వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి కొత్త సినిమాలో ఇరగదీస్తాడా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సినిమాలలో నిన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి ఎవరెస్టు శిఖరం. రాజకీయాల్లో చిన్న కొండతో సైతం పోల్చలేని పరిస్తితి. రెండు సంవత్సరాల క్రితం చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆందరిదీ ఒకే మాట. ఈసారి చిరంజీవి ముఖ్యమంతి కావడం ఖాయం అని. అదీ స్వంతగా కావచ్చు. లేదా వేరే ప్రధాన పార్టీతో కలిసి కావచ్చు. మొత్తానికి చిరంజీవి ముఖ్యమంత్రి కావటం ఖాయమని అందరూ ఊహించారు. కాని అనుకోని విధంగా ఆయనకు రాష్ట్రంలో ఉన్న ఇమేజ్ అయనకు ఓట్లు రాల్చలేక పోయింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయన ప్రభావం శూన్యం. దీంతో ఆయనకు అప్పుడు తెలిసి వచ్చింది రాజకీయాలకు, సినిమాలకు తేడా. తన స్టార్ ఇమేజ్ ను చూసి ఓట్లు పడతాయనుకున్న మాట ఉట్టి మూటే అయ్యింది. అందుకే అయన తమ్ముడు నాగబాబు మళ్లీ ప్రజారాజ్యాన్ని బలోపేతం చేయడానికి కసరత్తు ప్రారంభించాడు.

ఇదిలా ఉండగా చాలా రోజుల తరువాత చిరంజీవి తన పాత బాటను ముద్దాడాలనుకుంటున్నాడు. ఓ చిత్రంలో నటించడానికి సంతకం చేశాడనే విషయం ఆయన అభిమాలను ఆనంద పరిచింది. అన్నట్టుగానే ఆయన సినిమా సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు ఆయన అభిమానులతో పాటుగా అందరినీ కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి.

ఎన్టీఆర్ తరువాత రెండు దశాబ్దాలపాటు చిరంజీవి తెలుగులో నెంబర్ వన్ హీరో. ఆయన చిత్రం వచ్చిందంటే చాలు అభిమానులతో పాటు ప్రజలు ఎదురు చూసేవారు. అయితే రాజకీయాల్లో ఫెయిల్ అయిన చిరంజీవికి సినిమాల పరంగా ఇమేజ్ డామేజ్ ఏమీ కాలేదనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆయన చిత్రం కోసం అభిమానులు ఆర్రులు చాస్తున్నారు. అలాంటి చిరంజీవి ఒక్క చిత్రంలో నటించినా, మరిన్ని చిత్రాల్లో నటించినా తన రెండవ ఇన్నింగ్స్ ను మొదటి ఇన్నింగ్స్ లాగే నిలబెట్టుకోగలుగుతాడా అనేది ప్రశ్న. నేటి తరం యువ హీరోలతో ఆయన పోటీ పడి నిలబడ వచ్చు కానీ వారిని డామినేట్ చేస్తాడా అనేది ప్రశ్న. అది పవన కల్యాణ్ ను కావచ్చు, రామ్ చరణ్ ను కావచ్చు, అల్లు అర్జున్ ను కావచ్చు, ఎన్టీఆర్ ను కావచ్చు, ప్రభాస్ ను కావచ్చు, మరెవరినైనా కావచ్చు. అయితో చిరంజీవి ఎక్కడా నేటి యువ హీరోలు ఎక్కడ అనే ప్రశ్న ఉదయించవచ్చు.

కానీ నేటి యువతకు తగ్గట్టు చిరంజీవి మారగలడా అనేదే ప్రశ్న. బాక్సాఫీసు బద్దలు కొడతాడు అనే మాటలు పక్కన పెట్టాలి. కేవలం అభిమానులు మాత్రమే సినిమా చూస్తే అలరించినట్టు కాదని అర్థం చేసుకోవాలి. అభిమానులు బాగుందనటం మామూలే. కానీ సామాన్య జనం బాగుంది అనేలా నటిస్తాడా అనేది ఇక్కడ విషయం. అలా చేస్తేనే ఆయనకు పూర్వ ఇమేజ్ మాత్రమే కాకుండా తన పార్టీకి అది లాభాన్నిస్తుంది.

పాత చిత్రాల్లో మాదిరిగా డాన్స్ చేయగలడా అనేది మిలియన్ డాలర్గ ప్రశ్న. ఎందుకంటే గతంలో ఆయన గుర్రం మీదనుండి పడటంతో కాలికి దెబ్బ తగిలింది. మరొక విషయం చిరంజీవి ఈ మధ్య లావెక్కాడు. మొన్న తిరుమల కాలినడకలో వెళ్తుంటే అయనకు మధ్యలోనే ఆయాసం వచ్చింది. ఈ రెండింటి కారణంగా ఆయన అభిమానులను, యువతను ఆకట్టుకునేలా డాన్సు చెయ్యగలడా అనేది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. అయితే అభిమానుల కోసం బావగారూ బాగున్నారా చిత్రంలో బంగీ జంప్ చేసి తన ధైర్యాన్ని చిరంజీవి నిరూపించాడు. బంగీజంప్ చేయడం మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేయలేడని చెప్పలేం.

అంతేకాకుండా చిరంజీవి నేటి కథానాయికలకు సెట్ కాడన్నది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని ఆయన ఏలుతున్న సమయంలోనే ఠాగూర్ త్రిష, జై చిరంజీవలో సమీరా రెడ్డిలతో జట్టుకట్టాడు. ఆయా చిత్రాల్లో వారు ఆయనకు కూతుర్ల మాదిరిగా ఉన్నారనే కామెంట్ వచ్చింది. ఇప్పుడు ఆయన మరీ బొద్దుగా తయారయ్యాడు. సీనియర్ ఎన్టీఆర్ బొద్దుగా ఉన్నప్పటికీ తన రెండో ఇన్నింగ్స్ ను విజయవంతగా పూర్తి చేసుకున్నాడు. తెలుగు దేశం పార్టీ వ్యతిరేకులు కూడా సినిమా పరంగా ఆయన్ను పొగిడేవారు. కాని ఇప్పుడు చిరంజీవికి అలాంటి పరిస్థితి లేదనే చెప్పవచ్చు. అయితే దానికి చిరంజీవి తప్పు పట్టం. సినిమాలను, రాజకీయాలను వేరువేరుగా చూడాల్సింది సినిగా చూసేవారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X