చిరంజీవి వర్సెస్ జగన్ రాజకీయాలు!

తనకు చెక్ పెట్టేందుకు చిరంజీవిని తీసుకురావాలన్న ముఖ్యమంత్రి రోశయ్యకూ జగన్ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 8 నుంచి శ్రీకాకుళం నుంచి ప్రారంభం కానున్న ఓదార్పు యాత్ర తర్వాత జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న ట్లు సమాచారం. ఆ సందర్భంగా కాపుల ఖిల్లాగా పేరున్న తూర్పు గోదావరి జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయి లో జన సమీకరణ చేసేందుకు జగన్ వర్గం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ముగ్గురు మంత్రులు, జడ్పీ ఛైర్మన్, కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మేరకు కాకినాడలోని గెస్ట్ హౌస్‌లో కొద్దిరోజుల నుంచి వరసగా భేటీలు వేస్తున్నట్లు సమాచారం. మంత్రి పిల్లి, విశ్వరూప్, వట్టి వసంతకుమా ర్ జనసమీకరణపై దృష్టి సారించినట్లు తెలిసింది. నిధుల సమీకరణ, జనసమీకరణ వంటి కీలకమైన అంశాలను కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి తెరవెనుక ఉండి నడిపి స్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తూర్పు గోదావరి రాజకీయ చరిత్రలో ఇప్పటివరకూ ఏ నాయకుడికీ రానంత జనాలను సమీకరించాలన్న లక్ష్యంతో ఓదార్పు యాత్రకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి పట్టు, ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో చిరంజీవి కన్నా తనకే ప్రజాదరణ, ప్రజాకర్షణ ఉందన్న సంకేతాలను అధిష్ఠానానికి పంపేందుకు జగన్ వర్గీయులు జన సమీకరణపై దృష్టి సారిస్తున్నారు.












Click it and Unblock the Notifications