జనం తగ్గిన వైయస్ జగన్ కోసం మేధావుల సరికొత్త వ్యూహాలు

జగన్ తన ప్రత్యర్థులకు సభ ద్వారా గట్టి జవాబు ఇచ్చి, సవాల్ చేస్తారని ఆశించే యువకులు స్వచ్చందంగా సభలకు వస్తున్నట్లు వెల్లడయింది. అయితే, జగన్ సభలను అనుస రిస్తున్న వారికి.. ప్రతి సభలోనూ రొటీన్ ప్రసంగాలు వినిపి స్తుండటంతో వారంతా ఆయనను అనుసరించకుండా అక్కడితో ఆగిపోతు న్నారు. రెండోరోజు కూడా జగన్ సభలు, ప్రసంగాలు పేలవంగా ఉండటంతో మీడియా కూడా హడావుడి, ప్రాధాన్యం తగ్గించింది. సాయంత్రం వేళల్లో గ్రామాల్లో జనం ఒకచోట చేరతారని గ్రహించిన జగన్ వ్యూహ బృందం తన యాత్రను నిదానంగా, నింపాదిగా సాయంత్రం వరకూ కొనసా గిస్తున్నట్లు కనిపిస్తోంది. తుని పట్టణం లో ఈ వ్యూహం అనుసరించినందుకే జనాలు వచ్చారు.
జగన్ తన ఓదార్పు యాత్ర లక్ష్యాన్ని ప్రజల వద్దకు చేర్చడానికి కొత్త పంథా అనుసరిస్తున్నట్లు ఆయన వర్గీయుల తాజా వ్యూహం స్పష్టం చేస్తోంది. జగన్ హాజరయ్యే గ్రామానికి ముందు కొంత హడావుడి వాతావరణాన్ని సృష్టించి, వాటిని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజల్లోకి పంపించే సరికొత్త ప్రచార వ్యూహానికి తెరలేపారు. అక్కడ కొందరు యువకులు, మహిళలు వేదికపె ైకి ఎక్కి, రోశయ్య సర్కారుపై ధ్వజ మెత్తడం, మధ్యలో కాబోయే సీఎం జగన్ జిందాబాద్ అన్న నినాదాలు చేయడం, జగన్ కోసం ప్రాణాలర్పిస్తాం అన్న రొటీన్ నినాదాలు, దృశ్యాలు ఆయా సభల్లో దారిపొడవునా కనిపించాయి.












Click it and Unblock the Notifications