'రెబెల్' నుంచి జ్వాలాను ఆజర్ లాగాడా?

రెబెల్ నిర్మాతలు సంప్రదిస్తే ఆమె అంగీకరించడానికి కూడా దాదాపు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా పార్లమెంటు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్ అడ్డు వచ్చాడని తెలుస్తోంది. ప్రభాస్‌తో జ్వాలా నటించడానికి ఆయన అంగీకరించలేదంటూ ఓ వార్త వచ్చింది.
జ్వాలా గుత్తా అజరుద్దీన్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు. జ్వాలా, అజర్ మధ్య అఫైర్ నడుస్తున్నట్లు పెద్ద యెత్తున మీడియాలో ఊహాగానాలు చెలరేగాయి. దానివల్లనే జ్వాలా గుత్తాకు, చేతన్ ఆనంద్‌కు మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నట్లు చెబుతారు. అయితే, అజర్ ప్లాన్ మరో రకంగా ఉందని చెబుతున్నారు. జ్వాలాను బాలీవుడ్ ద్వారా పెద్ద యెత్తున సినీ రంగంలోకి దించాలనేది ఆయన ఉద్దేశమని చెబుతున్నారు. ఏమైనా, ప్రభాస్‌కు జ్వాలా పక్కన నటించే అవకాశం పోయింది.












Click it and Unblock the Notifications