మళ్ళీ సమైక్యాంధ్ర రంగంలోకి లగడపాటి!

ఈనెల 28న కేంద్రం తెలంగాణపై ఒక ప్రకటన (మూడో ప్రకటన) చేసే అవకాశమున్నందున సీమాంధ్ర నాయకులు యాక్టివ్ అయ్యారు. గతంలో సమైక్యాంధ్ర గళాన్ని గట్టిగా విన్పించిన ఒక నాయకుడు మండల స్ధాయి వరకు సమైక్యవాదులకు "చేయూత" ఇస్తున్నట్టు సమాచారం. కావూరి సాంబశివరావు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుండగా ఈ యువ నాయకుడు క్షేత్ర స్ధాయిలో ఆందోళనలకు అండగా నిలిచినట్టు కన్పిస్తోంది.
ఆంధ్ర, సీమలలో ఉన్న సామాన్యులకు మాత్రం సమైక్యాంధ్ర మీద ఆసక్తి లేనట్టే కనిపిస్తోంది. ఎప్పటికైనా కలవని కాపురం కాబట్టి తెలంగాణ నుంచి విడిపోవడమే మంచిదన్న అభిప్రాయం వారిలో ఉంది కాబట్టే సమైక్య ఉద్యమం ఇప్పటికీ ప్రజా ఉద్యమం కాలేకపోయింది. ఉద్యమం నిరాహారదీక్షలు చేసే చోటామోటా నాయకులకే పరిమితమైంది. వసంత నాగేశ్వరరావు వంటి ప్రత్యేకాంధ్ర నాయకులు యాక్టివ్ అయితే బాగుంటుంది కానీ ఎందుకో ఆయన ఇప్పుడు ఉత్సాహం చూపడం లేదు. కోస్తా కమ్మ నాయకులే ఆయనను తగ్గమని సంకేతాలు పంపినట్టు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.
సమైక్యాంధ్ర జెఎసిలో కమ్మ నాయకుల పరోక్ష ఆధిపత్యం ఉండడంతో చిరంజీవి కూడా ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ సమైక్యాంధ్ర నిలబడినా వారి ఆధిపత్యమే ఉంటుందని, తాను అతిధి పాత్ర మాత్రమే పోషించుకోవలసి ఉంటుందని చిరంజీవి గ్రహించినట్టు కన్పిస్తోంది. ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ విధానాని అనుసరించి ఉంటే బాగుండేదని ఆయన తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా బలపడగా, సమైక్య ఉద్యమం నాయకుల ఉద్యమంగా మిగిలిపోవడాన్ని చిరంజీవి తన జిల్లాల పర్యటనలో గ్రహించారు.












Click it and Unblock the Notifications