చిరంజీవి ఇలా చేయకూడదేమో?brనగదు విరాళం ప్రకటించకుండా అభిమానులకు పిలుపు ఇవ్వడం సమంజసమా?

ఇటీవల వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు చిరంజీవి తన ట్రస్టు తరఫున ఆర్ధిక సహాయం ప్రకటించి ఉండాల్సింది. కానీ ఆయన అలా చేయలేదు. తన ఆఫీసు ప్రారంభం సందర్భంగా ఆయన వర్ష బాధితులకు సహాయం చేయవలసిందిగా అభిమానులకు పిలుపు ఇచ్చారే తప్ప తన తరఫు నుంచి విరాళం ప్రకటించలేదు. ఆ మరుసటి రోజు నిర్మాత రామానాయుడు 10 లక్షలు, హీరో రాజశేఖర్ 5 లక్షలు చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. దీనితో చిరంజీవి శిబిరంలో ఉన్నామనుకుంటున్న మేధావుల్లో మేధో మధనం మొదలైంది.
చిరంజీవి ఈ విధంగా ఉంటే ప్రజల విశ్వాసం చూరగొనడం కష్టమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రాజకీయాల్లోకి రాకముందే ఎన్టీఆర్ వరద బాధితులకు స్వయంగా విరాళం ఇవ్వడమే గాక జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు సేకరించి బాధితులకు పంచి పెట్టారు. ఆ ఇమేజ్ కూడా ఆయన రాజకీయ పార్టీకి ఉపయోగపడింది. చిరంజీవి శిబిరంలోని మేధావులు ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించాల్సి ఉంది.
రెండు అగ్ర వర్ణాల చేతుల్లో ఉండిపోయిన మన ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం చిరంజీవి ద్వారా సాధ్యమవుతుందని ఆశిస్తున్న వారికి చిరంజీవి శిబిరం నియంతృత్వ పోకడలు బాధ కలిగిస్తున్నాయి. చిరంజీవి వంటి మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. కానీ ఆ శిబిరం ముఖ్యమైన ఎజెండా విషయంలో దృష్టి పెట్టకపోవడం బాధ కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications
