వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు టిప్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews
TDP & Congressహైదరాబాద్‌ఃటీవీ, పత్రికలు తదితర ప్రసార సాధనాలనుఉపయోగించుకోవడంలో తెలుగుదేశం పార్టీకాంగ్రెస్‌ కంటే ఎంతో ముందు ఉన్నప్పటికీజనంలో ప్రభుత్వ వ్యతిరేకత చెప్పుకోదగ్గస్ధాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. జనం నాడిపై ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అనేక సర్వేలుచేయించారు. అయితే ఇవేవీ స్వతంత్ర సర్వేలు కావు కాబట్టివీటికి విశ్వసనీయత లేదు.

ఒక ప్రైవేటు ఛానల్‌లో నిన్న డయల్‌ యువర్‌ పార్టీ ప్రెసిడెంట్‌ కార్యక్రమం ఆర్భాటంగాప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గానుతెలుగుదేశం పార్టీ నెలకు రెండు లక్షలరూపాయలను ఆ ఛానల్‌ కు చెల్లిస్తుంది. ఇటువంటి ప్రచారపు ఆలోచనలు గానీఅందుకోసం ప్రత్యేక నిధులు గానీ కాంగ్రెస్‌ కులేవు. కోటీశ్వరులైన నాయకులుతెలుగుదేశంలో కంటే కాంగ్రెస్‌ లోనేఎక్కువ. అయినా గాంధీభవన్‌ నిర్వహణ ఖర్చులకోసం ప్రతినెలా వెదుక్కోవలసిందే.

తెలుగుదేశం వ్యతిరేకతనుంచి లబ్ది పొందాలన్న ఆలోచన మినహాకాంగ్రెస్‌ పార్టీకి వినూత్న ప్రచార కార్యక్రమాలు ఏమీలేవు. చంద్రబాబు నాయుడిని ఇబ్బందిలోపడేసే న్యాయ పోరాటం (కోర్టు కేసులు) చేసే ఆలోచనకొందరు యువ కాంగ్రెస్‌ నాయకులకు ఉన్నా చివరికి ఫలితం ఎలా ఉంటుందోనన్నఅనుమానంతో వీళ్ళు ముందడుగు వేయలేకపోతున్నారు.అలాగే ఉచిత కరెంటు హామీ విషయంలో కాంగ్రెస్‌నాయకుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ విషయంలోదేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని కాంగ్రెస్‌అధిష్టానవర్గం ఆలోచన.

చిన్న రైతులకు ఉచితవిద్యుత్‌ ఇస్తామని, ఒకే బల్బు వాడే పేదవినియోగదారులకు కరెంటు చార్జీల మాఫీచేస్తామని, ఇది ఆచరణ సాధ్యమేనని కాంగ్రెస్‌ స్పష్టంగా చెప్పగలిగితే సామాన్య జనంతెలుగుదేశం పార్టీకి దూరం కాగలరని ఒక అంచనా. కానీవిద్యుత్‌ సంస్కరణాలకు వేలాది కోట్ల రూపాయల రుణం ఇచ్చిన ప్రపంచ బ్యాంకు ఉచితంగావిద్యుత్‌ ఇవ్వడానికి వీల్లేదని షరతు పెట్టింది.అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్ధితి. కాబట్టి ఈ విషయంలోతొందర పడి హామీలు ఇవ్వరాదని కాంగ్రెస్‌ అధిష్టానవర్గం భావిస్తోంది.

తెలుగుదేశం ప్రచారఉదృతి, కాంగ్రెస్‌ నైరాశ్యం ఎలా ఉన్నా తెలుగు ప్రజలు మాత్రంస్పష్టమైన తీర్పు ఇస్తారనడంలో సందేహంలేదు. 1989లో కాంగ్రెస్‌ కు అనుకూలంగా 1994,99లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జనంస్పష్టమైన తీర్పు ఇచ్చారు. అనంత పురం నుంచిఆదిలాబాద్‌ వరకు శ్రీకాకుళం నుండి శ్రీహరికోటవరకు సామాన్య జనమంతా ఒకచోట కూర్చుని ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఆ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 1999లోనేను కరీంనగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేసినా.నేను ఓడిపోతానన్న సంగతి నాకు ముందుగానే తెలుసు. ఈ సారినేను పోటీ చేయదలుచుకోలేదు. అయినాకాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుందని నాకు ఇప్పటినుంచే అన్పిస్తున్నది అని ఎం. సత్యనారాయణ రావు ఇటీవలవ్యాఖ్యానించారు. కల్ల కపటం లేకుండా మాట్లాడేనైజం ఉన్న సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యఆలోచించదగినదే. Recent Stories

  • వైఎస్‌ కు సమాంతరం?
  • టిడిపి ఆశాభావం
  • సిఎం అతి జాగ్రత్తలు!
  • ఆశలుడిగినట్లే...
  • సర్దుపాటు
  • అనీమన టీవీలేనా?
  • సింగపూర్‌ ఇమిటేషన్‌!
  • ఐటీ గతి అంతేనా?

Archives

హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X