మొండికేసిన జగన్ క్యాంప్

వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ నిర్ద్వంద్వంగా వైయస్ జగన్ వంటనే ఉంటున్నారు. జగన్ కోసం ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ను కూడా వ్యతిరేకించేదాకా వెళ్లారు. సమైక్యాంధ్రలోనే అభివృద్ధి జరుగుతుందని ఆమె పాత పాటను కొత్తగా ఎత్తుకున్నారు. ఎపిఐఐసి మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైయస్ జగన్ ధిక్కార రాజకీయాలకు ఆలంబనగా నిలిచారు. కాగా, శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, కమలమ్మ, శ్రీనివాసులు కూడా జగన్ కు మద్దతిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో శాసనసభ్యుడు చంద్రశేఖర రెడ్డి జగన్ తప్ప తనకు మరో మాట లేదని అంటున్నారు.
పార్లమెంటు సభ్యుల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి, సబ్బం హరి జగన్ మద్దతిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట ఉన్నారా, లేదా అనేది తెలియడం లేదు. జగన్ వెంట ఉన్న నాయకులు, శాసనసభ్యులు తమపై కాంగ్రెసు అధిష్టానం తీసుకునే చర్యలకు సిద్ధపడే ఉన్నారు. అయితే, అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, అసలు చర్యలు తీసుకుంటుందా అనేది తెలియడం లేదు. జగన్ వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications