ఏ దేశమేగినా....

75మంది బాలబాలికలు సంప్రదాయ దుస్తుల్లో ప్రముఖవాగ్గేయకారుల వర్ణ చిత్రాలనేపధ్యంగా అరగంటసేపు క్షేత్రయ్య,రామదాసు, అన్నమయ్య, నారాయణ తీర్ధులు, త్యాగరాజులకీర్తనలనుఆలపించిన మధుర ఘట్టం...

150మందిపిల్లలు శాతవాహనుల కాలం నుంచి నేటివరకు తెలుగువారి చారిత్రక వైభవాన్ని గంటసేపుకళ్ళకుకట్టినట్లు ప్రదర్శించిన నృత్య గానరూపకం...

కులీఖుతుబ్‌ షా, భాగమతిల ప్రణయ గాధలో ప్రతిధ్వనించిన ఖవాలీలు, పాటలు...

ఎప్పుడో మనపెద్దవాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు చూసినతోలుబొమ్మలాటలను మన పిల్లలకు చూపించిన సదవకాశం...

ఇంకా ఎన్నోఅచ్చతెలుగు కార్యక్రమాలను వీక్షించిన2,500 మంది తెలుగువారు...

ఇవన్నీసిలికానాంధ్ర నిర్వహించిన ఐదోసాంస్కృతికోత్సవం దృశ్యాలు. అక్టోబర్‌ 8శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచిరాత్రి పది గంటల వరకు ఈ కార్యక్రమాలుజరిగాయి. క్యుపర్టినో నగరంలోని అతి పెద్దఆడిటోరియం ప్లింట్‌ సెంటర్‌లో శనివారంమధ్యాహ్నం ఒంటిగంటకు మారేపల్లివెంకటశాస్త్రి వేదపఠనంతోకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఆంధ్రచారిత్రక వైభవం కార్యక్రమంలో 150మంది బాలబాలికలు పాల్గొనడం విశేషం.శాతవాహనుల కాలం నుంచి పీవీ నరసింహారావు, ఎన్‌టి రామారావు,చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి లపరిపాలన వరకు సాగిన ఆంధ్రుల చరిత్రలోనికొన్ని ముఖ్య ఘట్టాలను సంగీత నృత్య రూపకంగా ప్రదర్శించారు.గంటసేపు సాగిన ఈ కార్యక్రమంలో మాటలు,పాటలు, వ్యాఖ్యానాలను పిల్లలే స్వయంగాపలకడం ఆశ్చర్యం కలిగించింది.

ఈభారీకార్యక్రమంలో 225 మంది పిల్లలతో సహా మొత్తం 325మంది వేదిక మీద కళాప్రదర్శనలు చేశారు. సిలికానాంధ్రఅధ్యక్షుడు కిరణ్‌ప్రభ మాట్లాడుతూ, సిలికానాంధ్రనిర్వహిస్తున్న సాంస్కృతికకార్యక్రమాలు కళాకారుల,కార్యకర్తల వ్యక్తిత్వ వికాసానికి ఎలా తోడ్పడుతున్నాయో వివరించారు.

ఈమొత్తంకార్యక్రమానికి సారధులుగా అయ్యగారిలలిత, సాధనాల చంద్రశేఖర్‌లువ్యవహరించారు. సాయంకాలంపదహారణాలు తెలుగు విందు భోజనాన్ని స్ధానిక ప్రముఖ రెస్టారెంట్‌ బంజారావారు సరఫరా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+