'సాక్షి' పాఠాలు

వార్తా కథనాన్ని తప్పు పడుతూ మాత్రమే కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డి మహితను పొగడుతూ, వైయస్ జగన్ నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తూ సాక్షి వార్తాకథనం ప్రసారం సాగుతోంది. దానికి తోడు, ఆ కథనంలో జర్నలిజం పాఠం కూడా చేర్చారు. ఆ వార్తాకథనం జర్నలిజం స్ఫూర్తి విరుద్ధంగా ఉందని చెప్పడానికి ఎలా వార్తలు రాయాలో కూడా సుద్దులు చెప్పారు. అందుకు సంబంధించిన మార్గదర్సక సూత్రాలను వ్యాఖ్యానంలో చేర్చారు. దానికి ఇచ్చిన వాయిస్ ఓవర్ కథనం ఎవరికీ సాక్షికి తప్ప ఎవరికీ జర్నలిజం స్ఫూర్తి లేదంటూ అర్థం వచ్చేలా ఉంది.
అక్షరాలను అపవిత్రం చేశారని సాక్షి బాధపడింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు ఒక బిడ్డను వదిలివెళ్లారంటూ జగన్ రెండు చేతులూ జోడించే చిత్రాన్ని చేర్చింది. పదే పదే వైయస్ జగన్ ను ఆ వార్తాకథంలో చూపించారు. దానికి బిబిసి వార్తాకథనాన్ని జోడించింది. వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై బిబిసి ప్రసారం చేసిన వార్తాకథనాన్ని చూపించింది. భారత రాజకీయాల్లో వైయస్ అంతటి గొప్ప నాయకుడు లేరని బిబిసి వ్యాఖ్యానించినట్లు చెప్పారు. సాక్షికి, వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైన సీనియర్ జర్నలిస్టుల వ్యాఖ్యలను ఆ వార్తాకథనానికి జోడించింది.
సాక్షికి పుట్టుకతోనే రాజకీయ పాక్షికత ఉందని, అటువంటి పత్రిక నిష్పాక్షికత గురించి పాఠాలు వల్లె వేయడటమేమిటని తెలుగు జర్నలిస్టులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఈ వార్తాకథనం వైయస్ జగన్ స్థాయిని పెంచలేదని గిట్టనివారు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications