చిరు-సోనియా అవగాహన భస్మాసుర హస్తమా?

Chiranjeevi
హైదరాబాద్: ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని కలిసి, ఆమె ఇచ్చిన హామీలతో ఆనందపరవశం చెందిన చిరంజీవి ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి పరిమితం కావలసి వచ్చింది. తెలంగాణలోనూ అవకాశమున్నా ప్రజారాజ్యం పోటీచేయలేని పరిస్ధితి. ఆయన కాంగ్రెస్ తో రహస్య అవగాహన కుదుర్చుకోవడం భస్మాసుర హస్తం కానుందా?

తాను సమైక్యవాదినంటూ ప్రకటించుకున్న ప్రజా రాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలంగాణలో పర్య టనలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆ జిల్లాల్లో తనకు పోలీసుల రక్షణ కూడా అక్కర్లేదని, ఒంటరి గానే పర్యటనలు చేయగలనని ప్రకటనలచ్చిన ఆయన ఆ తర్వాత సన్నిహితుల సూచనల మేరకు వెనక్కి తగ్గారు. తెలంగాణ జిల్లాల్లో నెలకొన్న పరిస్థి తులను బట్టి తాను పర్యటనలను ఇక ఇప్పట్లో జర పలేనని తనంతట తానే ప్రకటించారు.

ఇటీవల రాష్టస్థ్రాయి పార్టీ సమావేశంలో తెలంగాణ ప్రాంతా నికి చెందిన కొందరు నాయకులు చిరంజీవిని తెలంగాణ పర్యటనకు రావాలని ఆహ్వానించినప్పటి కీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచా రం. పార్టీలోని సీనియర్‌ నాయకులుగా భావిస్తున్న వారందరూ ఒక్కొరొక్కరుగా బయటికి వెళ్లిపోతుం డడంతో నైరాశ్యానికి గురైన పార్టీ అధిష్ఠానం క్రి యాశీలకంగా కార్యక్రమాలను చేపట్టలేకపోతోంది. పోలవరం ఉద్యమ యాత్రతో శక్తి పుంజుకున్నట్లు కనిపించినా, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాతో జరిపిన చర్చలు, కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేందుకు తీసుకున్న నిర్ణయాలు దిగువ స్థాయి కార్యకర్తల ఉత్సాహాన్ని నీరుగార్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+