• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పావు కదిపేదిఎవరు?

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Tuesday, July 06 2004

హైదరాబాద్‌:ఇద్దరూ ఒకనాటి మిత్రులే. దాదాపు ఒకటేవయసు. ఇద్దరిదీ రాయలసీమే. ఇద్దరూ1978లో తొలిసారిగా ఎమ్మెల్యేలు అయ్యారు.వ్యవహారసరళిలో మాత్రం ఇద్దరికీఎంతో వ్యత్యాసం ఉంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందరినీ నమ్మినట్టు కన్పిస్తారు.ఎవరినీ నమ్మరు. రాజకీయ జీవితం ప్రారంభించిననాడు ఆయనకు అతి సన్నిహితంగా ఉన్నవారుఇప్పుడెంతో దూరంగా ఉంటున్నారు. ఆయనమనసు విప్పి మాట్లాడుకోడానికి ఒక్కస్నేహితుడు కూడా ఉండడు.

రాజశేఖరరెడ్డిఇందుకు పూర్తి భిన్నం. ఆయన చిరకాల మిత్రుడుడాక్టర్‌ రామచంద్రరావు ఇప్పుడురాష్ట్రప్రభుత్వ సలహాదారు. రామచంద్రరావు,రాజశేఖరరెడ్డి కథల్లో రాసినట్టు ప్రగాఢస్నేహితులు. వైఎస్‌ సుఖాల్లో కంటే కష్టాల్లోనేఆయన ఎక్కువగా పాలు పంచుకున్నారు.ఆయనతో సంప్రదించనిదే వైస్‌ ఏ చిన్నపనీ చేయరు. వెఎస్‌కు మరో నమ్మిన బంటుఉన్నాడు. అతని పేరు సూరీడు. ఇతని మీద గతంలోఅనేక ఫ్యాక్షన్‌ కేసులున్నాయి. ఇతను ఎప్పుడూవైఎస్‌ వెనకే కన్పిస్తాడు. భీమవరంపర్యటనలో అయినా ఢిల్లీ యాత్రలో అయినా ఇతనురాజశేఖరరెడ్డికి నీడలా ఉంటాడు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చుట్టూఇటువంటి వ్యక్తులు కన్పించరు. అధికారంఉన్నా అంతే. లేకపోయినా అంతే. తనకురాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వారిని కూడా ఆయనతేలిగ్గా మర్చిపోగలరు.అయితేతాను రాజకీయంలో పైపైకిఎదగడానికి సహకరించినవారికిఆయన పదవులు కట్టబెట్టారు.తనకు సహకరించడం ద్వారాతాము కూడా పైమెట్లు ఎక్కగలమని వారుఅనుకోవాలని చంద్రబాబు ఆలోచన. కానీ వారిసలహాలను ఆయన ఏనాడూ వినరు. సలహాలుఇవ్వడానికి కూడా వారుసహకరించరు.

తానుపై మెట్టు ఎక్కడానికి చంద్రబాబుఎవరినైనా వాడుకుంటారని, తనకుఅడ్డం వస్తారనుకుంటే వారిని పక్కనపెడతారని గత సంఘటనలు రుజువుచేస్తున్నాయి. దీని కారణంగానే ఆయనచాలా మందిని దూరం చేసుకున్నారు.తాను ముఖ్యమంత్రి కావడానికిసహకరించిన తన బంధువులుదగ్గుబాటి వెంకటేశ్వరరావు,హరికృష్ణలాంటి, రేణుకాచౌదరివంటివాళ్లను కూడా ఆయన దూరంకొట్టడానికి వెనకాడలేదు.

రాజశేఖర్‌రెడ్డి అందుకు భిన్నంగావ్యవహరిస్తారు. మొదట్లో కడప,ఇతర రాయలసీమ జిల్లాల్లో తనప్రత్యర్థులుగా వున్న వారిని కూడాఆయన కలుపుకొని పోవడానికేప్రయత్నిస్తున్నారు. మంత్రి దివాకర్‌రెడ్డితో సన్నిహితంగా మెలగడానికిఆయన వెనకంజ వేయడం లేదు.అధికారం కాపాడుకోవడానికిచంద్రబాబు అందరినీ దూరం చేసుకుంటూపోతే రాజశేఖర్‌ రెడ్డి అధికారం కోసంఅందరినీ కలుపుకొని పోయే పంథానుచేపట్టారు. ఒక రకంగా ప్రస్తుతవిజయానికి ఈ లక్షణమే కారణం.ఒకప్పుడు చంద్రబాబు పక్కన ఉన్న చాలామంది ఇప్పుడు వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి పక్కన లేదంటే కాంగ్రెస్‌లోవున్నారు. వీరంతా ఒక రకంగాచంద్రబాబు ధోరణి వల్లనేఎదిరిపక్షానికి వెళ్లిపోయారు.

తానేఅంతా, తన వల్లే తన చుట్టూవున్నవారికి భవిష్యత్తువుంటుందనే నమ్మకంచంద్రబాబుకు ఉంది. అందువల్లే ఆయనఅందరూ తన మాటకు కట్టుబడివుండాలని అనుకున్నారు. అధికారంకోల్పోవడానికి కొన్ని రోజుల ముందు నుంచిఆయన చేసే నిర్ణయాలను అందరూతమ ఇష్టానిష్టాలతో ప్రమేయం లేకుండాఔదల దాల్చే స్థితికి చేరుకున్నారు.అంటే ఆయన సలహాలు, సూచనలు వినరని,చెప్పడం వల్ల తమకే నష్టమనేభావం పార్టీ నాయకుల్లో వచ్చేయడంఅందుకు కారణం. ఆ రకంగా అంతాతానే అయి, తానే కేంద్ర బిందువుగామారి పార్టీని అపజయం బాటలోనడిపించారు.

 • సీమటపాకాయ
 • మన్మోహనం
 • మీనాఎందుకు?
 • రాష్ట్రం నుంచి మూడో ప్రధాని
 • గులాబీపోరు!
 • నెలరాజు వైఎస్‌
 • మారువేషంలోవెళ్ళొచ్చు కదా?
 • ఎవరు గొప్ప?
 • ఆచితూచి అడుగులు
 • సవాళ్ళు ఎన్నో...
 • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X