'సాక్షి' లో ఆ భూతాలు నిజమా?

YS Jagan
హైదరాబాద్: 'సాక్షి' దినపత్రికలో వివిధ సంస్ధలు 500 కోట్ల పెట్టుబడులు పెట్టాయని, అందులో సాక్షి చైర్మన్ వైఎస్ జగన్ పెట్టుబడి ఒక్క రూపాయి కూడా లేదని 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక రెండు రోజులుగా ప్రత్యేక కథనాలను ప్రచురించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు కాబట్టే ఆయా సంస్ధలు ప్రభుత్వం ద్వారా తమ పనులను చేసుకోడానికి ఆ పత్రికలో పెటుబడులు పెట్టాయన్నది ఆ వార్తా కథనాల సారాంశం.

చంద్రబాబు నాయుడి హయాంలో ఒకసారి మూతబడి మళ్ళీ ప్రారంభమైన 'ఆంధ్రజ్యోతి' పత్రికలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారో బయటికి తీయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది కానీ పట్టుకోలేకపోయినట్టు కనిపిస్తోంది. దానికి కారణం కార్పొరేట్ సంస్ధల ద్వారా కాకుండా చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా బ్లాక్ మనీ పెట్టించారని కాంగ్రెస్ నాయకులు ప్రైవేటుగా విమర్శిస్తున్నారు.

మారిషస్ నిధులతో వైఎస్ జగన్ మాయా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని నేడు ఆంధ్రజ్యోతి రాసింది. పరోక్ష పద్ధతిలో ఎఫ్ డి ఐ లను మళ్ళించారని, ఆటోమేటిక్ రూపంలో నిధులు సేకరించారని ఆరోపించింది. సెబి నిషేధంలో ఉన్న ఒక కంపెనీ జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని బయటికి తీసింది.

సత్యం రామలింగరాజు బినామీ కంపెనీలు జగన్ పత్రికలో పెట్టుబడులు పెట్టాయన్నది మరో ప్రధాన ఆరోపణ. అయితే సత్యం రాజు చంద్రబాబు నాయుడు హయాంలో వందకోట్ల రూపాయలను తెలుగుదేశం ఐడి కార్డులను ముద్రించడానికి వెచ్చించిందని, మరో పదిహేను కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ ను అమెరికాలో చదివించడానికి సత్యం రాజు ఖర్చు పెట్టారని మరో ఆరోపణ వచ్చింది.

ఇక్కడ చంద్రబాబు, వైఎస్ ఇద్దరూ దొందూ దొందుగా కనిపిస్తున్నారు. ఎవరు ఎంత ఎక్కువ సంపాదించుకున్నారన్నదే చర్చనీయాంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+