'వదల రామోజీ! నిన్నొనదలా'

Undavalli Arun Kumar
హైదరాబాద్: మళ్ళీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు, ఈనాడు అధినేత రామోజీరావుకు మధ్య యుద్ధం రాజుకుంటున్నది. గతంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాల మీద అస్త్రాలు సంధించి, చర్యలు తీసుకోవలసిందిగా సంబంధిత అధికారులకు లేఖలు రాసి, వారిపై వైఎస్ తో ఒత్తిడి తెప్పించి, రామోజీకి నిద్రలేని రాత్రులను తెచ్చి పెట్టిన ఘనత ఉండవల్లిది.

ఉండవల్లి ఉడుంపట్టు పట్టడంతో వివిధ న్యాయస్ధానాల్లో అథారిటీలలో కేసుల ఒత్తిడి భరించడం రామోజీరావుకు కష్టమైంది. సంబంధిత అధారిటీల ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్ధ తన డిపాజిటర్లందరికీ డబ్బు చెల్లించి చేతులు దులుపుకుని దుకాణం మూసేసుకోవలసి వచ్చింది. ఆ డబ్బు చెల్లించడానికి రామోజీరావు తన అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యమైన ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ లో కొంత వాటాను కంపానీలకు అమ్ముకోవలసి వచ్చింది.

వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రి రోశయ్యకు రామోజీరావు దగ్గరవుతున్నారన్న సంకేతాలు అందడంతో జగన్- వైఎస్ వర్గీయుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు మళ్ళీ వీరంగం చేస్తున్నారు. రోశయ్య పాలన భేషుగ్గా ఉందని, అక్రమాలు ఏవైనా జరిగి ఉంటే అవి వైఎస్ హయాంలోనేనన్న భావం వచ్చేలా వార్తాకథనాలు ఈనాడులో వస్తుండడంతో ఉండవల్లి మేల్కొన్నారు. రామోజీపై చట్టపరంగా చర్యలు తీసుకోవలసిందిగా ఉండవల్లి ముఖ్యమంత్రి రోశయ్యకు లేఖ రాసి తేనె తుట్టె కదిపారు.

జగన్ ముఖ్యమంత్రి అయితే తలనొప్పులు కొనసాగుతాయని భయపడిన ఈనాడు గ్రూపునకు రోశయ్య సిఎం కావడంతో గొప్ప రిలీఫ్ వచ్చింది. ఆయన ముఖ్యమంత్రిగా స్ధిరపడడానికి ఆ మీడియా గ్రూపు పరోక్షంగా సాయం చేస్తోందన్న అభిప్రాయం ఉంది. సాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాల అక్రమాలను కడిగిపారేసే ఈనాడు గ్రూపు రోశయ్య హయాంలో అక్రమాలే జరగనట్టు సంయమనం పాటిస్తోంది. జగన్ వర్గానికి అక్కడే మండుకొస్తోంది. రోశయ్య తన వంతు సహాయంగా రామోజీరావు విషయంలో ఎంత వరకు సంయమనం పాటిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+