ముగిస్తున్నారు!: 'జగన్'పై వేటు 'చిరు'కు చోటు

ఇక ప్రభుత్వానికి మద్దతిచ్చిన చిరు వర్గానికి కేబినెట్‌లో కనీసం రెండు బెర్త్‌లు కేటాయించారని, మంత్రివర్గంలో చోటు దక్కని వారికి ప్రత్యామ్నాయాలు చూడాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చారని తెలుస్తోంది. అంతకుముందు బొత్స పార్లమెంటు హాలులో పలువురు ఎంపీలతో సమాలోచనలు జరిపి వారి వారి నియోజకవర్గాలలోని జగన్ ఎమ్మెల్యేల బలాబలాలు, ఉప ఎన్నికలకు సిద్ధం కావాల్సిన తీరు, నిలబెట్టాల్సిన అభ్యర్థులు, జగన్ వర్గం వైపు వెళ్లేవారు, విజయావకాశాలు తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ కూడా జగన్ ఎమ్మెల్యేలకు బుధవారం నోటీసులు పంపించే అవకాశం ఉంది. వారి నుండి వివరణ తీసుకొని సాధ్యమైనంత త్వరగా ఈ తంతు ముగించాలని అభిప్రాయపడుతున్నారట.












Click it and Unblock the Notifications