పులివెందుల పులి వైయస్

సమాజసేవలో నిమగ్నమైన ఆయన 1978లో రాజకీయరంగ ప్రవేశం చేసారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన నాలుగు సార్లు లోక్ సభ సభ్యుడిగా, ఆరు సార్ల అసెంబ్లీ కి ఎన్నికయ్యారు. ఆయన పోటి చేసిన ప్రతి సారీ విజయం సాధించారు. "అపజయాన్నే జయించారని" ఆయన అభిమానులు ఆయన గురించి చెప్తారు. ఇలా అపజయమే ఎరుగని యోధుడు వై.యస్. 1999 నుండీ 2004 వరకూ, 5 సంవత్సరాల పాటు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎపిసిసి) అధ్యక్షుడిగా 1983-1985 మరియు 1998-2000 మధ్య రెండు సార్ల ఎన్నికయ్యారు. ఆయన 1980 - 83లో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య, విద్యా శాఖలను నిర్వహించారు.
సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడిగా పేరొందిన ఆయన ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొనేందుకు 2003వ సంవత్సరంలో మూడు నెలల పాటు 1400 కిలో మీటర్ల పాదయాత్ర చేసారు. దీంతో ప్రజలకు చేరువైన వై.యస్ 2004లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జలయగ్నం పేరుతో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి, రైతులకు ఉచిత విద్యుత్ అందించి, ఆరోగ్య శ్రీ వంటి ప్రజాకర్షక పథకాలను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు, రైతులకు రుణాలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులను చూరగొన్నారు. దీంతో ఆయన 2008లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయదుందుభి మోగించి మరో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యా అభివృద్ధి, విశ్ససనీయతే తమను 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి విజయం చేకూర్చి పెట్టిందని రాజశేఖర రెడ్డి పదే పదే చెబుతూ వచ్చారు.
కానీ సెపెంబరు 2వ తారీఖున నాటకీయ పరిణామాల మధ్య అదృశ్యమైన హెలీకాప్టర్ ఉదంతంలో దురదృష్టావశాత్తు దుర్మరణం చెందారు.












Click it and Unblock the Notifications