చంద్రబాబు భయాలుbrచిరుపార్టీలోకి టిడిపి నుంచే ఎక్కువ వలసలు ఉండడం దేనికి సంకేతం?

రాజకీయాల్లో ఆ మాత్రం దమ్ము లేకపోతే రాణించడం కష్టం. ఉత్తరాది రాజకీయ నాయకుల శైలిని వైఎస్ పుణికి పుచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో అసలైన దక్షిణాది. ఉత్తరాది రాజకీయ నాయకులు ఢిల్లీలో ఐఎఎస్ అధికారులను వాళ్ళ చాంబర్లలో కలిసి, పని చేయకపోతే కాల్చేస్తానని బెదిరిస్తుంటారు. మర్యాదస్తులైన ఐఎఎస్ అధికారులు ఈ విషయాలను బయటపెట్టుకోరు. అంతరాత్మ ఒప్పుకోని పక్షంలో ఆ పనులు చేయకుండా దీర్గకాలిక సెలవులోకి వెళ్ళిపోతుంటారు.
చంద్రబాబు, వైఎస్ స్వభావాలను చర్చించాం కాబట్టి ఇక చిరంజీవి మనస్తత్వాన్ని విశ్లేషించాల్సిన అవసరముంది. చిరంజీవి స్వతహాగా సున్నిత స్వభావుడు. ఎవరితోనూ కోరి వివాదం తెచ్చుకోరు. మనసుకు గాయమైతే కొన్ని రోజుల తరబడి ఆయన ఎవరికీ కనబడరు. కానీ ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకున్న చిరంజీవి గతంలో లాగా నాలుగు గోడల మధ్య ఉండడం మంచిది కాదు. విమర్శలను సహృదయంతో స్వీకరించాలి. నిజమైన నాయకుడిలా ఎదగాలి.
చిరంజీవి కుటుంబానికి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి బాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అశ్వనీదత్ కు విజయవాడ లోక్ సభ స్ధానం నుంచి తెలుగుదేశం టికెట్ ఇప్పించింది చిరంజీవే. అశ్వనీదత్ కు ఓటేయమని చిరు విన్నపం చేసినా ఆయన అభిమానులు పట్టించుకోలేదు. చిరంజీవి సొంతపార్టీతో ప్రజల ముందుకు రావాలే కానీ, ఈ తెరచాటు వ్యవహారాలేమిటని ఆయన అభిమానులు భావించినట్టు కనిపించింది. ఫలితంగా చిరంజీవి మద్దతు ఇచ్చినా అశ్వనీదత్ ఓడిపోయారు. ఆయన మీద కాంగ్రెస్ అభ్యర్ధి లగడపాటి రాజగోపాల్ విజయం సాధించారు.
వచ్చే ఎన్నికల్లో చిరంజీవి చంద్రబాబు నాయుడికే కాదు, వైఎస్ కు కూడా పెద్ద థ్రెట్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక మీదట బాబు, వైఎస్ చేసే విమర్శలను చిరంజీవి తట్టుకోవాలి. సందర్భోచితంగా, హీరోచితంగా వాటికి కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. చిరంజీవి ఇక మీదట సర్వే జనా సుఖినోభవంతు అన్న రీతిలో వ్యవహరిస్తే లాభం ఉండదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా ఫర్మ్ గా వ్యవహరించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications
