహస్థితి ఫలితంగా యుద్ధాలు, కరవు కాటకాలు వచ్చాయని, భారత దేశంలో దుర్భిక్షం తీవ్రతను తట్టుకోలేక కరవు భత్యాన్ని, రేషన్‌ ను అప్పుడే ప్రారంభించారని 72 ఏళ్ళ వి.వి.రావు గతాన్ని నెమరు వేసుకుంటూ చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేందుకు దాదాపు అయిదేళ్ళ కాలం పట్టిందని, అదేవిధంగా ప్రస్తుతం తలెత్తే సమస్యలు కూడా దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తాయన్నారు.

మే లో ఏర్పడుతున్న గ్రహస్థితి కారణంగా సంభవించే పరిణామాలపై వి.వి.రావు అంచనాలుః

  • ప్రముఖులకు అపాయాలు, మరణాలు
  • రాజకీయ అస్థిరత, కొత్త కూటములు
  • మధ్య, ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువగా కష్టనష్టాలు
  • వాతావరణంలో ఊహించలేని మార్పులు. ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగే అవకాశం
  • యురేనస్‌ తో రవి, గురుల కేంద్ర దృష్టి వల్ల రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ప్రేలుళ్ళు, భీభత్సకాండ
  • జులై లో వచ్చే సూర్య గ్రహణ ప్రభావంతో ప్రకృతి వైపరీత్యాలు.
  • కంప్యూటర్‌, విద్యుత్‌ రంగాలలో సంక్షోభాలు
  • కార్పొరేట్‌ రంగంలో ఊహించని మార్పులు.
  • షేర్‌ మార్కెట్లు, స్పెక్యులేషన రంగాలపై విపరీతమైన దుష్ఫ్రభావం.
  • రాజకీయ సిద్ధాంతాలలో వినూత్న పోకడలు

సామాన్యులకు అభయం

కాలగమనంలో జరిగే ఈ పరిణామాల గురించి సామాన్యులు ఆందోళన పడవలసిన అవసరం లేదని శ్రీ రావు చెప్పారు. విచిత్ర గ్రహస్థితి మేషంలో లేదా వృషభంలో సంభవిస్తున్నందు వల్ల మేష, వృషభ రాశి జాతకులు తమకేమైనా అయిపోతుందని ఆందోళన చెందుతున్నారని, అయితే అలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. జన్మ జాతకంలో చెడు వుంటే తప్ప ఈ గ్రహస్థితి కారణంగా వ్యక్తులకు నష్టం వాటిల్లదన్నారు. ఈ రాశుల వారు ప్రయాణాలలో, వాహనాలు నడిపే సమయంలో కొంత మెలకువగా వుంటే సరిపోతుందనిసుచించారు.

వి.వి. రావు,
ప్రెసిడెంట్‌, లియో అస్ట్రోఅకాడమీ,
జూబ్లీ హిల్స్‌, హైదరాబాద్‌.

ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
డాక్టర్‌ డి.ఎల్‌.ఎన్‌. మూర్తి నవంబర్‌ లో యుద్ధ భయం
డాక్టర్‌. సి.హెచ్‌. సుబ్రహ్మణ్యం

ఆర్థిక సంక్షోభం...యుద్ధ భయం
శ్రీ. వి.ఆర్‌.కె. మూర్తి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+