పాపం! ప్రతిపక్షం

Posted By:
Subscribe to Oneindia Telugu
D Srinivasహైదరాబాద్‌ః కొత్త పిసిసి అధ్యక్షుడుడి.శ్రీనివాస్‌ పేరుకు సిఏల్పీ నాయకుడు డాక్టర్‌వైస్‌ రాజశేఖర రెడ్డి మనిషి అయినా అతి కొద్దిరోజుల్లో సమీకరణాలు తారుమారు కావచ్చనిరాజకీయ పరిశీకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటివరకు వైఎస్‌ కు డిప్యూటీగా పని చేసిన వ్యక్తి కొన్ని పరిస్ధితులు అకస్మాత్తుగా అనుకూలించడంతోవైఎస్‌ కంటే ఉన్నత పదవిలో కూర్చోవడంముందు ముందు ఉభయుల మధ్య విభేదాలకు దారితీసేఅవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒకదశలో వైఎస్‌ తనకే పిసిసి పీఠం అప్పగించాలనిఅధిష్టానవర్గాన్ని డిమాండ్‌ చేశారు. అది వీలు కాకపోవడంతోఆయన తనకు అత్యంత విధేయులైన పొన్నాలలక్ష్మయ్య, నంది ఎల్లయ్య పేర్లను ప్రస్తావించారు గానీఆయన జాబితాలో డి.శ్రీనివాస్‌ లేరు. గులాం నబీఆజాద్‌ చాలా రోజుల క్రితమే డి.శ్రీనివాస్‌ అభ్యర్ధిత్వంవిషయంలో సోనియా గాంధీ అనుమతి తీసుకున్నట్టు తెలుస్తోంది.

తాను వెనుకబడిన కులానికిచెందిన వాడు కాబట్టే పిసిసి అధ్యక్ష పదవి లభించింది కాబట్టివచ్చే ఎన్నికల్లో బిసిలకు ఎక్కువ టికెట్లువచ్చేలా చూస్తానని, ఈ విషయంలో సీనియర్‌ నాయకులతో ఘర్షణకుదిగడానికైనా తాను సిద్ధమేనని శుక్రవారం రాత్రి తన శ్రేయోభిలాషులకుఆయన చెప్పినట్టు తెలుస్తోంది. గతఎన్నికల్లో రాజశేఖర రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో అర్హులకు టికెట్లుఇవ్వకపోవడం కాంగ్రెస్‌ పరాజయానికి ఒక కారణమన్నఅభిప్రాయం ఉంది.

డి.శ్రీనివాస్‌ కు కూడా ఈవిషయంలో భిన్నమైన అభిప్రాయం లేదు.ఎన్నికలయ్యే వరకు శ్రీనివాస్‌ ను మార్చబోమనిఅధిష్టానవర్గం ప్రకటించడం కూడా శ్రీనివాస్‌ నెత్తిన పాలుపోసినట్టయింది. తాను సోనియా గాంధీ మనిషిననిశ్రీనివాస్‌ ప్రకటించడాన్ని బట్టి ఆయన స్ధానికనాయకుల అనుచిత జోక్యాన్ని సహించబోరన్నసంకేతం వచ్చింది.

అసెంబ్లీఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డికంటే డి. శ్రీనివాస్‌ కే ముఖ్యమంత్రి అయ్యేఅవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్‌ అధికారంలోకివచ్చిన రాష్ట్రాల్లో ఇదే ట్రెండ్‌ నడిచింది.కాంగ్రెస్‌ హైరార్కీలో సిఎల్పీ నాయకుడి కంటే పిసిసినాయకుడే ఎక్కువ. సిఎల్పీ కూడా పిసిసి నాయకుడికనుసన్నల్లో నడుచుకోవలసి ఉంటుంది.

ఎన్నికలలోకాంగ్రెస్‌ గాలి వీస్తే అది ఒక బిసికి పార్టీ పగ్గాలు అప్పగించడంవల్లనే అన్న అభిప్రాయం ముందుకు రాక తప్పదు. ఆవిధంగా కూడా డి.శ్రీనివాస్‌ కు తిరుగులేని ఆధిపత్యం లభించవచ్చు. ఇటీవల కొన్నిరాష్ట్రాల్లో బలహీన వర్గాల వారేముఖ్యమంత్రులయ్యారు.

మొదటి నుంచిపార్టీలో ఒక వర్గానికి మాత్రమే నాయకత్వం వహిస్తున్న డాక్టర్‌వైఎస్‌ రాజశేఖర రెడ్డికి పార్టీలో శత్రవులుచాలా ఎక్కువ. మొదట్లో ఎం. సత్యనారాయణరావుతోకూడా ఆయనకు విభేదాలు వచ్చాయి.

సిఎల్పీ నాయకుడికంటే పిసిసి అధ్యక్షుడే సుప్రీం అని, అన్ని పార్టీ శాఖలు పిసిసి అధ్యక్షుడికింద పని చేయాల్సిందేనని ఎమ్మెస్‌ ఒక దశలో పరుషంగామాట్లాడవలసి వచ్చింది. ఆ తర్వాత ఎమ్మెస్‌ తనకు ముఖ్యమంత్రిపదవి మీద ఆశ లేదని, వైఎస్సే కాబోయే సిఎం అనిపదే పదే ప్రకటించిన

అనంతరం కానీవైఎస్‌ శాంతించలేదు. అప్పటి నుంచి ఎమ్మెస్‌,వైఎస్‌ మధ్య సయోధ్య కొనసాగింది. కాబోయే ముఖ్యమంత్రివైఎస్సేనని శ్రీనివాస్‌ ప్రకటిస్తారని ఊహించలేం.అలా ప్రకటించి లౌక్యం చాటుకోక పోతే వైఎస్‌వర్గం శ్రీనివాస్‌ కు వ్యతిరేకంగా ఎంత దూరంవెళ్ళడానికైనా వెనుకాడరు.

పిసిసి అధ్యక్షపదవి తన జీవిత లక్ష్యమని, ముఖ్యమంత్రిపదవి తగ్గకపోయినా ఫర్వాలేదని శుక్రవారం సంతోషసమయంలో శ్రీనివాస్‌ ప్రకటించినా ఈ సంతృప్తి ఎక్కువ కాలంఉండకపోవచ్చు. రాజకీయాల్లో అందులోనూకాంగ్రెస్‌ రాజకీయాల్లో సంతృప్తికి తావుండదు.  Recent Stories

  • టిడిపి ఆశాభావం
  • సిఎం అతి జాగ్రత్తలు!
  • ఆశలుడిగినట్లే...
  • సర్దుపాటు
  • అనీమన టీవీలేనా?
  • సింగపూర్‌ ఇమిటేషన్‌!
  • ఐటీ గతి అంతేనా?

Archives

హోమ్‌ పేజి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి