వైఎస్ వర్సెస్ చిరుbrచిరు పార్టీ వల్ల కాంగ్రెస్ కే మెగా నష్టం జరిగే అవకాశాలు....

చిరంజీవి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాపుల ఓట్లను ఆకర్షిస్తూనే ఇతర వర్గాల ఓట్లను రాబట్టుకోడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు కన్పిస్తోంది. మాల వర్గానికి చెందిన మేధావి, కవి కత్తి పద్మారావును పార్టీలోకి చేరుకోవడం ద్వారా ఆయన చాలా తెలివిని ప్రదర్శించడం కాంగ్రెస్, టిడిపి మేధావులను నివ్వెరపరిచింది.
కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కాపులు పెట్టని కోటలా నిలిచారు. ఆ ఓటు బ్యాంకు దాదాపు 80 శాతం ఇప్పుడు చిరంజీవి వైపు వెళ్ళబోతోందన్న నివేదికలు వైఎస్ కు అందడంతో కంగారు మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఓటు బ్యాంకు మాలలు. కత్తి పద్మారావు, కారెం వంటి నాయకులను తన పార్టీలోకి తీసుకోవడం ద్వారా చిరంజీవి కాంగ్రెస్ కు సవాలు విసిరినట్టయింది.
కాంగ్రెస్ ఓటు బ్యాంకును చిరంజీవి దోచుకోబోతున్నారన్నది ఇప్పటి వాస్తవం. అయితే చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అనుకున్నంత బలపడలేదు. వంగా గీత వంటి అంకితభావం గల నాయకులు కూడా తెలుగుదేశం పార్టీని ధిక్కరించి చిరంజీవి పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత సంక్షోభం ఉండగా కాంగ్రెస్ పార్టీలో అతి విశ్వాసం కనిపిస్తోంది. ఈ రెండు అంశాలు చిరంజీవి పార్టీకి ప్లస్ పాయింట్స్ కానున్నాయి.












Click it and Unblock the Notifications
