అంతుచిక్కని రోగం

Posted By:
Subscribe to Oneindia Telugu
కుజగ్రహం సమీపించడంవల్ల విమాన ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు సంభవించేఅవకాశముందని డిఎల్‌ ఎన్‌ మూర్తి అన్నారు. ఈగ్రహం ప్రభావం వల్ల చెడుతో పాటు మంచి కూడా జరుగుతుందని జ్యోతిష పండితుడు,వాస్తు నిపుణుడు కె. ఫణికుమార్‌ చెబుతున్నారు. 27 వ తేదీ తర్వాత ఎయిడ్స్‌, బ్లడ్‌క్యాన్సర్‌ వంటి భయానక వ్యాధులకు మందులు కనుగొంటారనిఆయన చెప్పారు. ఈ నెల 25 నుంచి చంద్రుడికిదగ్గరగా ఉండే కుజుడిని నేరుగా చూడవచ్చనిఆయన అన్నారు.

కుజుడు తలకు, ఎముకలకు అధిపతి కాబట్టి కుంభ,మేష,వృశ్చిక రాసుల వారికి నష్టంజరుగుతుందన్న విషయంలో జోతిష్యులందరూ ఏకీభవిస్తున్నారు. కుజుడి పక్కనయురేనస్‌ ఉండడం మరింత ప్రమాదకరమని ఫలితంగా ఈసంవత్సరం గొప్ప నాయకులను, మేధావులను,శాస్త్రవేత్తలను కోల్పోతామని ఫణికుమార్‌వివరించారు.

కుజుడి ప్రతికూల సంచారంవల్ల తుపాన్లు వరదల కారణంగా పంట నష్టాలు కూడా తీవ్రంగాఉంటాయని, ప్రభుత్వాలు ఇబ్బందుల్లో పడతాయనిఅన్నారు. ఈనెల 27 వ తేదీ మధ్యాహ్నం 1.51 గంటలకు కుజుడు భూమికిదగ్గరగా వస్తున్నాడని, ఆసమయంలో తలనొప్పులు, కళ్ళు తిరగడంవంటి వాటిని గమనించవచ్చని, ఆ రోజుసాధ్యమైనంతవరకు ప్రయాణాలు మానుకోవాలని ఆయనసూచించారు. ఆ రోజు తలస్నానం చేసి కుమారస్వామి,నరసింహ స్వామి ఆలయాలను సందర్శించాలనిగురు, రవి, కుజ గ్రహాలను పూజించాలని వివరించారు.

జ్యోతిషులు ఇలా భయపెట్టడంవల్ల 27 న మనదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య పడిపోయేఅవకాశం ఉంది. మినీ ర్యాలీతో ఉరకలు వేస్తున్న స్టాక్‌మార్కెట్‌ పై కూడా జోస్యాల ప్రభావంపడవచ్చు.

 Recent Stories

 • పెద్దల సభకుపెద్దాయన
 • సమైక్యాంధ్ర కోసం
 • టిడిపిబాటలో...
 • పల్స్‌ పోలింగ్‌!
 • వైఎస్‌ కు సమాంతరం?
 • టిడిపి ఆశాభావం
 • సిఎం అతి జాగ్రత్తలు!
 • ఆశలుడిగినట్లే...
 • సర్దుపాటు
 • అనీమన టీవీలేనా?
 • సింగపూర్‌ ఇమిటేషన్‌!
 • ఐటీ గతి అంతేనా?

Archives

హోమ్‌ పేజి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X