చిరు పార్టీ నెంబర్ త్రీయా?brకాంగ్రెస్ నెంబర్ వన్ అంటున్న సిపిఎం సర్వే ఎంతవరకు కరెక్ట్?

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి పార్టీ మూడో స్ధానంలో ఉందని సిపిఎం సర్వేలో వెల్లడి కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడున్న ఊపు కొనసాగితే చిరంజీవి పార్టీ 200కు పైగా స్ధానాల్లో విజయభేరి మోగించాలి. మహిళలు, యువతీ యువకుల్లో చిరంజీవి పార్టీ మీద ప్రత్యేకాభిమానం కనిపిస్తోంది.

చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అగ్రస్ధానంలో ఉన్నట్టు సిపిఎం సర్వేలో వెల్లడైనట్టు సమాచారం బయటికి పొక్కింది. సిపిఎం రాష్ట్ర శాఖకు చెందిన నాయకుడొకరు ఈ విషయాలపై మీడీయాకు ఉప్పందించారు. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ నెంబర్ వన్ స్ధానంలో, టిడీపి నెంబర్ టూలో, చిరంజీవి పార్టీ నెంబర్ త్రీ స్ధానంలో ఉన్నాయి. అయితే చిరంజీవి జిల్లాల యాత్ర ప్రారంభించిన తర్వాత కానీ తుది అభిప్రాయానికి రాలేమని ఈ సర్వేలో చిన్న ట్విస్ట్ ఇవ్వడం విశేషం.

అయితే ఈ సర్వే వెనుక సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివి రాఘవులు వక్ర భాష్యాలు ఉన్నాయని, అదే పార్టీలో ఆయనను వ్యతిరేకిస్తున్న బిసి, కాపు నాయకులు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవితో పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడుతో ఎందుకు పొత్తు పెట్టుకోవలసివచ్చిందని కేంద్ర నాయకత్వం అడిగేసరికి రాఘవులు ఈ సర్వే బూచిని చూపిస్తున్నారని ఈ వర్గాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు, రాఘవులు ఒకే కులానికి చెందిన వారు కావడం వల్ల వారి మధ్య రహస్య అవగాహన ఉండని చిరు శిబిరం వారు కూడా ఆరోపిస్తున్నారు.

అమెరికాపై వైఖరి, బిజెపితో సంబంధాలు, తృతీయ ఫ్రంట్ పై వైఖరి తదితర విషయాల మీద చిరంజీవి పార్టీ స్పష్టమైన ధోరణిని ప్రదర్శించనందువల్ల ఆయనతో పొత్తుపై సిపిఎం తొందరపడడంలేదని బివి రాఘవులు చెబుతున్నారు. కమ్యూనిస్టు అయినా రాఘవులు కులాభిమానంతో వ్యవహరిస్తున్నారని చిరు శిబిరంవారు. సిపిఎం లోని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+