కెసిఆర్ హైజాక్ చేశారా?

కేసుల ఎత్తివేత వ్యవహారంలో తాను కూడా క్రెడిట్ కొట్టేసే విధంగా వ్యవహరించారు. పైగా, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై ఆధిపత్యం సాధించారు. తాను ఉద్యమాన్ని నడిపే నేతగా, మిగతావారంతా అనుసరించే వారుగా చిత్రీకరించడంలో ఆయన విజయం సాధించారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను ఎక్కడా తక్కువ చేసినట్లు మాట్లాడకుండానే వారి మీద తాను పైచేయి సాధించారు. ఆయన ప్రసంగమంతా అదే రీతిలో సాగింది. కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై విమర్శలు చేయలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. కాంగ్రెసు నాయకులను విమర్శించలేదు. కానీ కాంగ్రెసు నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరిచినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. దాంతో ఆయన తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు.
కాంగ్రెసు తెలంగాణ నాయకులను కెసిఆర్ ఫిక్స్ చేశారు కూడా. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగే పోరాటంలో దారి తప్పకుండా వారిని కట్టడి చేశారని కూడా చెప్పవచ్చు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తెలంగాణ కోసం అనివార్యంగా పోరాటం చేయాల్సిన అనివార్యతను కాంగ్రెసు తెలంగాణ నాయకులకు ఆయన కల్పించారని చెప్పవచ్చు. అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన చెప్పారు. అందుకు పక్క నుంచి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అందరం కలిసే పోరాడుదామనే మాటను అందించారు. ఆ రకంగా కాంగ్రెసు తెలంగాణ నాయకులు కెసిఆర్ దారిలోకి రావాల్సిన పరిస్థితిని కల్పించారని చెప్పవచ్చు. మొత్తం మీద, కెసిఆర్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల దీక్షను కూడా తనకు అనుకూలంగా తిప్పుకోవడంలో విజయం సాధించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications