సొంతగూటికి రాములమ్మbrసినీ నటి, తల్లి తెలంగాణ నేత విజయశాంతి బిజెపి వైపు చూస్తున్నారు

ఇటీవల ఆమె హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ పార్టీలన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జాతీయ పార్టీలతోనే సాధ్యమని, ప్రస్తుతం రెండే జాతీయ పార్టీలున్నాయని, వాటిలో కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని, బిజెపి తెలంగాణకు అనుకూలంగా ఉందని, ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ పార్టీలన్నీ బిజెపితో కలిసి పనిచేయడం అవసరమని ఆ సందర్భంగా చెప్పారు. ఈ మాటలన్నప్పుడే ఆమె మనోగతం ఏమిటో బయట పడింది. తిరిగి సొంత గూటికి చేరుకోవాలనే ఆమె అంతరంగం అర్థమైంది.
సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆమె రాజకీయంగా ఏదో దారిని వెతుక్కోవాల్సిన స్థితిలో పడ్డారని అంటున్నారు. పార్టీని బలోపేతం చేయలేదని నిస్సహాయత ఆమెలో కనిపిస్తోందని, అందువల్లనే మళ్లీ బిజెపి వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. తల్లి తెలంగాణ పార్టీ స్థాపన సమయంలో వాస్తవ జీవితానికి సినిమా జీవితానికి తేడా ఉంటుందనే విషయం అమె గమనించినట్లు లేరు. దీంతో ఆమె ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయారు. దానికితోడు, ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో కయ్యానికి కాలు దువ్వారు. ఇది కూడా ఆమెకు ప్రతికూలంగానే పని చేసింది.












Click it and Unblock the Notifications
