చెర్రీ, ఉపాసన నిశ్చితార్థం తేదీ ఖరారు

నిశ్చితార్థం, పెళ్లి కాకుండానే చెర్రీ, ఉపాసన కలిసి తిరుగుతున్నారు. ఇటీవల పోలో పోటీల్లో కలిసి హడావిడి చేశారు. రామ్ చరణ్ తేజ్, ఉపాసనల నిశ్చితార్థం నిజామాబాద్ జిల్లా దోమకొండలోని గడీలో జరుగుతుందని చెబుతున్నారు. ఆ గడీ ఉపాసన తాతకు సంబంధించింది. సంప్రదాయం ప్రకారం ఆ గడీలోనే నిశ్చితార్థం, వివాహం జరగాలని ఉపాసన కుటుంబ సభ్యులు భావించారని సమాచారం. దానికి చిరంజీవి కుటుంబ సభ్యులు అంగీకరించారని చెబుతున్నారు.
చెర్రీ, ఉపాసనల నిశ్చితార్థానికి దోమకొండలోని కోట ఇప్పటికే సిద్ధమైంది. నిశ్చితార్థం, పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరగాలని ఇరు కుటుంబాల సభ్యులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications