వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

(వరంగల్‌ నుంచి పెండ్యాల కొండలరావు)

By Staff
|
Google Oneindia TeluguNews

(వరంగల్‌ నుంచి పెండ్యాల కొండలరావు)

పోలం సుదర్శన్‌ రెడ్డి అలియాస్‌ రామకృష్ణవరంగల్‌ జిల్లా సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ కార్యదర్శి . ఆ రకంగానక్సల్స్‌ ప్రాబల్యం బలంగా వున్న వరంగల్‌ జిల్లా కార్యకలాపాలకుదిశా నిర్దేశం చేస్తున్న నాయకుడు. మూడు సార్లు పోలీసులనుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఇటీవలి కౌకొండఎన్‌కౌంటర్‌లో వార్‌ వరంగల్‌ నగర కమిటీకార్యదర్శితో బాటు ఒక జిల్లా కమిటి సభ్యుడు,మరి 10మంది సాయుధ దళాల సభ్యులు మృతిచెందినపుడు , ఇంకో 12మంది సభ్యులతో బాటు తప్పించుకున్నవ్యక్తి. వరంగల్‌ కార్యకలాపాలనే కాకుండా ఉత్తర తెలంగాణా జిల్లాల్లోనివార్‌ కార్యకలాపాలను పార్టీ నిర్దేశించిన దిశగాపయనింపజేస్తున్న కీలక క్యాడర్‌లలో ఒకరిగా ఆర్‌కె సుపరిచితులు.

ఆ ఆర్కే కొక్కండ ఎన్‌కౌంటర్‌ జరిగిన పరకాల్‌ పోలీసు సబ్‌డివిజన్‌లోనే ఉన్న చిట్యాల అడవులలో ఇండియా ఇన్ఫోతోబాటు మూడు ప్రముఖ పత్రికలవిలేకరులకు సోమవారం ఇంటర్వ్యూ ఇచ్చారు.ఇంటర్వ్యూ సందర్భంగా ఆర్కేతో బాటు వార్‌ జిల్లాల కమిటీ సభ్యుడురమేష్‌ పరకాల, చిట్యాల దళాలు పాల్గొన్నాయి. కొక్కొండఎన్‌కౌంటర్‌ తాలూకు ఆందోళన ఏ మాత్రం కనిపించని రీతిలోఆయన వరంగల్‌ జిల్లాలో కొనసాగుతున్న నిర్భంద పరిస్థితులు,నక్సలిజం కోసమే రూపొందించామని కొందరు పోలీసుఅధికారులు చెప్పిన మైత్రి సంఘాల నిర్మాణప్రక్రియపై వార్‌ వైఖరి వివరించారు. నక్సలైట్లనులొంగుబాటలో నడిపించేందుకు రూపొందించినకౌన్సిలింగ్‌ ప్రక్రియపై జిల్లా పార్టీ అభిప్రాయాలుకరాఖండీగా వెల్లడించారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలాఉన్నాయి.

వరంగల్‌ జిల్లావార్‌ కార్యకలాపాలకు ఆయువుపట్టులాంటిది కదా...అలాంటిజిల్లాలో కొక్కొండ ఎన్‌కౌంటర్‌ మీ నైతిక స్థయిర్యాన్నిఏమైనా దెబ్బతీసిందా ?

జిల్లా వార్‌కార్యకలాపాలు, నగర పార్టీ కార్యకలాపాలను కొక్కొండఎన్‌కౌంటర్‌ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ విషయంలో రెండోఅభిప్రాయం లేదు. మా శత్రువు ఇప్పుడు పార్టీకి కీలక స్థావరాలుగావున్న ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకు రావడానికి

వెనుకాడటం లేదు. దీనికోసం సాంకేతికంగా పార్టీకిఅర్థం కాకుండే రీతిలో గాలంపు చర్యలు చేపడుతున్నారు. పార్టీక్యాడర్‌లలో గందరగోళం సృష్టించేందుకుఇన్‌ఫిల్‌ట్రేషన్‌ యత్నాలు చేస్తున్నారు. త్యాగనిరతిలేని,వూగిసలాటలో వున్న కార్యకర్తలను తమవుచ్చులో బిగించి తద్వారా లబ్ది పొందుతున్నారు. పార్టీనిర్మాణ క్రమంలో వరంగల్‌ జిల్లాలో కొక్కొండఎన్‌కౌంటర్‌ పెద్ద విఘాతాన్ని సృష్టించింది. అయితేమేం నైతిక స్థయిర్యాన్ని కోల్పోలేదు. మాక్యాడర్‌లో సానుభూతి పరులు జిల్లాలో ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్‌చేస్తున్నారు. ఇది మమ్మల్ని ఉద్యమోన్ముఖుల్నిచేస్తున్నది. కొక్కొండ ఎన్‌కౌంటర్‌ జరిగిన తెల్లవారిమేము ఆ ప్రాంతం నుంచి తప్పుకున్నాక కలిసిన సానుభూతి పరులు ప్రజలు కూడా ఇదే డిమాండ్‌మా ముందుంచారు. అందువల్ల మేము నైతిక స్థయిర్యాన్నికోల్పోయామనుకోవడం పొరబాటే అవుతుంది.

జిల్లాలో నిర్బంధం ఎలాఉంది ?

ఏడేళ్ళ క్రితమే జిల్లా పోలీసుయంత్రాంగం అనుసరించిన నిర్భంధ ప్రక్రియలనుమళ్ళీ అనుసరిస్తున్నారు. పార్టీపై ముప్పేటలాదాడికి ఉపకరిస్తున్నారు. నిర్భంధ ప్రక్రియలనుమారుస్తున్నారు. క్రూరులైన పోలీసు అధికారులను ఒకడివిజన్‌లో కేంద్రీకరించడం ద్వారా తమ లక్ష్యాలనుఛేదించాలని అనుకుంటున్నారు.

నిర్భంధప్రక్రియలో సారూప్యత అని మీరు చెప్పారు కదా అదిఎలాంటిది ?

నిర్భందాన్ని పెంచడం కోసం జిల్లా పోలీసుయంత్రాంగం నిర్మాణ ప్రక్రియ ఒకటి. పోలీసుయంత్రాంగం ఎప్పుడు మాట మార్చినప్పటికిముందుగా కొంతమంది సిఐలు మైత్రి సంఘాలు కేవలంవార్‌ నిర్మూలనా ధ్యేయంగా ఉద్భవించాయని ప్రచారంచేశారు. ఈ సంఘాలు 1993లో వరంగల్‌ ఎస్‌పి గా వున్నగౌతమ్‌ సావంగ్‌ హయాంలో నిర్మించినసిటిజన్స్‌ కమిటీ ప్రతిరూపాలు. ఇన్‌ఫార్మర్లనుప్రవేశపెట్టడం ద్వారా పార్టీని నిర్మించుకోవాలనేఉద్దేశంతో రూపొందించిన సిటిజన్స్‌ కమిటీలకువలనెనే మైత్రి సంఘాలలో కూడా కుల పెత్తందారులు , పార్టీ సంఘాలను ఏర్పాటుచేస్తున్నారు. దీని కోసం కొన్ని సాంపిల్‌ గ్రామాలను ఎంపికచేసుకున్నారు. సిటిజన్స్‌ కమిటిల వలెనేఇన్‌ఫర్మెంట్‌ నెట్‌వర్క్‌ను పెంపొందించడానికి మైత్రి సంఘాలు ఉపయోగపడుతున్నాయి.పేరుకు గంజాయి, నాటు సారాను అరికట్టడానికి ఈ సంఘాలన్నీచేబట్టే సాంఘీక దురాచారాలను అడ్డుకునేందుకు మైత్రి సంఘాలంటున్న పాలకవర్గం ఆ పేరిట నక్సలైట్‌ల పై కౌంటర్‌ ప్రాపగాండాచేసేందుకు మైత్రి సంఘాలను నిర్మిస్తున్నారు.వీటి నిర్మాణం కోసం గ్రామాలలో వొక 42 ప్రశ్నలతోవివరాలు సేకరించారు. వాస్తవానికి మైత్రి సంఘాలుగావున్న ఈ సంఘాలు ప్రజా శత్రు సంఘాలు.

ఈ సంఘాలను ఎదుర్కోవడం కోసం పార్టీసీరియస్‌ ప్రొగ్రామ్‌ని చేపట్టాలనుకుంది. గతంలో బెక్కల్‌గ్రామంలో తానేశ్వర్‌ అనే ఇన్‌ఫార్మర్‌ను హతమార్చినతరహాలోనే ప్రజా శత్రువులుగా వుండి కాన్షస్‌గా మైత్రిసంఘాలలో చేరాలనుకుంటున్న వాళ్ళను క్షమించంమేము చంపుతాం. ఈ అంశంలో తమ అభిప్రాయాలుమార్చుకొని రాజీనామాలు చేసిన వాళ్ళనుక్షమించం. మైత్రి సంఘాలలో చేరాలనేఉపాధ్యాయులపై కూడా ఒత్తిడి పెంచుతున్నాం.గ్రామాలలో ఇన్‌ఫార్మర్‌లకు బేస్‌ ఏర్పరచడం కోసంఉపక్రమించే ఈ సంస్థలలో చేరవద్దని మేముప్రజాస్వామిక వాదులు, మేధావులు ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నాము.

మైత్రి సంఘాలువొక్కటే నిర్భంధ ప్రక్రియలో భాగాలుగా నిలుస్తున్నాయా ?

మైత్రి సంఘాలకు తొడుకౌన్సిలింగ్‌ పేరిట జరుగుతున్న ప్రచారం కూడాగ్రామాలలో పార్టీపై భౌతిక దాడులకుఉపకరించే అస్త్రంగా నిలుస్తున్నది. కౌన్సిలింగ్‌ పేరిట జరుగుతున్న ప్రచారంఅంతా అవాస్తవం. విప్లవకారుల కుటుంబాలను ప్రతిసమస్యాసందర్భంలో ఫిజికల్‌గాను, మెంటల్‌గాను టార్చర్‌చేయడానికి ఈ ప్రక్రియ ఉపకరిస్తున్నది.బయోనెట్‌ నీడలో ప్రకటనలిచ్చి సరెండర్‌లుప్రకటిస్తున్నారు. సరెండర్‌ విషయమై రక్తసంబంధం తెంచేసేవిధంగా ప్రవర్తిస్తున్నారు. త్యాగనిరతి లేని,ఊగిసలాటలో ఉన్న క్యాడర్‌లు మారుతున్న సామాజిక పరిస్థితులను అంతం చేసుకునివారు లొంగుబాటలో వెళుతున్నారు. వీరికి కౌన్సిలింగ్‌పేరిట ఒక తర్ఫీదు రూపంలో ఇస్తున్నారు. నిర్భందం ఈకోణంలో పెంచజూస్తున్నారు.

కరీంనగర్‌ లాంటిజిల్లాలో పోలీసులు ఓ అడుగు ముందేసి జడలనాగరాజు ముఠా ద్వారా పాల్పడుతున్నారు. నిర్భంధం ఇప్పుడుక్యాడర్లతో పాటు వాళ్ళ కుటుంబాలపై కూడా తీవ్రతరం అవుతున్నది.క్యాడర్‌ల కుటుంబాలు విప్లవోద్యమంలోపాల్గొనే రీతిలో పరిస్థితులు సృష్టించబడుతున్నాయి.మెంటల్‌గా టార్చర్‌ చేస్తూ తల్లితండ్రుల మీదఅధికారులు పడుతున్నారు. ఉద్యమకారులతల్లితండ్రులను వేదిస్తున్నారు.దీని వెనుకరాజకీయనాయకుల కుట్ర కూడా వుంటున్నది. ఫాసిస్టునిర్భందం వున్న క్రమంలో కోవర్టు కోసం లొంగుబాట్ల కోసంరాజకీయ నాయకులు కూడా ప్రయత్నాలుచేస్తున్నారు. పోలీసులు, రాజకీయనాయకులు మోసపూరితప్రయత్నాలతో కౌన్సిలింగ్‌ ప్రచారం చేస్తున్నారు.కౌన్సిలింగ్‌ ఒక ఫార్స్‌. దీన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులుఅర్ధం చేసుకోవాలి. ఉద్యమకారుల కుటుంబాలపై మాత్రమే కాకుండాకౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రజాఉద్యమాలపై జరుగుతున్న కుట్రగామేము భావిస్తున్నాము. దీన్ని ఎదుర్కోవడం కోసంకౌన్సిలింగ్‌ను బ్రేక్‌ చేస్తున్నాము.తల్లితండ్రులను వేదించడం మేము సీరియస్‌గా తీసుకుంటున్నాము.కౌన్సిలింగ్‌కు ఉపక్రమించే రాజకీయ నాయకులను కూడామేము ఐడెంటిఫై చేస్తున్నాము. పేరెంట్స్‌ మీద పడేఅధికారులను వదలకుండా శిక్షిస్తాం. దీనికితోడు పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడాఎదుర్కోవాలని తద్వారా ప్రతిఘటించాలని మేము భావిస్తున్నాము.

దుష్ప్పచార దాడి అంటే ?

పార్టీపై పోలీసు యంత్రాంగం, పాలక వర్గం ఈ మధ్య కాలంలో ఒక వ్యూహాత్మక దుష్ప్రచార దాడికి పూనుకుంటున్నారు. కరప్రతాలు తీయడం ద్వారా దుష్ప్పచారం చేస్తున్నారు. నక్సలైట్‌లు సోమరిపోతులని, వాళ్ళను గ్రామాల నుంచి తరమాలని చెబుతున్నారు. దీని కోసం మాజీలను అస్త్రంగా వాడుకుంటున్నారు. పంజరంలో రామచిలుక జ్యోతిష్యుని మాట విన్నట్టే కొందరు మాజీలు పోలీసుల మాటలను వల్లిస్తున్నారు. మరికొంతమంది పోలీసుల గూటిలో పక్షులై పార్టీ పట్ల ద్రోహానికి పాల్పడుతున్నారు. అయితే ఈ దుష్ప్రచార దాడనిఇ ప్రజలు నమ్మడం లేదు. వరంగల్‌లాంటి నగరంలో పోలీసు యంత్రాంగం దొంగలు, లంపెన్‌లను వదిలేసిన ఆ విషయంలో ప్రజలను చైతన్యవంతం చేసిందెవరో వాళ్ళకు ఇప్పుడు తెలుసు. నక్సలైట్‌లు సోమరిపోతులని విమర్శిస్తున్న పోలీసు యంత్రాంగానికి నగరంలో రౌడీ ఇజాన్ని అరికట్టిందెవరో తెలుసు. ఆకలితో వున్న ప్రజలు ఇప్పటికే పోరాడాలనుకుంటున్నారు. నిత్య జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఆకష్టాలలోనే తమకు సుఖం వచ్చే అవకాశం లభిస్తుందని ధీమాతో వందలాదిగా ప్రజలుఉద్యమాలలో పాల్గొంటున్నారు.

మరి ఇలా జరుగుతున్న క్రమంలో ఎన్‌కౌంటర్లుజరిగి మీ సమాచారం లభ్యమైతే?

ఎన్‌కౌంటర్లలో మా సమాచారం లభ్యమవుతుందని చెప్పడం కూడా ఒక దుష్ప్రచారమే. ఇది ప్రజలను భయపెట్టడం కోసం పోలీసులు పన్నుతున్న కుట్ర. కౌకొండ ఎన్‌కౌంటర్‌లో నా డైరీ పోయింది వాస్తవమే. అయితే ఆ డైరీలో విలువైన సమాచారం దొరికిందనేది బూటకం. ప్రజలను భయపెట్టడం కోసం ఇది పోలీసులు చేస్తున్న వంచన. ఒకవేళ డైరీలో సమాచారం ఉంటే దాన్ని ప్రకటించేంది. ప్రజలు సానుభూతిపరులను కంటికిరెప్పలా చూసుకోవల్సిన మాధ్య పార్టీపై వుంది. అందుకోసం ప్రజా వ్యతిరేకులైన పోలీసు ఆఫీసర్‌లకు సంబంధించిన సమాచారం రాజకీయనాయకులు, వర్గశత్రువులకు సంబంధించిన సమాచారాన్ని మేము డైరీలో భద్రపరుస్తున్నాం. అది మాత్రమే డైరీలో వాళ్ళకు లభ్యమయ్యే సమాచారం.

ఇలాంటి సందర్భాలలో సరెండర్లు పెరిగి, ఉద్యమం బలహీన పడుతున్నది కదా?

వరంగల్‌ ఇప్పటికీ, ఎప్పటికీ రివల్యూషనరీస్‌ క్యాంపే. ఇక్కడ మూవ్‌మెంట్‌ ఇక్కడ మూవ్‌మెంట్‌ ప్రచారం చేస్తున్న పోలీసులు వివిధ అంగాలకు చెందిన వేలాది మంది బలగాలను ఎందుకు మోహరిస్తున్నారు. వుద్యమం లేకుంటే పోలీసు ఫోర్స్‌ మొత్తాన్ని వుపసంహరించుకోమనండి. రిక్రూట్‌మెంట్‌ ఎప్పుడూ గణనీయంగా తగ్గలేదు. రెండువేల సంవత్సరంలో ఇప్పటికీ పోలీసుల ఖాకీ లెక్కలు, దొంగ లెక్కల ప్రకారం 40 నుంచి 50 వరకు లొంగిపోయినట్లు చెప్పుతున్నారు. అయితే ఇది బూటకపు సంఖ్య. సాధారణ సంఘ నాయకులు, ఇతరులను దళ సభ్యులుగా ప్రకటిస్తూ చౌకబారు ఎత్తుగడలకు పూనుకుంటున్నారు. పెరుగుతున్న ప్రజా నిరసనను అణచివేస్తున్నారు. తద్వారా తమ స్వభావాన్ని, నైజాన్ని బహిరంగం చేస్తున్నారు. అయినప్పటికీ వుద్యమం కొనసాగుతూనే వున్నది. వుద్యమం బలహీనపడితే వార్‌కు ప్రజామద్దతు లేకుంటే సంవత్సర కాలంలో అరెస్టు అయినవారి పేర్లు, వివరాలు బహిరంగం చేయాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం.

పోలీసు యంత్రాంగం పీపుల్స్‌వార్‌పై చేపడుతున్న దుష్ప్రచార దాడిలో భాగంగా కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకుల అవతారమెత్తుతున్నారు. గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. ఈ దత్తత గ్రామాల ప్రక్రియ బూటకం. వాస్తవానికి పోలీసులకు గ్రామాలను దత్తత తీసుకోవాలనే ఆలోచన వస్తే వాళ్లు రాజకీయ నాయకుల డ్రెస్‌ వేసుకుని ఆ పనికి పూనుకోవాలి. నక్షలైట్లుగా అప్పుడు మేం తిరగాల్సిన అవసరం రాదు. నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తూ పోలీసు యంత్రాంగం గ్రామాల్లో ప్రజా స్మృతులను చెరిపేయాలనుకుంటున్నారు. శవ యాత్రలను అడ్డుకోవాలనుకుంటున్నారు. అయితే మాస్‌ బేస్‌ వున్న పీపుల్స్‌వార్‌ ప్రజాస్మృతులను చెరిపేయాలనుకుంటే చూస్తూ ఊరుకోదు. శవయాత్రలను అడ్డుకుంటే పోలీసు అధికారులను శవాల రూపంలో తేలుస్తాం. పార్టీల నాయకులు, పార్టీపై కక్ష గడుతున్న వాళ్లు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, పుట్టా మోహన్‌రెడ్డిల అంతు చూస్తాం. ప్రజాకంటకుడైన మాధవరెడ్డిని హతమార్చిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఒక్క వరంగల్‌ జిల్లాలోనే బంద్‌పాటించింది.

ఇంతకాలం పార్టీతో దాగుడుమూతలు ఆడిన నాయకులు ఇప్పుడు నేరుగా ఫీల్డ్‌లోకి దిగారు. తమ రంగును బయట పెట్టుకున్నారు. ఈ రకంగా పార్టీతో తమ శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. ఆ క్రమంలోనే వాళ్లకు బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు వస్తున్నాయి. అయితే గూండాలను, బ్లాక్‌మార్లెటీర్లను ప్రోత్సహిస్తున్న నాయకులను మేం వదలబోము. నగరంలో శ్యాం ఎన్‌కౌంటర్‌ అనంతరం పార్టీ పూర్తిగా బలహీనపడిందని భావిస్తూ ముందుకొస్తున్న గూండాలు, వాళ్లను ప్రోత్సహిస్తున్న నాయకులు ధర్మారావు, దయాకర్‌రావు, మూగా రామ్మోహన్‌లాంటి వాళ్లను నగరంలోనే చంపుతాం. గూండాలను ప్రోత్సహించి బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లలో తిరుగుతున్న మాత్రాన తమనేం చేయలేరనుకుంటే పొరపాటు. కొండా మురళి నక్సలైట్ల శవయాత్రలో పాల్గొని వార్‌ అనుకూలుడిగా ఫోకస్‌ అవుతున్నాడు. ఈయన కత్తుల సమ్మయ్య తరహా వ్యక్తి. అలాగే గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్న మురళి భార్య అయినందున కొండా సురేఖను కూడా శిక్షిస్తాం.

జిల్లాలో ఇంకే అంశాలపై మీరు దృష్టి సారిస్తున్నారు?

వరంగల్‌ జిల్లాలో అణచివేత ఇప్పుడు తీవ్రతరమైంది. ఈ విషయాన్ని కూడా మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. వేయి మంది ఖైదీలకు వుద్దేశించిన జైలును రెండు వేల మందితో నింపుతున్నారు. పైగా కొన్నేళ్లుగా మాకు టార్గెట్‌గా వున్నజైలు సూపరింటిండెంట్‌ లక్ష్మారెడ్డి తీవ్ర దమనకాండకు పాల్పడుతున్నాడు. నగరాన్నికూడా కాన్సంట్రేషన్‌ క్యాంప్‌గా మారుస్తూ అణచివేతను తీవ్రతరం చేస్తున్నారు. ఈ అంశాన్ని కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నాం. జైలులో పరిస్థితులను మార్చకపోతే సూపరింటిండెంట్‌కు శిక్ష తప్పదు.

మాజీల సమస్య కూడా జిల్లాలో అవరోధంగా మారింది. మాజీలు ఇన్‌ఫిల్ట్రేషన్‌ ద్వారా కోవర్టులుగా మారి ప్రజావ్యతిరేకులుగా కావాలనుకుంటున్నారు. అయితే ఈ మాజీలలో కొందరిని శిక్షించడం ద్వారా మేం వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలనుకుంటున్నాం. బక్కన్న, సురేందర్‌, ఉప్పలయ్య, పోశన్న, జంపయ్య తదితరులు ప్రజావ్యతిరేకులుగా మారి అన్నం పెట్టినవారికి సున్నం పెడుతున్నారు.

జిల్లాలో రాజకీయ పరిస్థితి కూడా ఇక్కడ వివరించాల్సి వున్నది. తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి కడియం శ్రీహరి, దయాకరరావు, రేవూరిలతో పాటు మండల శ్రీరాములు కూడా సాయుధ గార్డుల మధ్య విప్లవోద్యమంపై తీవ్ర దుష్ప్రచారం సాగిస్తున్నారు. అలాగే పరకాల శాసనసభ్యుడు బొజ్జపల్లి రాజయ్య పార్టీపై బహిరంగంగానే విమర్శలకు దిగాడు. వీళ్లు తమ వైఖరి మార్చుకోవాలి. వీళ్లతో పాటు మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు కూడా పాలకవర్గ తైనాతీలుగా మారి పాలసీమేకర్స్‌గా భ్రమపడుతున్నారు. వాళ్లలో కొందరిని కూడా మేం శిక్షిస్తాం. నాగరంలోను, జిల్లాలోను పెరుగుతున్న నిర్బంధానికి నిరసనగా బిజెపి, టిడిపి నాయకుల రంగును బయట పెట్టాలనుకుంటున్నాం. పరకాల, వరంగల్‌, హన్మకొండ, జనగాంలలో పార్టీ బలహీనపడిందనే భ్రమతో బిజెపి నాయకులు నరహరి వేణుగోపాలరెడ్డి, ప్రేమేందర్‌ రెడ్డి, దుబాసి వాసుదేవ్‌, ఎమ్మెల్యే ధర్మారావులు కాన్షియస్‌గానే వార్‌పై దుష్ప్రచారానికి పూనుకుంటున్నారు. వీరిని కచ్చితంగా ప్రజల్లోనే శిక్షిస్తాం. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఎంఎల్‌ఎ సురేఖ పార్టీ అనుకూలురాలిగా పోజులు కొడుతున్నారు. బస్వరాజ్‌ సారయ్య, చేర్యాల శాసనసభ్యుడు రాజలింగం తేనే పూసిన కత్తులు. అలాగే పొన్నాల లక్ష్మయ్య కూడా మాకు టార్గెట్‌. వీళ్లు తమ వైఖరి బహిర్గతం చేస్తూ ప్రజల ముందుకు రావాలి. వారికి తోడు సిపిఎంలో నగర కమిటీకి చెందిన రాములు, సారంపల్లి మల్లారెడ్డి, కళ్లెపు వెంకటయ్యలు పీపుల్స్‌వార్‌పై బహిరంగంగానే విరుచుకుపడుతున్నారు. వైఖరి మార్చుకోకపోతే వారిని ప్రజల్లో ఎండగడుతాం. రెడ్‌ టైగర్స్‌, జనరక్షణ సంస్థలాంటి ముఠాలు ప్రజలను మోసం చేసి ఇన్‌ఫార్మర్‌ నెట్‌వర్క్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. వీళ్ల సంగతి కూడా ప్రజల్లోబహిరంగ పరుస్తాం. ఫాసిస్టు నిర్బంధాన్ని కొనసాగిస్తున్న ఈ నాయకులే గ్రామ పంచాయతీ ఎన్నికల పేరిట కలలు కంటున్నారు. రేపటి ఎన్నికలలో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. నిర్బంధంలో పోరాటమే లక్ష్యంగా ప్రజలు ముందుకు వస్తారు. మైత్రీ సదస్సులు, కౌన్సిలింగ్‌ దుష్ప్రచార దాడి తదితర అంశాలపై నాయకుల చౌకబారు ఎత్తుగడలను బహిర్గతం చేస్తూ ప్రజలు వాళ్లను నిలదీస్తారు. కౌకొండ, మల్లంపల్లి, మంచినీళ్లపల్లి ఎన్‌కౌంటర్లకు ప్రతీకారంతీసుకునేందుకు ఉద్యుక్తులవుతున్నాం.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X