వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ట్రాప్‌లో కాంగ్రెసు నేతలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణ అంశంపై కాంగ్రెసు తెలంగాణ నాయకులను ట్రాప్‌లో పడేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీలోగా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని వార్తలు బలంగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులను పురికొల్పేందుకు ఆయన సిద్ధపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మండలి, ప్యాకేజీలు అవసరం లేదనే బలమైన సంకేతాలను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారు. తెలంగాణకు చట్టబద్దమైన ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు బలంగా వార్తలు వస్తున్నాయి. దీన్ని వ్యతిరేకించే వ్యూహాన్ని కెసిఆర్ రూపొందించి, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులను ఎగదోసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కెసిఆర్ ట్రాప్‌లో తమ పార్టీ తెలంగాణ నాయకులు పడబోరని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. తాము కెసిఆర్ ట్రాప్‌లో పడబోమని తెంలగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. అయితే, రాజీనామాలకు కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులను సిద్ధం చేయాలనే వ్యూహంతో కెసిఆర్ కదులుతున్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుంది తప్ప ఉప ఎన్నికలు రావని ఆయన నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పోటీ లేకుండా గెలిచేందుకు ఏర్పాట్లు చేస్తామని కూడా ఆయన భరోసా ఇస్తున్నారు. తెలంగాణ జెఎసి కోదండరామ్ కూడా కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు అదే విషయం చెబుతున్నారు.

రాజీనామాలు చేస్తామని చెబుతూ వచ్చిన కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు క్రమంగా వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో కూడా కెసిఆర్ తన పట్టు వీడడం లేదు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి, తాను రాజీనామా చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని మాత్రం ఆయన దూరం పెట్టి, మిగతా రాజకీయ పార్టీల తెలంగాణ ప్రజాప్రతినిధులను కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే, కెసిఆర్ వ్యూహం ఫలిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

English summary
TRS president K Chandrasekhar rao is trying prepare Congress Telangana leaders for resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X