సోనియా సరసన కెసిఆర్

అంతర్జాతీయ రాజకీయాలను అధ్యయనం చేయడానికి అమెరికా నుంచి మినహా మిగతా అన్ని దేశాల నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలు 300 నాయకులను ఎంపిక చేసుకున్నాయి. అత్యధిక ప్రజలను వారు ఎలా ప్రభావితం చేయగలిగారనే కోణం నుంచి విశ్వవిద్యాలయాలు విద్యార్థులు పరిశోధనలు చేస్తారు. భారత్ నుంచి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ తదితరులున్నారు. ఆ రకంగా కెసిఆర్ సోనియా సరసన నిలిచారు.
విస్మరణకు గురైన తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి తెర మీదికి తెచ్చి, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా ఎలా మార్చారనే కోణంపై పరిశోధనలు జరుగుతాయి. కొద్ది నెలల్లో రీసెర్చ్ స్కాలర్లు ఆ నాయకుల వెంట తిరిగి, వారి ఉద్యమాలను అధ్యయనం చేసి నివేదికలు సమర్పిస్తారు.












Click it and Unblock the Notifications