వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌మార్కెటింగ్‌ కమిషన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 27-12-2005

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్న వారికిటిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావుతీవ్ర నిరుత్సాహాన్ని మిగిల్చారు.ఇప్పటివరకు ఆయన తన కార్మికశాఖను పట్టించుకోని తెలంగాణప్రగల్భాలు వదిలి తన శాఖ మీద దృష్టిపెట్టారు. గత 20 నెలలుగా ఆయన,నరేంద్ర చేసిన ప్రకటనలు, సవాళ్ళు,చివాట్లు అందరికీ గుర్తుండే ఉంటాయి.కాంగ్రెస్‌ అధిష్టాన వర్గం ఆయనకు ఏదోచూపి చివరికి హైదరాబాద్‌ ప్లీనరీలోనేల నాకించింది. ఇది అందరికీ అర్ధమైనవిషయమే. కేంద్రంలో యుపిఎప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ,తెలంగాణ రాష్ట్రం సాధించగలననిఇప్పటివరకు నమ్మబలికినచంద్రశేఖరరావుకు ఇంకా తెలంగాణగురించి చెప్పడానికి నోట్లో కంప్యూటర్‌చిప్స్‌ మిగల్లేదు.

చంద్రశేఖరరావుతన రాజకీయ జీవితాన్ని చిన్న కాంగ్రెస్‌కార్యకర్తగా ప్రారంభించారు. ఆది నుంచిఆయనది రాజకీయసిద్ధాంతపరమైన మనస్తత్వంకాదు. ఆయన మౌలికంగా మార్కెటింగ్‌వ్యక్తి. ఎల్‌ఐసి ఏజెంటుగా అయితే ఆయనఆర్ధికంగా స్ధిరపడేవారు. రాజకీయాల్లోమార్కెటింగ్‌ను, యుఎస్‌పిని పతాకస్ధాయిలో డెమో ఇచ్చిన ఘనత ఆయనది.తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయనత్వరితంగా ఎదగడానికితెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారు. ఆపార్టీ వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ హయాంలో కాదు,చంద్రబాబు నాయుడు హయాంలో. బుర్రలోగుజ్జు తక్కువగా ఉన్న చంద్రబాబునాయుడికి కెసిఆర్‌ ఒక పెద్దమేధావిగా కన్పించారు. రవాణామంత్రిగా కెసిఆర్‌ చంద్రబాబుకేబినెట్‌లో ఒక వెలుగు వెలిగారు.ఎప్పుడైతే చంద్రబాబు ఆయనను మంత్రిపదవి నుంచి తొలగించి, డిప్యూటీ స్పీకరుపదవితో సరిపెట్టారో అప్పుడుచంద్రశేఖరరావుకు తల్లితెలంగాణ గుర్తుకొచ్చింది. అప్పటికేతెలంగాణ మేధావులు పెట్టుకున్న చీమలపుట్టలోకి ఆయన పాములా ప్రవేశించారు.టిఆర్‌ఎస్‌ పెట్టి, కాంగ్రెస్‌ పార్టీకి పెద్దడెమో ఇచ్చి మిత్రపక్షంగా ఎక్కువ స్ధానాలుపొంది, తన గ్రహస్ధితి బాగున్నసమయంలో కేంద్ర కేబినెట్‌ మంత్రిఅయ్యారు.

తెలంగాణనుఅడ్డుపెట్టుకుని అగ్రస్ధానంలోకి వచ్చినవ్యక్తిగా మర్రి చెన్నారెడ్డికి పేరుంది.కానీ చంద్రశేఖరరావుకూచెన్నారెడ్డికీ పోలిక లేదు.చెన్నారెడ్డికి ఉన్న నాయకత్వలక్షణాలు, వ్యూహపటిమచంద్రశేఖరరావుకు లేవు.చెన్నారెడ్డి తెలంగాణ ప్రజలకు కొంతద్రోహం చేసినా ఆయనంటే తెలంగాణప్రజలకు అభిమానం ఉండేది.చంద్రశేఖరరావు విషయం అలా కాదు.ఆయన బహురూపి. మరో మూడేళ్ళవరకు కేంద్రమంత్రిగాకొనసాగుదామన్నది ఆయన ఆశ.కెసిఆర్‌ కేంద్ర మంత్రిగాదేశమంతటా రాజభోగాలతోపర్యటించవచ్చు. కానీ ఆయనతరచుగా తెలంగాణ లోసురక్షితంగా పర్యటించే అవకాశాలులేవని తెలంగాణ మేధావులు కొందరువ్యాఖానిస్తున్నారు. మొత్తానికి తెలంగాణచంద్రశేఖరరావు ఒక్కరికే కోటిరతనాల వీణగా మారింది.

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X