చిరు మెగా అడుగులుbrకొన్ని మార్పులు చేసుకుంటే చిరంజీవి పార్టీ అధికారంలోకి రావడం కష్టం కాకపోవచ్చు...

Chiranjeevi
హైదరాబాద్: దాదాపు పాతికేళ్ళ క్రితం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్ధాపించి తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన తర్వాత నిన్న హీరో చిరంజీవి అదే పద్ధతిలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. "ప్రజా రాజ్యం" పేరుతో చిరంజీవి స్ధాపించిన పార్టీ విజయావకాశాల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేము. ఆయన ప్రజల మధ్య సంచరించిన కొన్ని రోజుల తర్వాత కానీ అసలు విషయం బయటపడదు.

అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు చాలా బలంగానే ఉంది. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్వామి కార్యం, స్వకార్యంతో పాటు సామాన్య ప్రజల కోసం అసంఖ్యాక పథకాలను అమలు చేస్తున్నారు. మరో వైపు చంద్రబాబు నాయుడు గతంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఆయన సభలకు చెప్పుకోదగిన రీతిలో జనం హాజరవుతున్నారు.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బలంగా ఉన్న ఈ తరుణంలో చిరంజీవి కొత్త పార్టీతో ముందుకు రావడం నిజంగా సాహసోపేతమైన విషయమే. ఆంజనేయస్వామికి వీరభక్తుడైన చిరంజీవికి ఇంతటి ధైర్యం రావడంలో ఆశ్చర్యం లేదు. అయితే చిరంజీవి పార్టీకి సంబంధించి అనేక విషయాలను ప్రధాన మీడీయాలు లేవనెత్తుతున్నాయి. చిరంజీవి నిన్నటి సమావేశంలో అనవసర విషయాలను తీసుకొచ్చి అధిక ప్రసంగం చేశారని ప్రధాన విమర్శ. ఎన్టీఆర్ లా ఆయన రెండు మూడు నినాదాల మీదనే ఫోకస్ చేసి ఉండాల్సిందని నిపుణుల అభిప్రాయం.

అయితే చిరంజీవి స్వభావరీత్యా ఎన్టీఆర్ వంటి వ్యక్తి కాదు. చిరంజీవి సున్నిత స్వభావుడు. ఎన్టీఆర్ మిన్ను విరిగి మీద పడినా చలించని వ్యక్తి. అందరు నాయకులూ ఒకే విధమైన స్వభావాన్ని కలిగి ఉండరు. కాబట్టి ఈ పోలికలు అనవసరం. ఇక మీదనైనా చిరంజీవి బ్రీఫ్ గా, ఫోకస్ డ్ గా మాట్లాడడం మంచి చేస్తుంది. జనంలో నమ్మకం కలిగిస్తుంది. ఆయన తన సినిమా ఇమేజ్ మీద పూర్తిగా నమ్ముకోకుండా, రాజకీయ నాయకుడిగా కొత్త పాత్రలో పూరిస్ధాయిలో జీవించవలసి ఉంటుంది. ఆయన గతంలో బతక కూడదు. భవిష్యత్తు మీద గొప్ప విజన్ తో ముందుకు కదలాలి. సామాన్య ప్రజలకు భవిష్యత్తు మీద ఆశ కలిగించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+