శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ మీదికి పవన్

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్న ప్రజారాజ్యం పార్టీ ఉత్తరాంధ్రలో రోడ్ షోలకు పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎన్టీఆర్ రోడ్ షోలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కంటే ప్రజారాజ్యంలో కలకలం ఎక్కువైంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రభావానికి విరుగుడుగా పవన్ కల్యాణ్ ను ప్రయోగిస్తున్నారు. ఎన్టీఆర్ ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించారో ఆ ప్రాంతాల్లో పవన్ రోడ్ షోలకు ప్రణాళికను సిద్ధం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ఉత్తరాంధ్ర యాత్ర 21 న ముగియనుంది. 22 నుంచి పవన్ కల్యాణ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. పవన్ కల్యాణ్ ను తెలంగాణ ప్రచారానికే ఎక్కువగా ఉపయోగించుకోవాలని ప్రజారాజ్యం అనుకున్నా, ఇప్పుడు అనివార్య పరిస్ధితుల్లో ఉత్తరాంధ్రలో దింపవలసి వస్తోంది.

పవన్ కల్యాణ్ ప్రసంగంలో సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాలకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయన ప్రసంగంలో ఒక సామాజిక నిబద్ధత కనిపిస్తోంది. కానీ ఎన్టీఆర్ ప్రసంగాల్లో ఆవేశం, ఎంత వరకు తాత స్మరణ తప్ప డీప్ గా సబ్జెక్ట్ మీద లోతుగా వెళ్ళడం లేదు. గతంలో చిరంజీవి పర్యటనల్లో వచ్చిన స్పందన కంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎక్కువగా ఉండడంతో చిరంజీవి కుటుంబం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పవన్ కల్యాణ్ నిన్న, నేడు కొన్ని మీడీయాలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో చిరంజీవి తప్ప తాను గానీ తన కుటుంబ సభ్యులు కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోమని ఆయన చెప్పారు.

అల్లు అరవింద్ తో తనకు విభేదాలు లేవని పవన్ కల్యాణ్ చెబుతున్నాడు. గతంలో ఆయన అరవింద్ మీద ఎన్నో ఆరో పణలు పరోక్షంగా చేశారు. ఇప్పుడు కూడా ఆ విభేదాలు ఉన్నట్టు కన్పిస్తోంది. పవన్ కల్యాణ్ ను ఉత్తరాంధ్ర ప్రచారంలోకి దించడానికి చిరు కుటుంబ సభ్యులు పెద్ద ఎక్సర్ సైజే చేసినట్టు కనిపిస్తోంది. కులం అనే ఫ్యాక్టర్ గురించి పవన్ కల్యాణ్ తన ఇంటర్వ్యూలలో ఇచ్చిన అభిప్రాయాలు చాలా విలువైనవి. వెనుకబడిన వర్గాలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ ప్రభావం బాగా ఉండే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X