లక్షకోట్లు ఎక్కడి నుంచి?

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> కాంగ్రెస్‌ 07-02-2006 ;?

Y S Rహైదరాబాద్‌: నీటిపారుదల ప్రాజెక్టుల కోసం లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తాజా అంచనా. ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో నీటి పారుదల ప్రాజెక్టుల అంచనా వ్యయం 46 వేల కోట్లు. రెండేళ్ళలోనే అంచనా వ్యయం సగానికి సగం పెరిగిందా? ఇందులో కొత్త ప్రాజెక్టులు వచ్చి చేరాయా అన్నది స్పష్టం కావట్లేదు. ముఖ్యమంత్రి లక్ష కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి సేకరిస్తారో కూడా అర్ధం కావట్లేదు. పైగా ఆయనకున్న మరో మూడేళ్ళ పదవీ కాలంలో లక్ష రూపాయల నిధులను సేకరించి, ఖర్చు చేయగలరా అన్నది మరో ప్రశ్న.

వ్యవసాయం పెద్ద లాభదాయకం కాని ఈ కాలంలో లక్ష కోట్ల రూపాయలను నీటి పారుదల ప్రాజెక్టుల మీద ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? గ్రామీణ, కుటీర పరిశ్రమల అభివృద్ధికి కూడా భారీగా నిధులను కేటాయించవలసిన అవసరం లేదా? గ్రామీణాభివృద్ధి అంటే కేవలం రైతుల అభివృద్ధి కాదు. భూమిలేని నిరుపేదల గురించి, గ్రామీణ వృత్తుల వారి గురించి ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరముంది. నీటిపారుదల ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ తీసుకుంటున్న చొరవను ప్రశంసించిన సోనియా గాంధీ మన్మోహన్‌ సింగ్‌లు ఇతర రాష్ట్రాలు ఆంధ్రను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా దేశమంతటా ఈ విషయంలో పప్పులో కాలు వేస్తోందా అన్న అభిప్రాయం కలుగకమానదు. గ్రామీణాభివృద్ధి నిపుణులతో కమిటీ వేసి ప్రాధాన్యతలను నిర్ణయించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

రైతు వేషంలో పాదయాత్రలు చేసి రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. గ్రామీణాభివృద్ధి నినాదం ఆయన బాగా కలిసివచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మరీ ముఖ్యంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి కారణమన్ని కాంగ్రెస్‌ అధిష్టానవర్గంలోని అత్యధికుల అభిప్రాయం. అందుకే వారు రాజశేఖరరెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన కోటరీయే యావత్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. తనకు ఇచ్చిన స్వేచ్ఛను ఆయన సద్వినియోగం చేసుకుని, నీటిపారుదల ప్రాజెక్టులపై మరీ ఎక్కువ ఫోకస్‌ పెట్టకుండా చూడవలసిన అవసరముంది. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అభివృద్ధి చేయాలి.

ఇటీవలి కథనాలు హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+