జగన్ పై మరో ఎత్తుగడ

వైయస్సార్ ప్రభుత్వ హయాంలోని అక్రమాలను, పక్షపాత వైఖరిని ఎండగట్టి, వైయస్సార్ కీర్తిని తగ్గించే ప్రయత్నానికి దిగింది. ఇందులో భాగంగానే ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చినట్లు భావించవచ్చు. వైయస్సార్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించాయి. అన్ని సంస్థలను తన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు నిబంధనలను కూడా తుంగలో తొక్కారనే విషయాన్ని నిదర్శనాలతో సహా బయట పెడుతున్నారు.
ఖమ్మం జిల్లా బయ్యారం గనుల వ్యవహారం, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి వ్యవహారాలు అన్నీ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. వైయస్ ను మహానేతగా అభివర్ణిస్తూ జగన్ చేస్తున్న ప్రచారానికి అవి విరుగుడుగా పనిచేసే అవకాశం ఉంది. కాకులను కొట్టి గద్దలకు వేశారని, పేద ప్రజలకు సంక్షేమ పథకాల పేర గోరంత ఇచ్చి తన కుటుంబ సభ్యులకు కొండలను తవ్వి పెట్టారని ఇప్పటికే వైయస్ పై వ్యతిరేక ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం ప్రభావాన్ని గమనించిన జగన్ తన ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో మండిపడుతున్నారు. వైయస్సార్ పై ఆరోపణలు చేస్తున్నవారికి శాపనార్థాలు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications