కరువు కాలం

Posted By:
Subscribe to Oneindia Telugu
M Satyanarayana Raoహైదరాబాద్‌ఃకాంగ్రెస్‌ పార్టీకి అత్యంత విధేయుడిగా ఉంటూ పిసిసిఅధ్యక్ష పదవి నుంచి హుందాగా తప్పుకున్నఎం. సత్యనారాయణ రావుకు రాజ్యసభ సభ్యత్వంఖాయమని ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. నవంబర్‌ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాతసత్యనారాయణ రావుకు పెద్దల సభలో స్ధానం లభించనుంది. వివిధ రాష్ట్రాలకునవంబరులో జరుగనున్న ఎన్నికల్లో ఏదో ఒక రాష్ట్రానికిఎమ్మెస్‌ పార్టీ పరిశీలకుడిగా కూడా వెళ్ళే సూచనలుకన్పిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ ప్రధానకార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ కు ఎం.సత్యనారాయణ రావుఅంటే అపారమైన గౌరవం. రాజీవ్‌ గాంధీ పార్టీఅధ్యక్షుడిగా ఉన్నప్పుడు గులాం నబీ ఆజాద్‌ కు జాతీయస్ధాయిలో పార్టీ పదవి రావడానికి అప్పట్లో పార్టీ ప్రధానకార్యదర్శిగా ఉన్న ఎం.సత్యనారాయణ రావే కారణం. ఆవిశ్వాసం ఆజాద్‌ లో ఇప్పటికీ ఉంది. నిజానికి నవంబర్‌వరకు ఎం సత్యనారాయణరావును పిసిసిఅధ్యక్షుడిగా కొనసాగించాలని ఆజాద్‌ అనుకున్నారు. కానీ కొన్ని కారణాంతరాలవల్ల ఆయనను ముందే రాజీనామా చేయించవలసివచ్చింది.

ఎం.సత్యనారాయణ రావును రాజ్యసభకు పంపుతారన్న ఆందోళన ఆపదవిని ఆశిస్తున్న ఒకకాంగ్రెస్‌ పారిశ్రామిక వేత్తకు కూడా పట్టుకున్నట్టు తెలుస్తోంది.సత్యనారాయణ రావు అడ్డు రాకపోతే ఐదు కోట్లుఅయినా పార్టీ ఫండ్‌ గా ఇచ్చి ఈ పదవి దక్కించుకోవాలని ఆ పారిశ్రామిక వేత్తఅనుకున్నారు.

 Recent Stories

 • సమైక్యాంధ్ర కోసం
 • టిడిపిబాటలో...
 • పల్స్‌ పోలింగ్‌!
 • వైఎస్‌ కు సమాంతరం?
 • టిడిపి ఆశాభావం
 • సిఎం అతి జాగ్రత్తలు!
 • ఆశలుడిగినట్లే...
 • సర్దుపాటు
 • అనీమన టీవీలేనా?
 • సింగపూర్‌ ఇమిటేషన్‌!
 • ఐటీ గతి అంతేనా?

Archives

హోమ్‌ పేజి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి