పాత నాయకులకుచెక్‌

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీలో మౌలికమైన మార్పులుజరుగుతున్నాయి. పార్టీలోపాతుకుపోయివ బిసి నాయకులకు చంద్రబాబునాయుడు చెక్‌పెడుతున్నారు. సీనియర్‌ నాయకుడుయనమల రామకృష్ణుడికి సమాంతరంగా అదేకులానికి చెందినతలసాని శ్రీనివాస్‌ యాదవ్‌నుప్రోత్సహిస్తున్నారు. శ్రీనివాస్‌ యాదవ్‌ఇటీవలే తెలుగు యువతఅధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. నగరంలోనియాదవుల్లో శ్రీనివాస్‌ యాదవ్‌కు పలుకుబడి ఉంది.

రంగారెడ్డి జిల్లాలోగత పదిహేనేళ్ళుగా మకుటం లేనిమహారాజుగా వెలిగిన మాజీ హోంమంత్రి దేవేందర్‌ గౌడ్‌కు రంగారెడ్డి జిల్లాజెడ్పీ చైర్మన్‌ కాసాని గ్నానేశ్వర్‌ముదిరాజ్‌ రూపంలో చంద్రబాబు చెక్‌పెట్టారు. దేవేందర్‌ గౌడ్‌కురంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాల భూములున్నాయి. ఈ మధ్య రియల్‌ ఎస్టేట్‌ధరలు పెరగడంతో ఆయన ఆస్తులు కొన్ని వందలకోట్లకు చేరుకున్నట్టు చెబుతున్నారు. దేవేందర్‌ గౌడ్‌కుఉన్న ఆర్ధిక స్ధోమత ముందు ముందుతనను లెక్కచేయని స్ధితికి తీసుకెళ్తుందన్నఅనుమానం చంద్రబాబు నాయుడికి ఉంది. చంద్రబాబునాయుడు విశాలాంధ్రకు కట్టుబడిఉండడం దేవేందర్‌ గౌడ్‌, కడియం శ్రీహరి వంటి తెలంగాణ టిడిపినాయకులకు నచ్చడం లేదు. వీరు ఏదోఒక దశలో తెలంగాణకు అనుకూలంగావేరు కుంపటి పెట్టుకోవచ్చన్నసంకేతాలు చంద్రబాబు నాయుడికిఅందుతున్నాయి. అందువల్ల కాసానికి చంద్రబాబునాయుడు పార్టీలో ప్రాధాన్యంపెంచారు. గతంలో కాసానికిసనత్‌నగర్‌ అసెంబ్లీ టికెట్‌రాకుండా దేవేందర్‌ గౌడ్‌ అడ్డుపడ్డారు.

తెలుగుదేశంపార్టీలో కాపులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దనాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.ఆయనకు కూడా మరో కాపు నాయకుడినిపోటీ పెట్టే విషయాన్ని చంద్రబాబు నాయుడుసీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.ఎస్‌,సి, ఎస్‌టి నాయకత్వంలో ప్రాధాన్యతలుకూడా మారనున్నాయి. ఎన్టీఆర్‌ హయాంలో ప్రవేశపెట్టినరెండు రూపాయలకు కిలో బియ్యంతరహాలో ఒక పెద్ద ప్రజాకర్షక పథకాన్నివచ్చే ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇవ్వాలని చంద్రబాబుయోచిస్తున్నారు.అందుకోసం తెలుగుదేశం మేధావులుకసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+