అదును కోసం జగన్?

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కున్న బలంపై అత్యంత విశ్వాసంతో ఉన్నట్లు చెబుతున్నారు. తాను తలుచుకుంటే ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వాన్ని పడగొట్టగలనని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకు సంబంధించిన లెక్కలను జగన్ వర్గం చెబుతోంది. తమకు శాసనసభలో 104 మంది శాసనసభ్యుల బలం ఉందని వారంటున్నారు. తమకు 95 మంది కాంగ్రెసు సభ్యులు, ఏడుగురు ప్రజారాజ్యం సభ్యులు, ఇద్దరు తెలుగుదేశం సభ్యులు మద్దతిస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ స్థితిలో అదును కోసం వైయస్ జగన్ కాచుకుని ఉన్నారని అంటున్నారు. పార్టీ అధిష్టానం తనపై చర్య తీసుకున్న మరుక్షణం రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన వ్యూహాన్ని అమలు చేస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టిన మరుక్షణం తన వ్యూహాన్ని ఆయన అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి వర్గ విస్తరణ వల్ల తన వర్గానికి చెందినవారు మంత్రి పదవులు కోల్పోతారని, మంత్రి పదవులు దక్కనివారు తమతో రావడానికి సిద్ధపడతారని, దాన్ని అవకాశంగా తీసుకుని అధికారం చేజిక్కించుకోవాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం.

కాగా, జగన్ వ్యూహం ఫలించే అవకాశాలు లేవని అంటున్నారు. జగన్ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే కాంగ్రెసు శాసనసభ్యులను కనీసం 40 మందిని చీల్చాల్సి ఉంటుంది. అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 148 శాససభ్యులు కావాల్సి ఉంటుంది. అంత మందిని కాంగ్రెసు నుంచి చీల్చడం సాధ్యం కాదని అంటున్నారు. జగన్ కు 20 మందికి మించి తమ పార్టీ శాసనసభ్యుల మద్దతు ఉండదని కాంగ్రెసు అధిష్టానం అంచనా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెసుకు 156 మంది సభ్యులున్నారు. వారి నుంచి 20 మంది జగన్ వైపు పోతే ప్రజారాజ్యం, మజ్లీస్ శాసనసభ్యుల మద్దతు ద్వారా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలమని కాంగ్రెసు అధిష్టానం దీమాతో ఉంది. తెలుగుదేశం పార్టీకి 91 మంది సభ్యులున్నారు. వారిలో జగన్ వైపు ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే పోతారనే అంచనా ఉంది. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి జగన్ కు మద్దతిచ్చే అవకాశం ఉంది. వారు పార్టీ చర్య కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ చర్య తీసుకుంటే తప్ప వారు జగన్ కు అధికారికంగా మద్దతు ఇవ్వడానికి వీలు కాదు. కాగా, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల్లో శోభా నాగిరెడ్డి మాత్రమే ఇప్పటి వరకు బహిరంగంగా జగన్ వైపు ఉన్నారు. జగన్ చెబుతున్న మిగతా ఆరుగురు ఎవరో తెలియడం లేదు.

ఏమైనా, మంత్రులు బాల నాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి మంత్రులకు ఉద్వాసన చెప్పగానే జగన్ తన వ్యూహాన్ని అమలు చేస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గ విస్తరణ కోసమే జగన్ నిరీక్షిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ తనంత తానుగా బయటపడాలని పార్టీ అధిష్టానం చూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+