స్టాలిన్‌ కథ ఇదే

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే తెలుగుదేశం Friday, May 21 2004

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడిపై కొత్త ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలుతీసుకుంటుందా అన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. చంద్రబాబుఅవినీతిపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్ధానం తిరస్కరించలేదు కానీహైకోర్టులో దాఖలు చేయవలిసిందిగా సూచించింది. ఈ పిటిషన్‌ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో ఉంది. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి,తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితలపై రాజకీయ కక్షసాధింపు జరిగింది.

చంద్రబాబు నాయుడిపై కొత్త ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి పనిగట్టుకుని కక్ష సాధించే అవకాశంలేదనే చెప్పాలి. ఆయన గతంలో హైకోర్టులో చంద్రబాబునాయుడిపై వేసిన కేసులను ఆనాడే ఉపసంహరించుకున్నారు.ప్రఖ్యాత న్యాయవాది ఎస్‌ రామచంద్రరావు అప్పట్లో ఈ కేసునివాదించారు. ఆయన ఇప్పుడు వైఎస్‌ తో నిమిత్తం లేకుండా చంద్రబాబుపైన్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.

చంద్రబాబునాయుడి అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తే ఆయనఇబ్బందుల్లో చిక్కుకుంటారు. జివికె, హిందుజా వంటి సంస్ధలతో ఆయనహయాంలో కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందాలువివాదాస్పదమయ్యాయి. ఈ లావాదేవీల్లో పెద్ద ఎత్తున డబ్బుచేతులు మారిందన్న ఆరోపణలున్నాయి. ప్రపంచబ్యాంకు రుణంతోనిర్మించిన ఫ్లైవోవర్లు బెంగుళూరుతో పోల్చుకుంటే నాసిరకంగాఉన్నాయి. నెదర్లాండ్స్‌ ఆర్ధిక సహాయంతో అమలు చేసిన నీరు-మీరుకార్యక్రమంలో కొన్ని వందల కోట్లు దుర్వినియోగమయ్యాయి.పనికి ఆహారం పథకం కింది వచ్చిన రెండువేల కోట్ల రూపాయలవిలువైన బియ్యం విదేశాలకు, బ్లాక్‌ మార్కెట్‌కుతరలిపోయిందన్న ఆరోపణలున్నాయి. వీటిపై కొన్ని వందల పోలీసుకేసులు నమోదయ్యాయి. బడా వ్యాపారసంస్ధలకు విలువైనభూములను పందేరం చేయడం కూడా వివాదాస్పదమైంది.

కేంద్రంలోఅధికారంలో ఉండే పార్టీ పురిగొల్పితే సిబిఐ స్నిఫర్‌ డాగ్‌లా వెంటపడుతుంది.దర్యాప్తు విషయంలో ఆ సంస్ధకు విశేషాధికారాలుంటాయి.

ఇటీవలికథనాలు

  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+